Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అదే టైమ్ లో బ్యాడ్ న్యూస్ — తలపట్టుకునే మ్యాటర్ ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అదే టైమ్ లో బ్యాడ్ న్యూస్ — తలపట్టుకునే మ్యాటర్ !

 Authored By sandeep | The Telugu News | Updated on :17 October 2022,3:30 pm

Prabhas : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌నక్క‌ర్లేదు.ఆయ‌న బాహుబ‌లి సినిమాతో భారీ క్రేజ్ ద‌క్కించుకున్నాడు. ఇప్పుడు ప్ర‌భాస్ సినిమా వ‌స్తుందంటే ప్ర‌తి ఒక్క‌రు క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకొని మ‌రీ ఎదురు చూస్తున్నారు. ‘రాధేశ్యామ్’ చిత్రంతో తీవ్రంగా నిరుత్సాహ పరిచిన రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న తన తదుపరి చిత్రం ‘సలార్’పై భారీ అంచనాలు పెట్టుకున్నాడు. ‘కేజీఎఫ్’ సిరీస్ తో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నీల్ పై నమ్మకం ఉంచాడు. భారీ బడ్జెట్ తో, ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ప్యాన్ ఇండియా సినిమాలో శృతిహసన్ హీరోయిన్గా నటిస్తోంది.

ఇక ప్ర‌భాస్ ప్ర‌స్తుతం ఆదిపురుష్ అనే సినిమా చేస్తుండగా, ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఉండేవి.ఆదిపురుష్ అయినా అద్భుతాలు చేస్తుందేమో అని ఆశిస్తే.. దాని మీద విప‌రీత‌మైన నెగెటివిటీ క‌నిపిస్తోంది. ఆదిపురుష్ టీజ‌ర్ విష‌యంలో ఎంతగా ట్రోలింగ్ జ‌రిగిందో తెలిసిందే. యానిమేష‌న్ డామినేటెడ్ మూవీలా క‌నిపిస్తుండ‌డంతో ప్ర‌భాస్ ఇందులో పెద్ద‌గా చేసిందేమీ ఉండ‌ద‌నే అభిప్రాయం కూడా క‌లుగుతోంది అయితే ఇప్పుడు అంద‌రి దృష్టి అంతా స‌లార్ చిత్రంపైనే ఉంది. తాజాగా మలయాళ స్టార్ హీరో పృథ్వీ రాజ్ ఫస్ట్ లుక్ ను ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆదివారం విడుదల చేసింది. పృథ్వీరాజ్ విలన్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఆయన పాత్రకు ‘వర్ధరాజా మన్నార్‌’ అనే పేరు పెట్టారు.

Good news for Prabhas fans and bad news at the same time

Good news for Prabhas fans and bad news at the same time

Prabhas : ఇదేందిర‌య్యా..

ముక్కు పుడక, చెవికి రింగులు, మెడలో వెండి కడీలు, నుదుటిపై పొడవైన బొట్టుతో ఉన్న పోస్టర్ లో పృథ్వీరాజ్ ముఖంపై గాట్లతో చాలా కోపంగా కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ చూస్తుంటే మన్నార్ పాత్ర భయంకరంగా, క్రూరంగా ఉండబోతుందని తెలుస్తోంది. అయితే ఆ మ‌ధ్య పృథ్వీరాజ్ మాట్లాడుతూ..స‌లార్ పూర్తి స్థాయి యాక్ష‌న్, మాస్ ఎంట‌ర్టైన‌ర్ అని అత‌ను స్ప‌ష్టం చేశాడు. ప్ర‌భాస్‌ను అభిమానులు ఎలా చూడాల‌నుకుంటారో అలా క‌నిపిస్తాడ‌ని, ఇందులో ఎలివేష‌న్ల‌కు, మాస్ అంశాల‌కు లోటు ఉండ‌ద‌ని చెప్పాడు. హోంబలే ఫిల్మ్స్ పతాకంపై ప్రశాంత్‌ నీల్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్ర‌భాస్ కి భారీ హిట్ అందిస్తుంద‌ని విశ్వ‌సిస్తున్నారు. ఆదిపురుష్ కూడా పోయిన స‌లార్ మాత్రం అద‌ర‌గొడుతుంద‌ని అంద‌రి అభిప్రాయం.

Advertisement
WhatsApp Group Join Now

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది