Game Changer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం గేమ్ ఛేంజర్ Game Changer . ఈ మూవీ జనవరి 10న రిలీజ్ కు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, పాటలు సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. అయితే రీసెంట్ గా డల్లాస్ లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ‘గేమ్ ఛేంజర్’పై మరింత బజ్ క్రియేట్ చేసింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా పాటల కోసం దాదాపు 75 కోట్లను మేకర్స్ ఖర్చు చేశారన్న వార్త హైప్ గ్రాఫ్ ను భారీగా పెంచేస్తోంది. సినిమాలో మొత్తం 5 పాటలు ఉండగా, ఒక్కో పాటను అద్భుతమైన లొకేషన్స్, సెట్స్ లో… అదిరిపోయే స్టెప్పులతో, పవర్ ఫుల్ మ్యూజిక్ తో విజువల్ వండర్ గా నిర్మించినట్టు దిల్ రాజు ముంబై ప్రెస్‌మీట్‌లో తెలియజేశారు.
ముందుగా ‘జరగండి’ పాట గురించి మాట్లాడుకుంటే 70 అడుగుల కొండపైనున్న ఓ పల్లెటూరులో, ప్రత్యేకంగా నిర్మించిన సెట్ లో 13 రోజుల పాటు ‘జరగండి’ పాటను చిత్రీకరించారు. ఈ పాటలో దాదాపు 600 మంది డాన్సర్లతో 8 రోజులపాటు షూట్ చేశారు. రెండో పాట రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సాంగ్ ‘రా మచ్చా మచ్చా’. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించిన ఈ సాంగ్ ను ఇండియాలోని జానపద కళలకు నివాళిగా రూపొందించారు. ఇందులో 1000 కంటే ఎక్కువ మంది జానపద కళాకారులు డాన్స్ చేసినట్టుగా తెలుస్తోంది. మూడో పాట ‘నానా హైరానా’. ఈ రొమాంటిక్ పాటను ఫస్ట్ టైం ఇండియాలోనే ఇన్‌ఫ్రారెడ్ కెమెరాలో చిత్రీకరించారు. న్యూజిలాండ్ లోని అద్భుతమైన లోకేషన్లలో రామ్ చరణ్ కియారా అద్వానీపై రూపొందిన ఈ పాట బెస్ట్ మెలోడీగా రెస్పాన్స్ ను దక్కించుకుంటోంది.
నాలుగో పాట ‘ధోప్’ విషయానికి వస్తే… ఇదో టెక్నో డాన్స్ నెంబర్. ఈ పాటను కోవిడ్ సెకండ్ వేవ్ టైమ్ లోనే షూట్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రత్యేక విమానంలో దాదాపు 100 మంది ప్రొఫెషనల్ డాన్సర్లను రష్యా నుంచి రప్పించినట్టుగా తెలుస్తోంది. ఈ సాంగ్లో రామ్ చరణ్ తో పాటు కియారా కూడా అదిరిపోయే స్టెప్పులు వేశారు. చివరిగా ఐదవ పాట సర్ప్రైజ్ ప్యాకేజీ.. ఈ పాటను ప్రేక్షకులు వెండితెరపై చూసి థ్రిల్ ఫీల్ అవ్వడం ఖాయమని అంటున్నారు. గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఈ సాంగ్ ను చిత్రీకరించారు. పాటలకే ఈ రేంజ్‌లో ఖర్చు పెడితే సినిమా కోసం ఎంత ఖర్చు పెట్టి ఉంటారా అని అందరు ముచ్చటించుకుంటున్నారు.
Allu Arjun : పుష్ప 2 ప్రీమియర్ షో టైం లో జరిగిన ఘటన్లో రేవతి అనే మహిళ మృతి…
KTR : తెలంగాణలో అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) ఇప్పుడు అనుముల కుట్ర శాఖ Anumula Conspiracy Branch గా…
Cherlapally Railway Terminal : అత్యాధునికమైన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ pm modi సోమవారం ప్రారంభించారు.…
First HMPV Cases In India : ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న హ్యూమన్ మెటాప్న్యూమోవైరస్ HMPV కేసులపై భారత ప్రభుత్వం నిశితంగా…
Akira Nandan : పవన్ కళ్యాణ్ Pawan Kalyan తనయుడు అకీరా నందన్ వెండితెర ఎంట్రీ గురించి కొన్నాళ్లుగా నెట్టింట…
Eat Spinach : పాలకూరలో అనేక పోషకాలు ఉన్నాయి. అందుకోసమే ఆరోగ్య నిపుణులు పాలకూరను తరచూ తినాలని చెబుతుంటారు. ఇక…
Gautam gambhir : సమష్టి వైఫల్యంతోనే ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయినట్టు గంభీర్ తాజాగా చెప్పుకొచ్చారు.…
Cooking Oils : మీ ఇంట్లో వంట తయారీకి ఈ నూనెను వినియోగిస్తున్నారా...అయితే క్యాన్సర్ ను కొని తెచ్చుకున్నట్లే. తాజాగా…
This website uses cookies.