అర్ధరాత్రి రోడ్ల మీద ‘ ఆ టైపు ‘ లో హీరోయిన్ దూల పన్లు .. ఎవడైనా చూస్తే ఆగుతాడా

Authored By aruna | The Telugu News | Published on: May 19, 2023, 6:00 pm

Sonakshi Sinha : బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఎన్నో సినిమాలలో స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇక సోనాక్షి సినిమాలతో పాటు వెబ్ సిరీస్లలో నటిస్తూ వస్తుంది. వెబ్ సిరీస్ ల ద్వారా మరింత పాపులర్ అవుతుంది. కంటెంట్ ఓరియంటెడ్ సిరీస్ లో నటిస్తూ మంచి పేరు దక్కించుకుంటుంది. ఇటీవల విడుదలైన దహాడ్ సినిమాలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గా నటించి మెప్పించింది. అయితే ఈ సినిమా కారణంగా సోనాక్షి తల్లిదండ్రులని బాగా ఇబ్బంది పెట్టిన సంఘటన గుర్తు చేసుకుంది. యాక్షన్ సినిమాలంటే చాలా ఇష్టం. వాటి ద్వారా చాలా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. దహాడ్ సినిమా ద్వారా బైక్ నడిపే అవకాశం వచ్చింది.

అంతకుముందు ఓ బైక్ కొన్నా అది చూసి మా అమ్మానాన్న బాగా కంగారు పడ్డారు. నడిపేటప్పుడు కిందపడి దెబ్బలు తగిలించుకుంటాను అని బాధపడేవారు. కానీ వాళ్లకు తెలియని విషయం ఏంటంటే అదే బైక్ నేను రాత్రిళ్ళు షికార్లు చేసి వచ్చేదాన్ని. రాత్రిపూట ముంబై వీధుల్లో మాస్క్ ధరించి తిరిగేదాన్ని. దర్శకురాలు రిను కగ్టి అయితే స్టంట్ మాస్టర్ కన్నా నేను బాగా బైక్ నడుపుతున్నాను అనేవారు. ఆ నమ్మకమే నాకు నేను సొంతంగా బైక్ నడిపే సన్నివేశాలకు అవకాశం కల్పించింది. లేదంటే వాటి కోసం ప్రత్యేకంగా డూప్ పెట్టాల్సి వచ్చింది. నిర్మాతలకు అదనపు భారంగా ఉండేది.

Sonakshi Sinha mid night bike riding

తర్వాత నా గురించి ఈ విషయాలన్నీ అమ్మానాన్నలకు తెలిసింది. దాంతో వారు షాక్ అయిపోయారు. ఇదంతా నువ్వే చేసావా అని ఆశ్చర్యానికి గురయ్యారు. పిల్లలు అంటే తల్లిదండ్రులకు ఎంత ప్రేమనో మరోసారి నాకు అర్థం అయింది. ఇకపోతే సోనాక్షి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రేంజ్ లో కొనసాగుతుంది. ఇక సౌత్ లో నటించాలని ఆసక్తి చూపిస్తుంది. కానీ ఇక్కడ అమ్మడికి అంతగా అవకాశాలు రావడం లేదు. రజినీకాంత్ ‘ లింగ ‘ సినిమాతో సౌత్ లో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్ కే పరిమితం అయింది.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp