Garikapati – Chiranjeevi : గరికపాటి గెలిచాడు.. చిరంజీవి ఓడిపోయాడు.. ఎలాగో తెలుసా?

 Authored By jagadesh | The Telugu News | Updated on :12 October 2022,9:30 pm

Garikapati – Chiranjeevi : ఏ హీరో ఫ్యాన్స్ అయినా హద్దు మీరితే అది ఫ్యాన్స్ తప్పు కాదు.. ఆ హీరో తప్పు అంటారు. ఎందుకంటే.. హీరో తన ఫ్యాన్స్ ను కావాలని రెచ్చగొట్టాడు అని జనాలు అనుకుంటారు. అసలు విషయం తెలియకున్నా హీరో మీదనే నిందలు వేస్తారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ గరికపాటి విషయంలో అదే జరిగిందని అనిపిస్తోంది. ఎందుకంటే.. మెగా ఫ్యాన్స్ చేసే తప్పు ఫలితం ఖచ్చితంగా చిరంజీవి ఖాతాలోకే వెళ్తుంది. నిజానికి మెగాస్టార్ చిరంజీవి ముందు గరికపాటి నరసింహారావు అంత గొప్ప వ్యక్తి ఏం కాదు. మెగాస్టార్ కు ఉన్న ఫాలోయింగ్, క్రేజ్ ముందు గరికపాటిది చాలా తక్కువ.

మరి.. మెగాస్టార్ చిరంజీవి అంతటి వ్యక్తే.. గరికపాటి విషయంలో మౌనంగా ఉంటే.. మధ్యలో మెగా ఫ్యాన్స్ ఎందుకు అతి చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు. గరికపాటి కాదు ఆయన ‘గరిక’ పాటి అని సాక్షాత్తూ అనంత్ శ్రీరామ్ కూడా చెప్పాడు. అయినా కూడా ఇంకా గరికపాటి పెద్ద మేధావి అని.. ఆయన చిరంజీవిని అంత మాట ఎలా అంటారు అన్నట్టుగా ఆయన మీద ఒక్కసారిగా అందరూ విరుచుకుపడటంతో ఇక చేసేది లేక గరికపాటినే క్షమాపణ చెప్పేశారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. గరికపాటి క్షమాపణ చెప్పాక కూడా మెగాస్టార్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ స్వామి నాయుడు ఇంకా గరికపాటిని టార్గెట్ చేశాడు.

garikapati versus megastar chiranjeevi issue

garikapati versus megastar chiranjeevi issue

Garikapati – Chiranjeevi : గరికపాటిపై విరుచుకుపడ్డ మెగాస్టార్ అసోసియేషన్ ప్రెసిడెంట్

గరిక తెస్తున్నాం.. పూలు పంపిస్తున్నాం అంటూ సుద్దులు చెప్పాడు. చివరికి గరికపాటి.. ఆయనకు కూడా లోకువ అయిపోయారా? మెగాస్టార్ ముందు గరికపాటి ఎంత అనేది అందరికీ తెలిసిందే. అయినా కూడా మెగా ఫ్యాన్స్ ఇంకా గరికపాటి విషయాన్ని రచ్చ ఎందుకు చేస్తున్నారు. మెగాస్టార్ సంయమనం పాటించినట్టుగా.. వీళ్లు ఎందుకు పాటించలేకపోతున్నారు. వాళ్లు తప్పు చేస్తే అది మెగాస్టార్ కు అవమానం కాదా? ఆయన ఖాతాలోకి వెళ్లవా? ఇకనైనా గరికపాటి విషయంలో మెగా ఫ్యాన్స్ కానీ.. ఇంకెవరైనా కానీ స్పందించకపోతేనే బెటర్. లేకపోతే ఇది మెగాస్టార్ ఖాతాలోనే పడే అవకాశం ఉంది.

jagadesh

Jagadish Gatla Sr Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 13 years. Worked in Eenadu, Namasthe Telangana, Dailyhunt as a telugu content writer. I wrote various articles on politics, interesting stories, local news, business, health, technology, entertainment etc. He is also expert in analysing news, proof reading. He is present content writer of thetelugunews.com website. Contact details: jagadish2039@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి