Galatta Geetu : బిగ్ బాస్ సీజన్ 6 ఎంత రసవత్తరంగా మారుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 21 మంది కంటెస్టెంట్స్ హౌజ్‌లో నానా రచ్చ చేస్తున్నారు. 21 మందితో ప్రారంభమైన ఈ బిగ్ బాస్ షో మొదటి వారం పూర్తి చేసుకోబోతోంది అయితే ఈ మొదటి వారంలో మొదటి హౌస్ కెప్టెన్ గా బాలాదిత్యని ఎన్నుకోగా, వరస్ట్ పర్‌ఫార్మర్‌గా గీతూని సెలక్ట్ చేశారు. హౌస్ లోని 15 మంది అయితే గీతూ ప్రవర్తన మీద కామెంట్ చేయడంతో ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముందు నుంచి కూడా గీతూ ప్రవర్తన ఎవరికీ నచ్చడం లేదు. తనకు తాను ఒక మోనార్క్ ను అనే విధంగా తాను ఒక స్పెషల్ పర్సన్ లాగా ఆమె ఫీల్ అవుతుంది.
హౌస్ లో ఉన్నవారితో గొడవలు పెట్టుకోవడం.. ఆవేశంగా మాట్లాడటం.. అవతిలి వాళ్ళు చెప్పేది వినకుండా వాగ్వాదానికి దిగడంతో గీతూ గొంతు బిగ్ బాస్ లో ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే ఈ అమ్మడి ప్రవర్తనపై చలాకీ చంటి గీతూ కి క్లాస్ తీసుకున్న విషయం తెలిసిందే.తాజా ఎపిసోడ్‌లో బాలాదిత్య ఎదురుగా కాళ్లు చాపుకుని కూర్చున్న గలాటీ గీతు.. కాలు మీద కాలు వేసి.. అతని ముఖం దగ్గర పెట్టి కాళ్లు ఊపుతూ ఉంది. కాస్త సవ్యంగా కూర్చో.. ఆ కాళ్లు ముఖం మీద పెట్టి ఊపడం బాలేదు అని చాలా పద్దతిగా మర్యాదగా చెప్పాడు బాలాదిత్య. ‘ఏ.. నీ మూతలో పెట్టి ఊపినానా? అని చిరాకుగా ముఖం పెట్టి వెటకారంగా మాట్లాడింది గీతు.
అప్పటికీ ‘ఎవరి మూతిలో పెట్టి ఊపినా తప్పే కదమ్మా’ అని బాలాదిత్య అనడంతో.. ‘ఇది నా అలవాటు’ అంటూ మళ్లీ కాలు బాలాదిత్య వైపు పెట్టి బలుపు చూపించింది. ఇప్పుడే చెప్పాను కదా గీతూ.. అలా కాళ్లు ఊపొద్దని నవ్వుతూ చాలా ఓపికగా చెప్పాడు బాలాదిత్య. ఇక కెప్టెన్సీ పోటుదారుల టాస్క్ విషయంలో మిగతా సభ్యులకు గీతూకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోటీ దారుల టాస్క్ ఆడే సమయంలో కొన్ని నెంబర్స్ ని ఏమంటున్నా టీ షర్ట్ లోపల దాచుకోవడం పట్ల ఇతర పోటీదారులు అభ్యంతరం తెలిపారు. వ్వు టీ షర్టు లోపల వేసుకున్నావు కదా వాటిని ఎలా తీయాలని రోహిత్ అడిగితే అది నా స్ట్రాటజీ కావాలంటే లోపల చేయి పెట్టి తీసుకో అంటూ ఆమె దిగజారి మాట్లాడడం ఆమెకు మైనస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.