Samantha : భయపడుతున్న సమంత.. నాగచైతన్య జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ..

Authored By mallesh | The Telugu News | Published on: November 30, 2021, 7:15 am

Samantha : ప్రస్తుతం మూవీస్‌లో యాక్ట్ చేసేందుకు ట్రై చేస్తున్నవారు అంతా ఇంతా కాదు. అలాంటిది వచ్చిన ఆఫర్లను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ సక్సెస్ అవుతున్న వారు చాలా తక్కువ మంది ఉంటారు. ప్రస్తుతం ఆ లిస్టులోకి చేరింది సమంత. ఇప్పటి వరకు తెలుగు, తమిళ్, బాలీవుడ్ మూవీస్ లో నటించిన ఈ అందాల సుందరి.. ఇప్పుడు హాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ టైంలో తనకు కలుగుతున్న భయాన్ని సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది.

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ రొమాంటిక్ కపుల్ గా పేరు తెచ్చుకున్న సమంత, నాగచైతన్య.. ఎందుకో తెలియదు కానీ విడిపోయారు. ఇద్దరు కలిసి మొదట ఏమాయ చేసావే మూవీలో నటించారు. ఇది సమంత ఫస్ట్ మూవీ.. అప్పటి వరకు హిట్ కోసం ఎదురుచూస్తున్న నాగచైతన్యకు ఈ మూవీ మంచి క్రేజ్ తీసుకొచ్చింది. తర్వాత వీరిద్దరు ప్రేమలో పడ్డారు. ఇక పెద్దలను ఒప్పించి పెళ్లి సైతం చేసుకున్నారు. అంతా సాఫిగా సాగుతున్నది అనుకునే టైంలో ఫ్యాన్స్ కు పెద్ద షాకిచ్చారు ఈ ఇద్దరు. నాలుగేళ్ల వివాహ బంధానికి బ్రేక్ వేస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం ఇద్దరూ విడిపోయారు. తర్వాత ఎవరి సినీ కెరీర్ పై వారు ఫోకస్ చేస్తున్నారు.

frightened samantha remembering nagachaitanyas memories

frightened samantha remembering nagachaitanyas memories

Samantha : బంపర్ ఆఫర్

సమంత ప్రస్తుతం హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ది అరెంజ్‌మెంట్ ఆఫ్ ల‌వ్‌ పేరుతో పిలిప్ జాన్ డైరెక్షన్ ఈ మూవీ తెరకెక్కబోతోంది. ఈ మూవీకి సంబంధించిన ఆడిషన్స్ గురించి విషయంపై సమంత ఓ ఇంట్రెస్టింగ్ పోస్ చేసింది. ఫస్ట్ టైం ఏమాయ చేశావే మూవీ కోసం ఆడిషన్స్‌లో పాలుపంచుకున్న సామ్.. తర్వాత ఇప్పటివరకూ ఏ మూవీ కోసమ సైతం ఆడిషన్ ఇవ్వలేదట. అయితే ప్రస్తుతం హాలీవుడ్ మూవీ కోసం ఆడిషన్ ఇవ్వాల్సి వచ్చిందట. పన్నెండేళ్ల తర్వాత తిరిగి ఆడిషన్స్‌లో పాల్గొన్నాను. కొత్త వరల్డ్ లోకి అడుగుపెట్టబోతున్నాను. ఏమాయచేశావే మూవీ టైంలో ఆడిషన్స్ చేసిన టైంలో ఏ విధంగా భయపడ్డానో ప్రస్తుతం సైతం అలానే భయం వెంటాడుతోంది. అని తెలిపింది. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరలవుతోంది.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp