Game Changer Movie Trailer : గేమ్ చేంజర్ ట్రైలర్‌పై కీల‌క అప్‌డేట్.. న్యూ ఇయ‌ర్ వేళ అభిమానుల‌కి గుడ్ న్యూస్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Game Changer Movie Trailer : గేమ్ చేంజర్ ట్రైలర్‌పై కీల‌క అప్‌డేట్.. న్యూ ఇయ‌ర్ వేళ అభిమానుల‌కి గుడ్ న్యూస్

 Authored By ramu | The Telugu News | Updated on :1 January 2025,6:00 pm

ప్రధానాంశాలు:

  •  Game Changer Movie Trailer : గేమ్ చేంజర్ ట్రైలర్‌పై కీల‌క అప్‌డేట్.. న్యూ ఇయ‌ర్ వేళ అభిమానుల‌కి గుడ్ న్యూస్

Game Changer Movie Trailer : ఈ ఏడాది New Year సంక్రాంతికి Sankranti ప‌లు సినిమాలు సంద‌డి చేయ‌నుండ‌గా, వాటిలో గేమ్ ఛేంజ‌ర్ Game Changer Movie చిత్రం ఒక‌టి. ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ చరణ్ Ram Charan సోలోగా నటిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో చరణ్ నటిస్తోన్న సినిమా కావడంతో ఈ చిత్రంపై ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేష‌న్స్ ఉన్నాయి. మూవీలో చెర్రీకి జోడిగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటిస్తుంది. అలాగే టాలీవుడ్ హీరోయిన్ అంజలి, శ్రీకాంత్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా అడియన్స్ ముందుకు రానుంది.

Game Changer Movie Trailer గేమ్ చేంజర్ ట్రైలర్‌పై కీల‌క అప్‌డేట్ న్యూ ఇయ‌ర్ వేళ అభిమానుల‌కి గుడ్ న్యూస్

Game Changer Movie Trailer : గేమ్ చేంజర్ ట్రైలర్‌పై కీల‌క అప్‌డేట్.. న్యూ ఇయ‌ర్ వేళ అభిమానుల‌కి గుడ్ న్యూస్

Game Changer Movie Trailer ఫ్యాన్స్ బీ రెడీ..

ఇటీవలే అమెరికాలో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది.ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ చిత్రం ట్రైలర్ కోసం అంతా ఓ రేంజ్ లో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ ఈ ట్రైలర్ కోసం ఈ కొత్త ఏడాది కానుకగా బ్లాస్టింగ్ అప్డేట్ ఇచ్చేసారు. మూవీ ట్రైల‌ర్ జ‌న‌వ‌రి 1న రానుంద‌ని అంద‌రు భావించారు. కాని రేపు (జ‌న‌వ‌రి 2న) సాయంత్రం 5 గంట‌ల 4 నిమిషాల‌కు విడుద‌ల చేయ‌నున్న‌ట్లు తెలిపారు. ‘ఆట మొద‌లైంది’ అంటూ చ‌ర‌ణ్ పంచె క‌ట్టుతో ఉన్న ఫొటోను చిత్ర‌ బృందం పంచుకుంది.

కాగా, ‘గేమ్ ఛేంజ‌ర్‌’లో రామ్ చ‌ర‌ణ్ రెండు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్న విష‌యం తెలిసిందే. చెర్రీ స‌ర‌స‌న బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఎస్ఎస్ త‌మ‌న్ స్వ‌రాలు అందిస్తున్న ఈ మూవీని.. శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. త‌మిళ ద‌ర్శ‌కుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ మూవీకి కథను అందించారు. ఎస్‌జే సూర్య, శ్రీకాంత్‌, సునీల్‌, న‌వీన్ చంద్ర‌, అంజ‌లి త‌దిత‌రులు ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఈ సినిమా లో ఓ పాట ఉండ‌గా, ఆ పాట ఈ కథకు ఆత్మ లాంటిది. ఈ పాట లో సెంటిమెంట్ దట్టించారు. ఫాన్స్ కర్చీఫ్ లు తెచ్చుకోండి అని తమన్ ముందే హింట్ ఇస్తున్నాడు. రంగస్థలం లో ఓ విషాద గీతం వుంది. తమన్ ఈ సారి అలాంటిదే ట్రై చేసి ఉండొచ్చు అని ముచ్చ‌టించుకుంటున్నారు.  game changer Movie Trailer Update

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది