Game Changer Movie Trailer : గేమ్ చేంజర్ ట్రైలర్‌పై కీలక అప్‌డేట్.. న్యూ ఇయర్ వేళ అభిమానులకి గుడ్ న్యూస్
Game Changer Movie Trailer : ఈ ఏడాది New Year సంక్రాంతికి Sankranti పలు సినిమాలు సందడి చేయనుండగా, వాటిలో గేమ్ ఛేంజర్ Game Changer Movie చిత్రం ఒకటి. ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ చరణ్ Ram Charan సోలోగా నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో చరణ్ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. మూవీలో చెర్రీకి జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. అలాగే టాలీవుడ్ హీరోయిన్ అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా అడియన్స్ ముందుకు రానుంది.
Game Changer Movie Trailer : గేమ్ చేంజర్ ట్రైలర్‌పై కీలక అప్‌డేట్.. న్యూ ఇయర్ వేళ అభిమానులకి గుడ్ న్యూస్
ఇటీవలే అమెరికాలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం ట్రైలర్ కోసం అంతా ఓ రేంజ్ లో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ ఈ ట్రైలర్ కోసం ఈ కొత్త ఏడాది కానుకగా బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చేసారు. మూవీ ట్రైలర్ జనవరి 1న రానుందని అందరు భావించారు. కాని రేపు (జనవరి 2న) సాయంత్రం 5 గంటల 4 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు తెలిపారు. ‘ఆట మొదలైంది’ అంటూ చరణ్ పంచె కట్టుతో ఉన్న ఫొటోను చిత్ర బృందం పంచుకుంది.
కాగా, ‘గేమ్ ఛేంజర్’లో రామ్ చరణ్ రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపించనున్న విషయం తెలిసిందే. చెర్రీ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్ఎస్ తమన్ స్వరాలు అందిస్తున్న ఈ మూవీని.. శ్రీవెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథను అందించారు. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్, సునీల్, నవీన్ చంద్ర, అంజలి తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా లో ఓ పాట ఉండగా, ఆ పాట ఈ కథకు ఆత్మ లాంటిది. ఈ పాట లో సెంటిమెంట్ దట్టించారు. ఫాన్స్ కర్చీఫ్ లు తెచ్చుకోండి అని తమన్ ముందే హింట్ ఇస్తున్నాడు. రంగస్థలం లో ఓ విషాద గీతం వుంది. తమన్ ఈ సారి అలాంటిదే ట్రై చేసి ఉండొచ్చు అని ముచ్చటించుకుంటున్నారు. game changer Movie Trailer Update
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…
OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…
Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…
Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…
This website uses cookies.