Sudigali Sudheer : జబర్దస్త్ లో హైపర్ ఆది, సుడిగాలి సుధీర్ స్థాయికి వారు ఎందుకు చేరుకోలేదు?
Sudigali Sudheer : జబర్దస్త్ ప్రారంభం అయ్యి పది సంవత్సరాలు పూర్తి కాబోతున్న విషయం తెల్సిందే. జబర్దస్త్ ఆరంభంలో ధన్‌రాజ్.. వేణు ఇంకా పలువురు టీమ్ లీడర్లు ఉండేవారు. వారిలో కొందరు కొన్నాళ్లకే వెళ్లి పోగా కొందరు ఇప్పటి వరకు ఉన్నారు. కొత్త వారు వచ్చారు.. వారిలో కూడా చాలా మంది వెళ్లి పోయారు. కాని ఆరంభంలో వచ్చిన కొత్త వారు అంటే హైపర్ ఆది.. సుడిగాలి సుధీర్ మరియు ఆటో రామ్ ప్రసాద్.. గెటప్ శ్రీను వంటి వారు మాత్రం జబర్దస్త్ లో రావడం లేదు. రావడం లేదు అనడం కంటే రానివ్వడం లేదు అనాలేమో అనిపిస్తుంది. హైపర్ ఆది ఎక్కడో మారుమూలన ఉండగా అదిరే అభి తీసుకు వచ్చి ఎంకరేజ్ చేశాడు.
అభి ప్రోత్సాహంతో ఆది స్కిట్స్ రాయడంతో పాటు యాక్ట్ చేయడం కూడా మొదలు పెట్టాడు. తక్కువ సమయంలోనే హైపర్ ఆది అంటూ టీమ్ ఫామ్ అయ్యింది. సుడిగాలి సుధీర్ ను కూడా ధన్ రాజ్ మరియు వేణు లు ప్రోత్సహించారు. ఇలా ఎంతో మందిని పాత వారు ప్రోత్సహించారు. అందుకే వీళ్లు వచ్చారు. వీళ్లు వెళ్లి పోయే టైమ్ కు కనీసం టీమ్ లీడర్ అయ్యే లక్షణాలు ఉన్న ఏ ఒక్క రు కూడా జబర్దస్త్ లో కనిపించడం లేదు. దానికి కారణం ఇటీవల వెళ్లిన వారు తమ టీమ్ మెంబర్స్ ను ప్రోత్సహించలేదు. ఉదారణహరణ కు సుడిగాలి సుధీర్ టీమ్ లో కొత్త వారు పెద్దగా ఎవరు లేరు.
ఒక వేళ వచ్చినా ఒకటి రెండు వారాలకే పరిమితం అయ్యారు. ఇక హైపర్ ఆది అసలు ఎంతో మంది కొత్త వారిని స్టేజ్ ఎక్కించినా కూడా వారికి ఛాన్స్ ఇచ్చే వాడు కాదు. వారి డైలాగ్స్ ను కూడా ఈయన చెప్పడం లేదంటే.. వారు డైలాగ్స్ చెబుతూ ఉంటే మద్యలో వెళ్లడం చేసే వారు. దాంతో కొత్త తరం కమెడియన్స్ ఎవరు కూడా ఆది, సుధీర్ ల స్థాయిలో ఎంటర్ టైన్ చేయలేక పోతున్నారు. పంచ్ ప్రసాద్.. ఇమాన్యూల్.. నూకరాజులు ఉన్నా కూడా వారిని కూడా ఎక్కువ ఎదగకుండా వారి స్థాయిని పదే పదే తగ్గించే వారు. అందుకే ఇప్పుడు జబర్దస్త్ పరిస్థితి దారుణంగా ఉంది.