Home » Entertainment » Gossip Devi Sri Prasad Married Mangli Sister Indravati
Entertainment

Devi Sri Prasad : మంగ్లీ చెల్లెలితో దేవిశ్రీప్రసాద్ పెళ్లి .. ? ఫోటోలు వైరల్..!

Authored By
aruna
The Telugu News | Published on: August 6, 2023, 3:00 pm
Advertisement

Devi Sri Prasad : తెలుగు పరిశ్రమలోకి ‘ దేవి ‘ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం అయిన దేవిశ్రీప్రసాద్ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమాలకు బెస్ట్ మ్యూజిక్ అందించి టాలీవుడ్ లోనే టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. ఇండస్ట్రీకి ఎంతోమంది సంగీత దర్శకులు వచ్చారు పోయారు కానీ దేవిశ్రీప్రసాద్ ప్రత్యేకత మరోలా ఉంటుంది. ఇండస్ట్రీలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దేవిశ్రీప్రసాద్ ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆయన గురించి చాలా రకాలుగా వార్తలు వచ్చాయి.

Advertisement

ఇక దేవిశ్రీప్రసాద్ హీరోయిన్ చార్మిని ప్రేమించాడని అప్పట్లో వార్తలు వినిపించాయి. ఆమెతో ప్రేమలో పడి మోసపోయి పెళ్లిపై విసుకు చెందాడని చాలామంది అంటుంటారు. అయితే తాజాగా సోషల్ మీడియాలో దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి గురించి ట్రెండ్ అవుతుంది. ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ చెల్లెలిని దేవిశ్రీ ప్రసాద్ పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. సింగర్ గా మంగ్లీ ఎంత గుర్తింపు తెచ్చుకుందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే మంగ్లీ తన చెల్లెలు ఇంద్రావతిని కూడా సింగర్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఇద్దరు కూడా తమ పాటలతో జనాలను ఆకట్టుకున్నారు.అయితే సోషల్ మీడియాలో మంగ్లీ చెల్లెలు ఇంద్రావతి దేవి శ్రీ ప్రసాద్ తో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Devi Sri Prasad married Mangli sister Indravati

Advertisement

దీంతో ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్స్ చేశారు. దేవి శ్రీ ప్రసాద్ ని పెళ్లి చేసుకోబోతున్నావా అంటూ కొందరు, ఏజ్ తో సంబంధం లేదు పెళ్లి చేసుకోండి సార్ అంటూ మరికొందరు, చూడ ముచ్చటైన జంట అంటూ ఇంకొందరూ ఇలా కామెంట్స్ చేయడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇది నిజమో కాదు తెలియాలంటే దేవిశ్రీప్రసాద్ స్పందించాల్సి ఉంటుంది. ఇదే నిజమైతే మంగ్లీ చెల్లెలు కెరియర్ పూర్తిగా మారిపోతుంది. హాయ్ ఇది నిజమో కాదో తెలియాల్సి ఉంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి