Adipurush : ప్రభాస్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అయిపోయింది ఇన్నేళ్లలో ఏ సినిమా విషయంలో ఈయన ఎదురుకోను నేను నెగిటివ్స్ ఓన్లీ ఆదిపురుష్ సినిమా విషయంలోనే ఎదుర్కొంటున్నాడు. అడుగేస్తే ట్రోలింగ్.. మాట మాట్లాడితే వివాదం ఉన్నట్టుంది ఈ సినిమా పరిస్థితి. ఇప్పుడు టీజర్ విడుదలైన తర్వాత సినిమా మీద జరుగుతున్న ట్రోలింగ్ చూసి ప్రభాస్ చాలా ఫీల్ అయ్యాడని అర్థమవుతుంది. అందుకే త్వరలోనే మరింత మంచి స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తావని అభిమానులకు హామీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే తాజాగా ఒక గుడ్ న్యూస్ ఆదిపురుష్ సినిమా మీద సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది విని పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.
బాహుబలి తర్వాత ప్రభాస్ సినిమాల కోసం దేశమంతా వేచి చూస్తుంది. భారీ అంచనాలతో వచ్చిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు అందుకోలేక పోయినా కూడా ఆదిపురుష్ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు అభిమానులు. టీజర్ చూసి డీల పడిపోయిన అభిమానులకు 3d వర్షన్ కాస్త నమ్మకం ఇచ్చింది. జనవరి 12న సినిమా విడుదల కానుంది. ఇది బిగ్ స్క్రీన్ కోసం తీసిన సినిమా.. అక్కడ చూస్తే మీ ఆలోచనలు, అభిప్రాయాలు మారిపోతాయి అంటూ ప్రభాస్‌తో పాటు దిల్ రాజు కూడా చెప్పడంతో కాస్త ధైర్యం తెచ్చుకుంటున్నారు అభిమానులు. తాజాగా ఆదిపురుష్ సినిమా గురించి మరో క్రేజీ న్యూస్ బయటికి వచ్చిందిప్పుడు. టీజర్ తర్వాత అన్నీ నెగిటివ్స్ వెతుక్కుంటున్న వాళ్లకు.. ఇది పాజిటివ్‌గా మారే ఛాన్స్ ఉంది.
ఈ సినిమా సంగీతం గురించి బాగా మాట్లాడుకుంటున్నారంతా. ముఖ్యంగా టీజర్ చివర్లో వచ్చిన జై శ్రీరామ్ అనే ట్యూన్ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఆడియన్స్. ఆ క్యాచీ ట్యూన్ విన్న తర్వాత.. సినిమాలో మ్యూజిక్ చాలా బాగుండబోతుందనే విషయం అర్థమవుతుంది. ఈ సినిమాకు బాలీవుడ్ స్టార్ కంపోజర్స్ అజయ్ అతుల్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో మొత్తం మూడు పాటలు ఉంటాయని తెలుస్తుంది. అందులో జై శ్రీరామ్ సాంగ్ అయితే అదిరిపోతుందని పక్కాగా చెప్తున్నారు మేకర్స్. అలాగే మరో పాట సినిమా అంతా ట్రావెల్ అయ్యేలా ఉంటుందని.. చివరి పాటను ప్రమోషన్స్ కోసమే వాడాలని చూస్తున్నారు మేకర్స్. పాటలు విడుదలైతే కచ్చితంగా సినిమాపై అంచనాలు మారిపోతాయని బలంగా నమ్ముతున్నారు వాళ్లు. మరి చూడాలిక.. ఇదైనా పాజిటివ్‌గా మారుతుందో లేదో..?
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.