పెళ్ళికి ముందరే కడుపు తెచ్చుకోవడం గురించి టాప్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు !

Advertisement

సెలబ్రిటీ వ్యక్తిగత జీవితాలలో చోటుచేసుకుంటున్న సంఘటనలు సమాజంలో సంచలనంగా మారుతున్నాయి. ఇటీవలే ఒకప్పటి టాప్ హీరోయిన్ ఇలియానా పెళ్లి చేసుకోకుండానే గర్భం దాల్చింది. ఈ విషయాన్ని స్వయంగా ధైర్యంగా సోషల్ మీడియాలో ప్రకటించింది. ఇదిలా ఉంటే ఇలియానా టైములోనే టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించిన తాప్సి ఇటీవల ఇంటర్వ్యూలో పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకి ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు కాబట్టి..పెళ్లి ఇప్పట్లో ఉండకపోవచ్చు.

Advertisement

ఒకవేళ అలా ఏదైనా జరిగే అవకాశం ఉంటే తప్పకుండా చెబుతాను అంటూ… ఊహించని రీతిలో తాప్సి వ్యాఖ్యలు చేసింది. ఒక విధంగా ఇలియానా పెళ్లి కాకుండానే గర్భవతి కావడంతో ఆమెకు తాప్సి కౌంటర్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో వరుసపెట్టి సినిమాలు చేసిన తాప్సి ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో విజయవంతమైన కెరియర్ తో కొనసాగుతోంది. అంతేకాదు తాప్సి దాదాపు 9 సంవత్సరాల నుండి ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement
Taapsee Pannu ABout On Her Pregnancy
Taapsee Pannu ABout On Her Pregnancy

అయితే ఈ విషయంలో మాత్రం తాప్సి నోరు మెదపడం లేదు. ఇక ఇదే సమయంలో బాలీవుడ్ ఇండస్ట్రీ తో పాటు మళ్ళీ సౌత్ ఫిలిం ఇండస్ట్రీపై తాప్సి ఫోకస్ పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిలో భాగంగా కోలీవుడ్ ఇండస్ట్రీలో ఓ భారీ ప్రాజెక్టు కూడా ఒప్పుకున్నట్లు ఫిలిం ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.

Advertisement
Advertisement