Home » Entertainment » Naga Chaitanya Has Problems With Nagarjuna Also
Entertainment

Naga Chaitanya : నాగార్జున తో కూడా చైతూకి విబేధాలు ఉన్నాయా

Authored By
aruna
The Telugu News | Published on: July 24, 2022, 12:00 pm
Advertisement

Naga Chaitanya : సమంత నుంచి విడిపోయిన తర్వాత నాగ చైతన్య పరిస్థితి దారుణంగా మారింది. ఆయ‌న సినిమాల ప‌రంగా చాలా యాక్టివ్‌గా ఉంటున్నా ప‌ర్స‌న‌ల్ విష‌యంలో మాత్రం కొంత ఆందోళ‌న‌లో ఉన్న‌ట్టు క‌నిపిస్తుంది. స‌మంత రీసెంట్‌గా ఆయ‌న‌పై ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చాలా చేసింది. అవేమి చైతూ ప‌ట్టించుకోలేదు కాని, ఇటీవ‌ల నాగ చైత‌న్య ఫ్యామిలీ తో కూడా అంటి ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఇటీవల ఆయన నటించిన థాంక్యూ మూవీ విడుదల కాగా ఈ సినిమాపై అక్కినేని ఫ్యామిలీ ఎవరు స్పందించలేదు..

Advertisement

నాగచైతన్య – దిల్ రాజు ల కలయికలో వచ్చిన మూవీ ‘థాంక్యూ’. ఈ కాంబినేషన్ లో సినిమా రావడానికి పన్నెండేళ్లు పట్టింది. పన్నెండేళ్ల క్రితం నాగచైతన్యని హీరోగా పరిచయం చేస్తూ దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మూవీ ‘జోష్’. నాగార్జున కెరీర్ లో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ‘శివ’ స్ఫూర్తితో అదే తరహా కాలేజీ నేపథ్యాన్ని ఎంచుకుని వాసు వర్మని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ మూవీని నిర్మించారు. నాగచైతన్య క్యారెక్టర్ ని మించి సినిమాలో పెద్దగా కంటెంట్ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేక నిరుత్సాహ పరిచింది. అక్కినేని ఫ్యామిలీకి లైఫ్ లాంగ్ గుర్తుంచుకునే ‘మనం’ మూవీని అందించిన విక్రమ్ కె. కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

Naga Chaitanya has problems with nagarjuna also

Advertisement

‘ప్రేమమ్’ మూవీని గుర్తు చేస్తూ అదే పంథాలో సాగిన ఈ మూవీ తాజాగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. బీవీఎస్ రవి చెప్పిన లైన్ ఆధారంగా రూపొందించిన తెరకెక్కిన ఈ తొలి రోజే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుని నిరుత్సాహ పరిస్తోంది. దాదాపు పన్నెండేళ్ల విరామం తరువాత చైతో దిల్ రాజు చేసిన సినిమాపై కింగ్ నాగార్జున నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. కనీసం ఓ ట్వీట్ కూడా ఆయన నుంచి రాకపోవడంతో పలువురు అనుమానాల్ని వ్యక్తం చేస్తున్నారు. నాగార్జునకు ఈ మూవీ ఫలితం ముందే తెలుసు కాబట్టే ఆయన పెద్దగా స్పందించడానికి ఇష్టపడలేదా? అన్నది ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నాగార్జున ఖచ్చితంగా వుండాల్సిందేనని దిల్ రాజుని కోరారు. దానికి ఎవరిని అడక్కుండానే దిల్ రాజు మాట ఇచ్చేశాడు. కానీ ఆ మాట నెరవేర్చలేకపోయారు. దీంతో ఫ్యాన్స్ ఈ సినిమా ఫలితం తెలియడం వల్లే నాగ్ రాలేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారట. మరి ఈ వార్తలపై నిర్మాత దిల్ రాజు ఎలా స్పందిస్తారో అని ఇన్ సైడ్ టాక్ ..

Advertisement

Naga Chaitanya has problems with nagarjuna also

జూలై 22న ఈ చిత్రం గ్రాండ్ గా విడుదలైంది. అభిరామ్ అనే వ్యక్తి లైఫ్ జర్నీ నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది. ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా.. మన ఎదుగుదలకు కారణమైన వారి పట్ల ఎప్పుడూ కృతజ్ఞతతోనే ఉండాలి అన్న సింగిల్ పాయింట్ తో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మిక్స్డ్ రివ్యూలను సొంతం చేసుకుంది. అయితే చైతూకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఈ సినిమా తొలి రోజు బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ రాబడుతుందని భావించారు. కానీ అలా జరగలేదు. ఈ మూవీ అనుకున్న రేంజ్ లో కలెక్షన్స్ రాబట్టలేకపోయిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. చైతు రీసెంట్ గా చేసిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అదిరిపోయే ఓపెనింగ్స్ ని అందుకోవడమే కాదు.. లాంగ్ రన్ లో లాభాలు తెచ్చిపెట్టి సూపర్ హిట్స్ గా నిలిచాయి. అయితే వాటి ఇంపాక్ట్ థ్యాంక్యూపై ఏ మాత్రం పడలేదు.

అసలే భారీ వర్షాలు లెస్ బజ్ వల్ల ఆన్ లైన్ బుకింగ్స్ ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ సో..సో..గా ఉన్నాయి. దీనికి తోడు ఆంధ్రాలో ఒకరోజు ముందే ప్రీమియర్ షోలు వేశారు. ఈ షోలు చూసిన వాళ్లు సోషల్ మీడియా వేదికగా ‘థ్యాంక్యూ’లో ఫీల్ మిస్ అయిందని సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయిందంటూ చర్చలు మొదలు పెట్టారు. ఈ చర్చలు మార్నింగ్ థియేటర్ కు వెళ్దామనుకున్న వాళ్ళని వెనకడుగు వేసేలా చేశాయి. ఈ మధ్య కాలంలో నాగ చైతన్య కెరీర్ లోనే అతి తక్కువ ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న చిత్రంగా థ్యాంక్యూ నిలిచిందని అంటున్నారు. మరి ముందు ముందు అయినా ఈ మూవీ వసూళ్లు ఊపందుకుంటాయో..లేదో..చూడాలి.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి