మొగుళ్లను వదిలేసి భారతీయ పురుషుల వెంట పడుతున్న విదేశీ ఆంటీలు .. అందుకు సాక్షాలు ఇవే .. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

మొగుళ్లను వదిలేసి భారతీయ పురుషుల వెంట పడుతున్న విదేశీ ఆంటీలు .. అందుకు సాక్షాలు ఇవే ..

 Authored By aruna | The Telugu News | Updated on :24 July 2023,3:00 pm

తాజా సర్వేలో ప్రపంచంలో అందమైన పురుషుల జాబితాలో భారత్ రెండవ స్థానంలో నిలిచింది. అటువంటి అందగాళ్లతో వారి భార్యలు లేదా అమ్మాయిలు ఇంటి పని, వంట పని చేస్తున్నారని ఫన్నీ వీడియో కూడా ఒకటి వచ్చింది. అయితే సర్వేలు నిజంగానే భారతీయ పురుషులు అందగాళ్ళు అని చెబుతున్నాయి. ఇటీవల జరుగుతున్న సంఘటనలు చూస్తే అవుననక తప్పదు. భారతీయ పురుషులపై విదేశీ వనితలు మనసు పారేసుకుంటున్నారు. వారికోసం ఖండాంతరాలు దాటి, ప్రాంతం కానీ ప్రాంతానికి వచ్చి, మతమార్పిడి చేసుకొని వారిని వివాహం చేసుకుంటున్నారు.

సోషల్ మీడియా వచ్చాక దేశాల మధ్య హద్దులు చెరిపేశారు యువతి యువకులు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ వంటి యాప్స్ తో పరిచయాలు పెంచుకొని స్నేహం పేరుతో ప్రేమగా మారి ఆ తర్వాత ప్రేమికుడి కోసం భారత్ దేశానికి వస్తున్నారు. భారత్లో ఉంటున్న ప్రియుడి కోసం అన్నీ వదిలేసి కట్టుబట్టలతో ఇండియా వచ్చేస్తున్నారు. ఇటీవల పబ్జీ గేమ్ ద్వారా పాకిస్తాన్ కి చెందిన సీమా అనే మహిళ ఉత్తరప్రదేశ్ కు చెందిన యువకుడితో పరిచయం ఏర్పడి అది కాస్త ప్రేమగా మారింది. అతడి కోసం భర్తను వదిలేసి తన నలుగురు పిల్లలతో అక్రమంగా ఇండియాలోకి చొరబడింది. ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకుంది.

Foreign anties come to India for youth

Foreign anties come to India for youth

అలాగే నిన్న బంగ్లాదేశ్ కు చెందిన జూలీ అనే మహిళ సైతం ఫేస్ బుక్ లో పరిచయమైన ప్రియుడి కోసం తన 11 ఏళ్ల కుమార్తెతో వచ్చి అతడిని పెళ్లి చేసుకుంది. ఇక ఆ మధ్య పోలాండ్ చెందిన 45 ఏళ్ల మహిళ ఝార్ఖండ్ కి చెందిన అబ్బాయి కోసం తన ఆరేళ్ల కుమార్తెతో కలిసి వచ్చేసింది. అసలు విదేశీ ఆంటీలు భారతీయ పురుషుల కోసం రావడం వెనుక అందమా లేక మాటకారి తనమా అనేది వారి మనసుకే తెలియాలి. లేదంటే పెద్దలు చెప్పినట్లు ప్రేమ గుడ్డిదనే నమ్మాల్సి వస్తుంది. ఈ సోషల్ మీడియా వచ్చాక జనాలు మరి పిచ్చిగా తయారవుతున్నారు. రాను రాను ఈ కాలం ఇంకా ఎలా మారిపోతుందో ఏంటో.

Tags :

    aruna

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది