Getup Srinu Is Back in Extra Jabardasth Latest Promo
Getup Srinu : జబర్దస్త్ చుట్టూ ఎన్ని రకాలుగా కాంట్రవర్సీలు జరుగుతున్నాయో అందరికీ తెలిసిందే. మల్లెమాల, జబర్దస్త్ వంటి వాటి మీద కిరాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలను కొందరు సమర్థించారు. ఇంకొందరు తీవ్రంగా ఖండించారు. అక్కడ బాధలు భరించలేకపోవడంతోనే అందరూ వెళ్లిపోతోన్నారని అన్నారు. అయితే సుధీర్, గెటప్ శ్రీను, అనసూయ వంటి వారు వెళ్లిపోతుండటంతో జబర్దస్త్ షోకు గతి ఏంటని అందరిలోనూ ఆందోళన మొదలైంది. ఇక మల్లెమాల, జబర్దస్త్ తరుపున ఆది, రాం ప్రసాద్, ఏడు కొండలు వంటి వారు రంగంలోకి దిగారు.
ఏడు కొండలు అయితే కిరాక్ ఆర్పీ పరువుతీసేశాడు. ఫుడ్ అద్భుతంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు. సుధీర్, గెటప్ శ్రీను ఎలా రారో ఎందుకు షో చేయరో చూస్తాను అంటూ కాస్త ఫైర్ అయ్యాడు. మొత్తానికి ఇప్పుడు గెటప్ శ్రీను మాత్రం ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలోకి వచ్చాడు. ఇందులో భాగంగా అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చేశాడు. ఆటో రాం ప్రసాద్ స్కిట్ వేస్తుండగా.. సడెన్‌గా వెనక నుంచి వచ్చేశాడు. ఆ సర్ ప్రైజ్‌కు అందరూ ఆశ్చర్యపోయారు. ఇక వెంటనే స్కిట్ ఆపేసి.. కాస్త టైం ఇవ్వండని అడిగాడు.
Getup Srinu Is Back in Extra Jabardasth Latest Promo
వెంటనే స్కిట్ ఆపేసి.. నా దగ్గరకు తీసుకురండి అని ఇంద్రజ కోరింది. ఇక గెటప్ శ్రీను పట్టుకుని ఇంద్రజ ఎమోషనల్ అయింది. హగ్ చేసుకుంది. చెవిలో ఏదో చెప్పింది. మొత్తానికి గెటప్ శ్రీను రాకతో ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలో సందడి వాతావరణం నెలకొంది. దీంతో గెటప్ శ్రీను రంగంలోకి దిగాడు. స్కిట్ వేశాడు. గతంలో మాదిరి తన సత్తాను చాటేందుకు ప్రయత్నించాడు. మా వాడు కమల్ హాసన్‌లా చేస్తాడు అని గెటప్ శ్రీను గురించి రాం ప్రసాద్ ఎంతో గొప్పగా చెబుతాడు. అయితే అన్నపూర్ణమ్మ మాత్రం కౌంటర్ వేస్తుంది.
మీ వాడు కమల్ హాసన్‌లా చేస్తే.. కమల్ హాసన్ ఏం చేస్తాడు.. టీవీ ముందు కూర్చుని బఠానీలు తింటాడా? అని పరువుతీస్తుంది. అలా గెటప్ శ్రీను మాత్రం మళ్లీ తన వెరైటీ గెటప్పులు, డైలాగ్ డిక్షన్‌ను చూపించేశాడు. మరి గెటప్ శ్రీను పూర్తిగా కంటిన్యూ అవుతాడా? లేదా ఈ ఒక్క ఎపిసోడ్‌కేనా? అన్నది చూడాలి.
Children : చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు సులభంగా తినాలని టీవీలో కార్టూన్లు లేదా రైమ్‌లు చూపిస్తూ ఆహారం తినిపిస్తారు.…
Pomegranate : పండ్ల రాజుగా పరిగణించబడే దానిమ్మ పండు రుచి పరంగా మాత్రమే కాదు, ఆరోగ్య పరంగా కూడా అమూల్యమైనదిగా…
Jobs : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో…
Tiffin : మన శరీరం రోజంతా శక్తివంతంగా ఉండాలంటే ఉదయం తీసుకునే అల్పాహారం (టిఫిన్) చాలా ముఖ్యం. అల్పాహారం మానేస్తే…
Affair : సినీ ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్, రూమర్స్ అనేవి సర్వసాధారణం. బాలీవుడ్లో అయితే ఇటువంటి వార్తలు…
TSRTC : రాఖీ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రత్యేక బస్సుల్లో ఛార్జీలను 30%…
Rakhi Festival : రాఖీ పండగ సందర్భంగా మహిళలకు గిఫ్ట్ ల rain పడుతోంది. రక్షాబంధన్ పర్వదినాన్ని పురస్కరించుకుని, దేశంలోని…
Holidays : ఇప్పటి స్కూల్ జీవితాన్ని చూస్తే చిన్నారుల మీద ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతోంది. చదువు…
This website uses cookies.