పని చేయించుకుని డబ్బులు ఎగ్గొట్టేశాడట.. వర్మపై మరో వివాదం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

పని చేయించుకుని డబ్బులు ఎగ్గొట్టేశాడట.. వర్మపై మరో వివాదం

 Authored By bkalyan | The Telugu News | Updated on :12 January 2021,11:01 pm

రామ్ గోపాల్ వర్మ అంటేనే వివాదాల పుట్ట. వివాదాల కోసం ఆ పనులు చేస్తాడా? లేదా ఆయన చేసే పనులే వివాదాంగా మారుతాయా? అన్నది ఎవ్వరికీ అంతు చిక్కదు. అలాంటి వర్మపై తాజాగా మరో వివాదం తెర మీదకు వచ్చింది. మామూలుగా ఎప్పుడూ కూడా సినిమాల ద్వారా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారే వర్మ.. ఈ సారి మాత్రం కాస్త రూట్ మార్చాడు. వర్మ తన దగ్గర పని చేసిన వాళ్లందరికీ డబ్బులు ఇవ్వకుండా పంగనామం పెట్టేస్తున్నాడుట. ఇప్పటికే కోటికి పైగా బకాయిలు పడ్డాడట.

FWICE Ban On Ram Gopal Varma

FWICE Ban On Ram Gopal Varma

ఆర్జీవీ తన సినిమాల కోసం పని చేసిన ఆర్టిస్టులకు, సినీ కార్మికులకు భారీగా డబ్బులు బాకీ పడినట్లు సమాచారం. ఈ విషయంపై ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ (FWICE) సీరియస్‌గా స్పందించింది. వర్మపై ఏకంగా నిషేదాన్ని విధించింది. తమ సంస్థకు చెందిన 32 యూనియన్లు ఇకపై రాంగోపాల్ వర్మతో పని చేయరని తేల్చి చెప్పింది. దీంతో ఈ వ్యవహారం ఒక్కసారిగా హాట్ టాపిక్ అవుతోంది.

కరోనా వ్యాప్తి సమయంలో కూడా బ్రేక్ ఇవ్వకుండా వరస సినిమాలు చేశాడు. అలా పని చేసిన టెక్నిషియన్లకు, ఆర్టిస్టులకు జీతాలు చెల్లించలేదని.. మొత్తం కలిపి రూ. కోటికి పైనే పెండింగ్ పెట్టినట్లు ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయిస్ తెలిపింది. ఈ ఇష్యూపై సంస్థ అధ్యక్షుడు బీఎన్ తివారీ, ప్రధాన కార్యదర్శి అశోక్ దూబే స్పందిస్తూ.. జీతాలు చెల్లించాలని లీగల్ నోటీసులు పంపినప్పటికీ వర్మ స్పందించపోవడం దారుణమన్నారు. ఎన్ని రకాలుగా ప్రయత్నాలు రెస్పాండ్ అవ్వలేదని.. అందుకే ఇలా నిషేదం విధించామని తెలిపారు.

Tags :

    bkalyan

    ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది