Good news for those who are looking for Prabhas Salaar
Prabhas Salaar : ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారారు ప్రభాస్. కానీ.. ఆయన అనుకున్నంత సక్సెస్ బాహుబలి తర్వాత రాలేదు. సాహో, రాధేశ్యామ్ డిజాస్టర్ కావడంతో ప్రభాస్ అభిమానులు ఎంతో కొంత నిరాశతో ఉన్నారు. అయినా ప్రభాస్ ప్రస్తుతం పవర్ ఫుల్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే లాంటి సినిమాలు ప్రస్తుతం ఆయన చేతుల్లో ఉన్నాయి. వరుస పెట్టి ఆయన సినిమాలు చేస్తున్నారు. అయితే.. ఎన్ని సినిమాలు చేసినా.. ప్రస్తుతం సలార్ సినిమా మీదనే అందరూ ఆశలు పెట్టుకున్నారు.
Good news for those who are looking for Prabhas Salaar
దానికి కారణం.. ఆ సినిమా కేజీఎఫ్ కు కొనసాగింపు. అలాగే.. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న సినిమా అది. అందుకే ఆ సినిమాకు అంత క్రేజ్. ఈ సినిమాపై రోజుకో కొత్త అప్ డేట్ వస్తోంది. నిజానికి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు అవుతోంది. కానీ.. వేరే సినిమాలు కూడా లైన్ లో ఉండటంతో డేట్స్ సర్దుబాటు కాక సినిమా షూటింగ్ ఆలస్యమవుతోంది. సలార్ మూవీ షూటింగ్ ఇప్పటికే 90 శాతానికి పైగా పూర్తయింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక అప్ డేట్ బయటికి వచ్చింది.
Good news for those who are looking for Prabhas Salaar
హైదరాబాద్ లోని ఓ ఫేమస్ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ లొకేషన్ లో ప్రభాస్ కూడా షూటింగ్ లో పాల్గొననున్నట్టు తెలుస్తోంది. మూడు నాలుగు రోజులు వరుసగా స్టూడియోలో షూటింగ్ ఉంటుందట. నిజానికి… ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. కానీ.. సలార్ షూటింగ్ కోసం మాత్రం ఈ రెండు రోజులు కేటాయించినట్టు తెలుస్తోంది. ప్రభాస్, పలువురు ఇతర ఆర్టిస్టులు కూడా ఈ షూటింగ్ లో పాల్గొంటారట. ఈ షెడ్యూల్ పూర్తయితే సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినట్టే అంటున్నారు. ఈ సినిమా ఈ సంవత్సరం దసరా కానుకగా సెప్టెంబర్ 28న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
This website uses cookies.