Fan War Between Allu Arjun And Ram Charan Fans
Ram Charan – Allu Arjun : సోషల్ మీడియా లేనప్పుడు ఫ్యాన్స్ మధ్య గొడవలనేవే ఉండేవి కాదు. అని సోషల్ మీడియా ప్రాచుర్యంలోకి వచ్చాక మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ అభిమానుల రచ్చ మొదలు పెట్టారు. అంతేకాక సోషల్ మీడియా వేదికగా వారిపై విమర్శలు చేస్తుండడం కూడా మనం చూస్తున్నాం. ఇంతక ముందు వేరే వాళ్లని టార్గెట్ చేస్తూ వచ్చిన వారు ఇప్పుడు ఒకే ఫ్యామిలీ హీరోలపై కూడా విమర్శలకు దిగుతున్నారు. ఇది అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అల్లు అర్జున్ అభిమానులు రాంచరణ్ ని ట్రోల్ చేస్తూ ఓ హ్యాష్ టాగ్ క్రియేట్ చేశారు. #GhantaLeniVarasudu తో అల్లు అర్జున్ అభిమానులు ట్రోలింగ్ మొదలు పెట్టారు. అంతే కాదు ఇందులోకి రాంచరణ్ సతీమణి ఉపాసనిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ ట్రోలింగ్ కి పాల్పడ్డారు.
దీంతో రాంచరణ్ అభిమానులు కూడా అసభ్యకరమైన ట్రోలింగ్ తో విరుచుకుపడ్డారు. మార్ఫింగ్ ఫోటోలు, మీమ్స్ తో ఇరు వర్గాలు దారుణమైన ట్రోలింగ్ చేసుకున్నాయి. బన్నీ ఫాన్స్ చరణ్ సతీమణిని ఇన్వాల్వ్ చేయగా.. చరణ్ ఫ్యాన్స్ బన్నీ సతీమణి స్నేహని ఇన్వాల్వ్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. #ThammudiGhantaPhalAAm అనే హ్యాష్ టాగ్ తో చరణ్ ఫ్యాన్స్ ట్రోలింగ్ కి దిగారు. వారి వైఖరిని చూసి కొందరు పెద్దలు ఏం పోయే కాలం అంటూ మండిపడుతున్నారు. మంచిగా ఉన్నవారి మధ్య కూడా ఎందుకు ఇలా పుల్లలు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Fan War Between Allu Arjun And Ram Charan Fans
ఇటీవల పవన్ ఫ్యాన్స్ మహేష్ సతీమణి నమ్రతని ట్రోల్ చేసారు. ఇతర హీరోల ఫాన్స్ తరచూ పవన్ సతీమణి అన్నా లెజినోవాని ట్రోల్ చేయడం చూస్తూనే ఉన్నాం. గతంలో ఫ్యాన్ వార్స్ హీరోల సినిమాలు, ఆ రికార్డుల వరకే పరిమితం అయ్యేవి. కానీ ఇప్పుడు వ్యక్తిగత విషయాలతో రోత పుట్టిస్తున్నారు. చరణ్, బన్నీ ఫ్యాన్స్ మధ్య ఈ వార్ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి ఈ దరిద్రపు సంప్రాదాయంకి టాలీవుడ్ హీరోలు పులిస్టాప్ పెట్టేందుకు కృషి చేస్తారా లేదన్నది ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే రామ్ చరణ్, అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్స్‌గా ఎదిగిన విషయం విదితమే.
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
Tribanadhari Barbarik : వెర్సటైల్ యాక్టర్ సత్య రాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. కొత్త పాయింట్,…
MLC Kavitha : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి తన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనానికి దారి తీసింది. తాజాగా…
It Professionals Faces: ప్రస్తుతం భారతదేశంలో టేక్కు పరిశ్రమలలో ఒక భయానక ఆందోళనలు పెరిగాయి. టెక్ కంపెనీలలో పనిచేసే యువకుల్లో…
White Onion : సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఉల్లిపాయలు అనగా మొదట గుర్తించేది ఎరుపు రంగును కలిగిన ఉల్లిపాయలు.…
Super Seeds : ప్రకృతి ప్రసాదించిన కొన్ని ఔషధాలలో చియా విత్తనాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. జ్యూస్ లేదా…
German Firm Offer : శాస్త్రాలు ఏమంటున్నాయి.. చనిపోయిన వారు మళ్ళీ బ్రతుకుతారా, సారి మనిషి చనిపోతే తిరిగి మరలా…
This website uses cookies.