Pawan Kalyan : పవన్ కళ్యాణ్.. ఇప్పుడు ఈ పేరు ప్రభంజనం. ఒకవైపు సినిమాలు, మరో రాజకీయాలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకొని ప్రశాంతమైన జీవితం సాగించే ఛాన్స్ ఉన్నప్పటికీ, ప్రజలకు తన వంతు సాయం చేయాలని భావించిన పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి వచ్చారు. జనసేన పార్టీని స్థాపించి దూకుడుగా అడుగులు వేస్తున్నాడు. గత ఎన్నికలలో ఘోర పరాజయం చెందిన పవన్ ఈ సారి మాత్రం సీఎం పీఠం దక్కించుకునే దిశగా అడుగులు వేస్తున్నాడు. ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా మద్దతుగా నిలిచేందుకు ముందుకు వస్తున్నారు. మరి ఆ సంగతులేంటో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. మీకు ఇంకా ఇలాంటి ఇంటరెస్టింగ్ వీడియోలు కావాలంటే మా చానెల్ ను ఫాలో అవ్వండి. ఈ వీడియోను లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఒకపక్క సినిమాలు చేస్తూనే మరోపక్క సీరియస్ గా ఏపీ పాలిటిక్స్ లో చక్రం తిప్పడానికి ప్రయత్నిస్తున్నారు పవన్ కళ్యాణ్.
పవన్ సీఎం కావాలని ఆయన అభిమానులతో పాటు చాలా మంది కోరుకుంటున్నారు. ఇటీవల సీనియర్ నటుడు, టీడీపీ నేత మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో, టాలీవుడ్ లో చర్చగా మారాయి. మురళీమోహన్ పవన్ కళ్యాణ్‌ని ఉద్దేశిస్తూ పవన్ సీఎం అయితే గర్విస్తాను అని చేసిన కామెంట్స్ సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. చాలా మంది పొలిటికల్ జర్నీ మొదలుపెట్టి తమ వల్ల కాకపోతే మధ్యలోనే వదిలేస్తారు. కానీ పవన్ విషయంలో మాత్రం అలాంటిది జరిగే ఛాన్స్ లేదు. ఇదే పట్టుదలతో కొనసాగితే పవన్ గొప్ప స్థానానికి కచ్చితంగా వెళ్తాడు. చిరంజీవితో ఉన్న క్లోజ్‌నెస్ నాకు పవన్ తో లేదు. పవన్ ఎప్పుడూ తన పని తాను చూసుకుంటాడు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతాడా లేదా చెప్పలేను కానీ పవన్ కళ్యాణ్ సీఎం అయితే నేను కచ్చితంగా గర్వపడతాను. పవన్ సీఎం అయితే మా సినిమా వాళ్ల నుంచి మరొకరు ముఖ్యమంత్రి పదవి సాధించారని సంతోషపడతాను అని తెలిపారు మురళీ మోహన్.
ఇక ఇదే క్రమంలో పలువురు సినీ ప్రముఖులు జనసేన పార్టీకి బాహాటంగా మద్దతు పలికేందుకు రెడీ అవుతున్నట్లు ఇన్‌సైడ్ టాక్. పూర్తి స్థాయి రాజకీయ ప్రయాణం చేసేందుకు ప్రణాళికలు చేస్తున్న పవన్.. ఇప్పటికే కమిటైన సినిమాలను చకచకా ఫినిష్ చేస్తున్నారు. అటు రాజకీయ కార్యకలాపాల్లో భాగమవుతూనే షూటింగ్స్ కంప్లీట్ చేస్తున్నారు. రేయింబవళ్లు కష్టపడుతూ తన విజయానికి సోపానాలు రెడీ చేసుకుంటున్నారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు అండగా నిలుస్తూ కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున ఆర్ధిక సాయం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఈ కార్యక్రమం ఓ కార్యక్రమం ఉద్యమంలా సాగుతోంది. పవన్ మంచి మనసుకు ఆంధ్రా జనం ఆయనకు నీరాజనం పలుకుతున్నారు. ఏపీ ప్రజలు కూడా జనసేనానికి ఘన స్వాగతం పలుకుతుండటం చూస్తున్నాం.
ఈ నేపథ్యంలో మరోవైపుగా టాలీవుడ్ సపోర్ట్ కూడా అందుతుండటం జనసేనకు మరింత బలం చేకూరుస్తోంది. తెలుగు సినీ పరిశ్రమలో పవన్ కళ్యాణ్ అంటే ఇష్టపడే నటీనటుల లిస్ట్ పెద్దదే. అయితే సినిమా వేరు.. రాజకీయం వేరు అనేది ఇక్కడ పాయింట్. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌లో నెలకొంటున్న పరిస్థితులు, సినీ ఇండస్ట్రీ పట్ల జగన్ రియాక్ట్ అవుతున్న తీరు లెక్కలోకి తీసుకుంటున్నారట కొంతమంది సినీ ప్రముఖులు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినీ పరిశ్రమలో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ క్రమంలో చిరంజీవి నేతృత్వంలో కొంతమంది సినీ ప్రముఖులు వెళ్లి జగన్‌ని కలిసినా పెద్దగా ప్రయోజనం కనిపించలేదు. దీంతో సినీ పరిశ్రమలో వైసీపీపై వ్యతిరేకత మొదలైందని, క్రమంగా అందరూ జనసేన వంక చూస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. చూడాలి మరి సినీ పరిశ్రమ సపోర్ట్ తో ఆయనకు ఎలాంటి విజయం దక్కుతుందో..!
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
This website uses cookies.