Ileana : ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్న ఇలియానా…పెళ్లి కొడుకు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ileana : ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్న ఇలియానా…పెళ్లి కొడుకు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు…!

 Authored By prabhas | The Telugu News | Updated on :19 December 2022,8:30 pm

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి భాజలు మోగుతూ వస్తున్నాయి. టాలీవుడ్ బాలీవుడ్ కొలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా పెళ్లి చేసుకుంటూ లైఫ్ లో సెటిల్ అవుతున్నారు. అంతేకాక ఎంత త్వరగా పెళ్లి చేసుకుంటున్నారో అంతే త్వరగా గుడ్ న్యూస్ లు చెప్పి అభిమానులకు డబుల్ ధమాకా ఆఫర్స్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు ఓ సెలబ్రిటీ పెళ్లి విషయం ఇంటర్నెట్లో వైరల్ గా మారింది. అయితే గోవా బ్యూటీ ఇలియానా పెళ్లి చేసుకోబోతుంది. అంటూ బాలీవుడ్లో ప్రచారం జరుగుతుంది.

అయితే ఇప్పటివరకు చాలా మంది స్టార్స్ తో ఏపైర్ నడిపించిన ఇలియానా ఫైనల్ గా స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ బ్రదర్ తో పెళ్లికి సిద్ధమైనట్లుగా బాలీవుడ్ మీడియా చెబుతోంది. అంతేకాక ఎవరికి తెలియకుండా సింపుల్ గా గోవాలో వెడ్డింగ్ ప్లాన్స్ జరుపుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో ఇలియానా ఇంత సైలెంట్ గా పెళ్లి పనులు చేసుకోవడానికి గల కారణం ఏంటి అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. అయితే ఇలా వస్తున్న వార్తలలో ఎంత నిజం ఉందో తెలియదు , కానీ బాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ విషయం తెలిసిన ఇలియానా అభిమానులు కొందరు సంతోషిస్తున్నారు.

Ileana is finally getting married

Ileana is finally getting married

అయితే కత్రినా కైఫ్ బ్రదర్ ని పెళ్లి చేసుకుంటుందని తెలిసి కొందరు షాక్ గురవుతున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఎక్కువగా బ్రేకప్ లు అవడం మనం చూస్తూనే ఉన్నాం. బాలీవుడ్ లో అయితే వరుసగా బ్రేకప్స్ చెప్తూ సినీ స్టార్స్ అభిమానులకు షాక్ ఇస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇలియానా బాలీవుడ్ పర్సన్ ను పెళ్లి చేసుకోవడం ఏ కథకు దారి తీస్తుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే టాలీవుడ్ లో కూడా బ్రేకప్స్ బాగానే జరుగుతున్నాయి కానీ బాలీవుడ్ పర్సంటేజ్ కంటే తక్కువ అని చెప్పాలి. మరి ఇలియానా లైఫ్ ఎలా ఉండబోతుందో వేచి చూడాల్సిందే. ఏదైతేనేం ఫైనల్ గా ఇలియానా ఓ ఇంటికి కోడలు కాబోతుంది.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది