#image_title
Bigg Boss Telugu 7 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 మాత్రం మాంచి జోరుమీదుంది. గత సీజన్లన్నీ ఒక ఎత్తు అయితే ఈ సీజన్ మరో ఎత్తు. అవును.. హౌస్ లోకి కంటెస్టెంట్ల మధ్య బిగ్ బాస్ కావాల్సినంత మంట పెడుతున్నాడు. ఎప్పటికప్పుడు గొడవలు లేపి సైలెంట్ గా కూర్చొంటున్నాడు బిగ్ బాస్. తాజాగా అదే జరిగింది. నిజానికి హౌస్ లో గేమ్స్ కంటే గొడవలే ఎక్కువయ్యాయి. ప్రేక్షకులకు కూడా కావాల్సింది అదే. అందుకే బిగ్ బాస్ సీజన్ 7 ప్రేక్షకులకు తెగ నచ్చేస్తోంది. కిచెన్ లో గొడవే.. నామినేషన్ల విషయంలో గొడవే. ఏదైనా టాస్క్ వస్తే అక్కడా గొడవే. అసలు గొడవ లేని రోజు లేదు. గొడవ పడని వాళ్లు లేరు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో ఓ కిక్కు ఉంది. అందుకే ప్రేక్షకులు కూడా టీవీలకు అతుక్కుపోతున్నారు.
ఇక.. అసలు విషయానికి వస్తే నాలుగో పవరాస్త్ర కోసం ప్రస్తుతం హౌస్ లో టాస్క్ నడుస్తోంది. ఇప్పటికే యావర్, ప్రశాంత్ ఇద్దరు నాలుగో పవరాస్త్ర కోసం కంటెండెర్స్ అయ్యారు. ఇక.. మూడో కంటెండర్ కోసం బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చాడు. అదే బిగ్ బాస్ గాలా ఈవెంట్. ఈ ఈవెంట్ లో ఎవరైతే మంచిగా డ్రెస్సులు వేసుకొని సరదాగా డ్యాన్సులు వేసుకొని ఈవెంట్ నిర్వాహకులను మెప్పిస్తారో వాళ్లలో ఒకరిని మూడో కంటెండర్ గా సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ చేసే అవకాశం మళ్లీ హౌస్ మెంట్స్ అయిన శివాజీ, శోభా శెట్టి, సందీప్ కే ఇచ్చాడు బిగ్ బాస్. అయితే.. కంటెస్టెంట్లు అందరూ రకరకాల డ్రెస్సులు వేసుకొని తెగ హడావుడి చేశారు. ఒక్కొక్కరు తమకు నచ్చిన డ్రెస్సులు వేసుకొని నిర్వాహకులను మెప్పించే ప్రయత్నం చేశారు. కానీ.. శుభశ్రీ గెటప్ మాత్రం వాళ్లను ఆకట్టుకుంది. దీంతో మూడో కంటెండర్ గా శుభశ్రీని ప్రకటించారు. దీంతో ఒక్క నిమిషం మాస్టారు అంటూ వెంటనే అమర్ దీప్ లేస్తాడు. మీకు ఎంటర్ టైన్ మెంట్ అక్కడ ఏం దొరికింది. నేను మీకు ఏం ఇవ్వలేదు అని అడుగుతాడు అమర్ దీప్.
#image_title
కావాల్సిన వాళ్లకు ఇచ్చుకుంటూ పోవడం కాదన్నా అంటాడు అమర్ దీప్. దీంతో సుబ్బు ఇన్నోవేటివ్ గా అనిపించింది. ఆయన చెప్పిన డ్రెస్సుల ప్రకారం.. మీరు రూల్ బుక్ చూడండి అని అంటాడు శివాజీ. అవి వాడుకోమని చెప్పారు కానీ… అది చెప్పలేదు సార్ అంటూ అమర్ దీప్ కోప్పడతాడు. కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దానికి సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది.
Gurram Paapi Reddy : నరేష్ అగస్త్య, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న సినిమా "గుర్రం పాపిరెడ్డి". ఈ చిత్రాన్ని…
INDVs ENG : క్రీడా మైదానంలో అంకితభావం అంటే ఏమిటో మరోసారి చూపించారు ఇద్దరు ధీరులు. తమ వ్యక్తిగత ఆరోగ్యాన్ని…
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్‌సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్‌లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్‌గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
This website uses cookies.