Shruti Haasan : కమల్ గారాల పట్టి శృతి హాసన్ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. కెరీర్ ఆరంభంలో ఎదురైన పరాజయాల కారణంగా ఐరన్ లెగ్ అనే ముద్ర పడ్డా కూడా ఆ ముద్రని చెరిపివేస్తూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోవడానికి శృతికి ఎక్కువ టైం మాత్రం పట్టలేదు. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం రూపంలో శృతి హాసన్ కు తొలిసారి అదృష్టం వరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత శృతి హాసన్ కు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఇటీవల వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు కూడా మంచి విజయాలు సాధించాయి.
ఇలా పులిస్టాప్ పెట్టాడు.. అయితే శృతిహాసన్ సినిమాల కన్నా ప్రేమాయణంతో ఎక్కువగా వార్తలలో నిలుస్తూ ఉంటుంది.ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే శృతి హాసన్ విదేశీ గాయకుడు మైకేల్ కోర్సలేతో డేటింగ్ చేయడమే కాదు అతడిని కమల్ హాసన్‌కు పరిచయం కూడా చేసింది. వీళ్లంతా కలిసి ఓ వివాహ వేడుకలో సైతం పాల్గొన్నారు. ఆ సమయంలో శృతి హాసన్, మైకేల్ కోర్సలే పెళ్లి జరగబోతుందని అందరు అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా వీళ్లిద్దరూ విడిపోయారు. మైకేల్‌తో విడిపోయిన తర్వాత శృతి హాసన్.. డూడుల్ ఆర్టిస్టు అయిన శాంతను హజారికాతో ప్రేమాయణం నడుపుతుంది. అయితే గోపిచంద్ మలినేనితో వ్యవహారం నడుపుతుందని కూడా ప్రచారం జరుగుతుంది.
వీరసింహారెడ్డి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్టేజ్ పై గోపీచంద్ మాట్లాడుతూ.. శృతిహాసన్ కి ‘ఐ లవ్ యూ’ చెప్పాడు. దీన్ని పట్టుకొని అందరు వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందని అనుకున్నారు. కాని ఈ విషయంపై గోపిచంద్ ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ‘శృతితో నేను మూడు సినిమాలు చేశాను. బలుపు, క్రాక్ తర్వాత వీరసింహారెడ్డి. చేశారు ఆమెతో నాకు బ్రదర్ – సిస్టర్ లాంటి బాండింగ్ మాత్రమే ఉంది. అదే లవ్ ని నేను స్టేజ్ పై చెప్పాను. దాన్ని సోషల్ మీడియాలో అబ్బాయి, అమ్మాయి లవ్ గా మార్చి పుకార్లు పుట్టించారు. అవి నాకు బాగా నవ్వు తెప్పించాయి. శృతితో మా ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది.’ అని మలినేని స్పష్టం చేశాడు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.