SS Thaman : తెలుగు సినిమా పరిశ్రమలో ప్రజెంట్ ఎక్కడ చూసినా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పేరు వినబడుతోంది. మొన్నటివరకు కాపీ దర్శకుడిగా పేరొందిన థమన్ ప్రస్తుతం అందరి అంచనాలను తలకిందులు చేస్తున్నాడు. ఎవరూ ఊహించని విధంగా సంగీతం అందిస్తూ సినిమా సినిమాకు వైవిధ్యం కనబరుస్తున్నాడు. అందుకే థమన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ సొంతం చేసుకున్నాడు. దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ పేరు వింటే చాలు. హీరోకు తన స్టైల్లో ఎలివేషన్స్ ఇస్తుంటాడు. అందుకు తగ్గట్టు మ్యూజిక్ చేయించుకుంటాడు. రీసెంట్‌గా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అఖండ మూవీ ఎంతపెద్ద హిట్టో అందరికీ తెలిసిందే.
ఇక ఈ సినిమాకు బోయపాటి ఎలివేషన్స్ ఎంత ప్లస్ అయ్యాయో.. మ్యూజిక్ కూడా అంత ప్లస్ అయ్యిందని చెప్పవచ్చు. బ్యాగ్రౌండ్ స్కోరింగ్ అద్భుతంగా రాబట్టాడు థమన్. ఈ నేపథ్యంలోనే థమన్ ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్ హోదా అందుకున్నాడు. అంతే రేంజ్‌లో అవకాశాలు కూడా కొల్లగొడుతున్నాడు. రవితేజ నటించిన కిక్ సినిమాతో తొలిసారి సంగీత దర్శకుడిగా మారిన థమన్.. ఆ తర్వాతి రోజుల్లో అంచెలంచెలుగా ఎదిగాడు. అప్పట్లో దేవిశ్రీ ప్రసాద్ ఎంత క్రేజ్ సంపాదించుకున్నాడో ప్రస్తుతం థమన్ కూడా అదే రేంజ్ సక్సెస్‌ను అందుకున్నాడు.
ఇక బ్యాండ్‌కు మరో పేరు తెచ్చకున్న థమన్.. తనసినిమాల్లో వైవిధ్యంగా సంగీతాన్ని అందిస్తున్నాడు. రీసెంట్‌గా మెగాస్టార్ నటించిన లూసిఫర్‌కు థమన్ అందించిన మ్యూజిక్ చాలా బాగుందని టాక్ వినిపిస్తోంది. అదేవిధంగా బోయపాటి త్వరలో రామ్ పోతినేనితో ఓ సినిమా చేయనున్నాడు. దానికి కూడా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడట.. దీని కోసం ఏకంగా రూ.4 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అదే నిజమైతే థమన్ కెరీర్‌లో ఇదే హైయెస్ట్ రెమ్యూనరేషన్ కానుంది. కాగా, థమన్ చేతిలో ప్రస్తుతం తమిళ ప్రాజెక్టులు, త్రివిక్రమ్ మహేశ్ బాబు మూవీకి ప్రాజెక్టు కూడా ఉందని తెలుస్తోంది.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.