Ileana : ఆ బాధను ఎదుర్కోవటం చాలా కష్టం .. కారణం చెప్పి ఏడ్చిన ఇలియానా ..!
Ileana : ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇలియానా ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వార్త అందరికీ తెలిసిందే. ఆగస్టు ఒకటినా ఇలియానా డెలివరీ జరిగింది. బిడ్డ పేరును బాబు ఫేస్ ను రివిల్ చేసిన ఇలియానా బాబు తండ్రి ఎవరన్న విషయం మాత్రం బయటికి చెప్పకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ భామ తన ఇంస్టాగ్రామ్ లో ఓ స్టోరీని పెట్టింది. ఈ బాధను ఎదుర్కోవటం చాలా కష్టం అంటూ రాసుకు వచ్చింది. ఇంతకీ ఇలియానా ఏ విషయం గురించి మాట్లాడుతుంది.
తన బాబు అనారోగ్యం గురించి మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. ఈ బాధను ఎదుర్కోవటం గురించి మనకి ఎవరు నేర్పించారు ఇది ఎంతో కష్టంగా ఉంటుంది ఇలియానా బాబుతో ఉన్న ఫోటోలు షేర్ చేసింది. అలాగే మరొక ఫోటోలో రోజంతా బాబు బాబును ఎత్తుకోవాల్సి వస్తుంది. నాకు కూడా ఈ చిట్టి కౌగిలింతలు అవసరమని రాస్కొచ్చింది. కాగా ఇలియానా భర్త ఎవరన్నది పాత్ర ప్రశ్న గానే ఉంది. ఆ మధ్య ఒక అబ్బాయి తో క్లోజ్ గా ఉంటూ ఫోటోలను షేర్ చేసింది. పైగా అతడు ఎవరన్నది మాత్రం తెలియలేదు ఆ వ్యక్తిని ఇలియానా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది.
అయితే ఎన్ని రోజులు ఇలా తన భర్త ఎవరన్నది రివీల్ చేయకుండా సస్పెన్స్ గా ఉంటుందో చూడాలి. బాబు పుట్టాక ఇలియానా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం ఆమె నటించిన రెండు సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. టాలీవుడ్ లో దేవదాస్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ వరుస సినిమాలు చేసి తెలుగులో స్టార్ హీరోయిన్ హోదాను పొందింది. తరువాత బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.