
FWICE Ban On Ram Gopal Varma
రామ్ గోపాల్ వర్మ అంటేనే వివాదాల పుట్ట. వివాదాల కోసం ఆ పనులు చేస్తాడా? లేదా ఆయన చేసే పనులే వివాదాంగా మారుతాయా? అన్నది ఎవ్వరికీ అంతు చిక్కదు. అలాంటి వర్మపై తాజాగా మరో వివాదం తెర మీదకు వచ్చింది. మామూలుగా ఎప్పుడూ కూడా సినిమాల ద్వారా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారే వర్మ.. ఈ సారి మాత్రం కాస్త రూట్ మార్చాడు. వర్మ తన దగ్గర పని చేసిన వాళ్లందరికీ డబ్బులు ఇవ్వకుండా పంగనామం పెట్టేస్తున్నాడుట. ఇప్పటికే కోటికి పైగా బకాయిలు పడ్డాడట.
FWICE Ban On Ram Gopal Varma
ఆర్జీవీ తన సినిమాల కోసం పని చేసిన ఆర్టిస్టులకు, సినీ కార్మికులకు భారీగా డబ్బులు బాకీ పడినట్లు సమాచారం. ఈ విషయంపై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ (FWICE) సీరియస్‌గా స్పందించింది. వర్మపై ఏకంగా నిషేదాన్ని విధించింది. తమ సంస్థకు చెందిన 32 యూనియన్లు ఇకపై రాంగోపాల్ వర్మతో పని చేయరని తేల్చి చెప్పింది. దీంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్ అవుతోంది.
కరోనా వ్యాప్తి సమయంలో కూడా బ్రేక్ ఇవ్వకుండా వరస సినిమాలు చేశాడు. అలా పని చేసిన టెక్నిషియన్లకు, ఆర్టిస్టులకు జీతాలు చెల్లించలేదని.. మొత్తం కలిపి రూ. కోటికి పైనే పెండింగ్ పెట్టినట్లు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ తెలిపింది. ఈ ఇష్యూపై సంస్థ అధ్యక్షుడు బీఎన్ తివారీ, ప్రధాన కార్యదర్శి అశోక్ దూబే స్పందిస్తూ.. జీతాలు చెల్లించాలని లీగల్ నోటీసులు పంపినప్పటికీ వర్మ స్పందించపోవడం దారుణమన్నారు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు రెస్పాండ్ అవ్వలేదని.. అందుకే ఇలా నిషేదం విధించామని తెలిపారు.
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
This website uses cookies.