Faima : సీక్రెట్ లవర్ ను పరిచయం చేసిన ఫైమా.. పటాస్ ప్రవీణ్ ను మోసం చేసిందా..?
Faima : ఫైమా అంటే బుల్లితెర ప్రేక్షకులకు బాగా తెలుసు. ఎందుకంటే ఆమె బుల్లితెరపై చేసిన, చేస్తున్న హంగామాను ఇంకా ఎవరూ మర్చిపోలేదు. ఆమె పటాస్ తో కెరీర్ స్టార్ట్ చేసింది. తర్వాత జబర్దస్త్ తో ఓ రేంజ్ లో దూసుకుపోయింది. అక్కడి నుంచి ఆమె బిగ్ బాస్ లోకి కూడా వచ్చింది. బిగ్ బాస్-6లో పాల్గొంది. అక్కడ దాదాపు పది వారాలకు పైగా ఉంది. అయితే ఆమె బిగ్ బాస్ లో ఉన్నప్పటి వరకు కూడా పటాస్ ప్రవీణ్ తోనే తిరిగింది. అతనే తన లవర్ అని, అతనితోనే పెళ్లి అంటూ చాలా వీడియోల్లో చెప్పింది. ఇద్దరూ అందుకు తగ్గట్టే ప్రపోజ్ లు కూడా చేసుకున్నారు.
బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఫైమా కోసం ప్రవీణ్ ఓ లెటర్ రాశాడు. ఆమె తిరిగి వచ్చిన తర్వాత ఆమె ఇంటకి వెళ్లి సెలబ్రేట్ చేశాడు. అంతే కాకుండా తన మెడలో ఉన్న చైన్ ను ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చాడు. దాంతో ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ మధ్యలో ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. ఏమైందని జబర్దస్త్ స్టేజిపైనే అడిగితే.. ఫైమా తనతో ఉండట్లేదని.. బ్రేకప్ చెప్పిందని ప్రవీణ్ చెప్పాడు. దాంతో ఫైమా మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి. వాటిపై ఓ వీడియోలో ఫైమా స్పందిచింది. ప్రవీణ్ తో తనది నిజమైన లవ్ కాదని.. కేవలం స్క్రిప్ట్ లో భాగంగానే అలా చేశామని చెప్పుకొచ్చింది.
Faima : సీక్రెట్ లవర్ ను పరిచయం చేసిన ఫైమా.. పటాస్ ప్రవీణ్ ను మోసం చేసిందా..?
మా జంటను ప్రేక్షకులు బాగా ఆదరించారు కాబట్టి అలా ఇద్దరం కంటిన్యూ అయ్యామని చెప్పుకొచ్చింది ఫైమా. అంతే కాకుండా తనకు ప్రవీణ్ కు మధ్య మనస్పర్ధలు ఉన్నాయని వివరించింది. ఇదిలా ఉండగా ఇప్పుడు సడెన్ గా ప్రవీణ్ నాయక్ అనేకొత్త వ్యక్తిని పరిచయం చేసింది. అతను తన లవర్ అని చెప్పుకొచ్చింది. తాజాగా ఫైమా బర్త్ డే సందర్భంగా ప్రవీణ్ నాయక్ ఇన్ స్టాలో ఓ పోస్ట్ పెట్టాడు. తమది ఐదేండ్ల ప్రేమ అంటూ రాసుకొచ్చాడు. దాంతో ఫైమా ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఏంటి నీది ఐదేళ్ల ప్రేమనా.. మరి ఇన్నాళ్లు ఎందుకు చెప్పలేదని ప్రశ్నిస్తున్నారు. ఐదేండ్ల క్రితమే నీకు లవర్ ఉంటే.. పటాస్ ప్రవీణ్ తో ఎలా తిరిగావు అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఫైమా మాత్రం ఈ విషయంపై ఇప్పటి వరకు స్పందించలేదు. చూడాలి మరి ఆమె ఏం చెబుతుందో.
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.