Bigg Boss OTT Telugu : తెలుగు బిగ్ బాస్ నాన్ స్టాప్ ముగింపు దశకు వచ్చింది. గత సీజన్ లో నటరాజ్ మాస్టర్ కంటెస్టెంట్ గా ఉండి ప్రతి ఒక్క తోటి కంటెస్టెంట్ కు జంతువుల పేర్లు పెట్టిన విషయం తెల్సిందే. అదే ఆయనకు పెద్ద శాపం గా మారి చాలా తక్కువ రోజుల్లోనే బయటకు వెళ్లి పోయాడు. సరే అదృష్టం కొద్ది మళ్లీ బిగ్ బాస్ ఓటీటీ ఆఫర్ రావడంతో కాస్త పద్దతిగానే మొదట్లో ఉన్నా చివరకు వచ్చేప్పటికి పిచ్చి పీక్స్ కు చేరిందా అన్నట్లుగా మరీ దారుణంగా ప్రవర్తిస్తున్నాడు అంటూ విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి.ఆయన పద్దతి మరీ దారుణంగా ఉందంటూ కొందరు కామెంట్స్ చేస్తే మరి కొందరు మాత్రం
ఆయన కు మానసిక పరిస్థితి బాగాలేదేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తానికి బిగ్ బాస్ లో ఆయన ఉండటం వల్ల ముందు ముందు మరింతగా ప్రమాదం జరిగే అవకాశం ఉందంటూ చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. ఆటలో ఆయన బాగా లీనం అయ్యి ఏం చేసేందుకు అయినా.. ఏం చేసుకునేందుకు అయినా సిద్దం అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు అంటూ విమర్శలు వస్తున్నాయి.ఇటీవల అఖిల్ తో పదే పదే గొడవ పడటం.. అంతకు ముందు బిందు మాధవిని నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం తో మొత్తం విషయం రివర్స్ అయ్యింది.

ఈ సీజన్ ఆరంభంలో నటరాజ్ మాస్టర్ విమర్శలు ఎదుర్కొన్నాడు. నాగార్జున సరి చేయడంతో కాస్త పద్దతిగానే మాట్లాడాడు. ఆ తర్వాత ఆయన ప్రవర్తన మళ్లీ శృతి మించింది. తనను ఎంతగానో అభిమానించే వారిని.. ఆయన అభిమానించే వారిని కూడా టాస్క్ ల్లో చూడకుండా రెచ్చి పోతున్నాడు. పిచ్చి పిచ్చిగా వ్యవహరిస్తూ బాబోయ్ మాస్టర్ అనేలా చేస్తున్నాడు. ఫైనల్ 5 వరకు ఆయన ఉంటాడా లేదా అనే అనుమానం వ్యక్తం అవుతోంది. వచ్చే వారంతో బిగ్ బాస్ నాన్ స్టాప్ ముగియబోతున్న విషయం తెల్సిందే.