
governor soundararajan responds body shaming trolls on sai pallavi
Sai Pallavi :మలయాళీ ముద్దుగుమ్మ సాయి పల్లవి ఎలాంటి గ్లామర్ షో చేయకుండా అశేష ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే. సాయి పల్లవి నటనకు, ఆమె డ్యాన్స్‌కి ప్రేక్షకులు మంత్ర ముగ్ధులు అవుతుంటారు. చివరిగా సాయి పల్లవి శ్యామ్ సింగరాయ్ చిత్రంతో ప్రేక్షకులని పలకరించింది. ఈ మూవీ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. దేవదాసీ వ్యవస్థలోని ఓ సున్నితమైన అంశంపై ఎంతో చక్కగా తెరకెక్కించారని నెటిజనులు ప్రశంసించారు. దేవదాసి వర్గానికి చెందిన మైత్రి అనే యువతిగా సాయి పల్లవి పోషించిన పాత్ర ఆమె నటనకు ప్రశంసలు అందుకుంది. అయితే తమిళంలో వైరల్ అయిన ఓ పోస్ట్ లో సాయిపల్లవి ఏమంత అందంగా లేదని.. డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశాంతంగా ఉండలేదనే అర్థం వచ్చేలా ఎగతాళి చేశారు.
ఈ క్రమంలో తమిళి సై తమిళ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర సమాధానం ఇచ్చింది. ‘సాయిపల్లవి గురించి బాడీ షేమింగ్ చేయడం నన్ను ఎంతగానో బాధించింది. గతంలో నా రూపాన్ని గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఎప్పుడూ ట్రోల్ చేసేవారు. అలాంటి మాటలు పడ్డవారికే ఆ బాధంటే ఏమిటో తెలుస్తుంది. బాడీ షేమింగ్ చేస్తున్నారని తీవ్రంగా బాధపడ్డాను. కానీ నా ప్రతిభతో, శ్రమతో ఆ మాటలను ఎదుర్కొన్నాను. అలాంటి కామెంట్స్ బారిన పడకుండా ఉండటానికి మనమేమీ మహాత్ములం కాదు. నాపై చేసిన కామెంట్స్‌ను నేను పట్టించుకోలేదు. కానీ ఆ ట్రోలింగ్ వల్ల బాధపడతారా? అంటే కచ్చితంగా అవుననే బదులిస్తాను అని తమిళి సై అన్నారు.
governor soundararajan responds body shaming trolls on sai pallavi
`పొట్టిగా ముదురు రంగు చర్మంతో లేదా నాలాంటి జుట్టుతో పుట్టడం మన తప్పు కాదు. వీటన్నింటిలో అందం ఉంది. అందుకే మన సామెత కాక్కై తన్ కుంజు పొన్ కుంజు (కాకి తన పిల్లను బంగారం అనుకుంటుంది.. దాని రంగు ఏదైనప్పటికీ).. నల్లగా ఉన్నందున తిరస్కరించదు“ అని ఆమె అన్నారు. మగాళ్లు తమ రూపానికి అంతగా విమర్శలను ఎదుర్కోరు. అయితే మహిళలు ఎల్లప్పుడూ అవమానాలు ఎదుర్కొంటారు. 50 ఏళ్ల వయస్సులో ఉన్న పురుషులు ఇప్పటికీ యువకులుగా చెలామణి అవుతున్నారు. మహిళలు వయో వివక్షను ఎదుర్కొంటున్నారని ఆమె తెలిపారు. నాలాంటి బలమైన నేపథ్యం నుండి వచ్చినా స్త్రీని కాబట్టి ఎగతాళి చేసినప్పుడు ఇతర మహిళలకు రాజకీయాల్లోకి వచ్చే ధైర్యం ఎలా వస్తుంది? అని కూడా ప్రశ్నించారు.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.