janaki kalaganaledu 31 january 2022 episode highlights
Janaki Kalaganaledu 31 Jan Tomorrow Episode : జానకి కలగనలేదు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఈరోజు ప్రసారం కాదు. తిరిగి సోమవారం ప్రసారం అవుతుంది. సోమవారం, 31 జనవరి 2022, 226 ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎంతో సాహసంతో బాంబును డిఫ్యూజ్ చేసినందుకు జానకిని పోలీసులు అభినందిస్తారు. తనను పొగడ్తల్లో ముంచెత్తుతారు. తన ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఇంతమంది ప్రాణాలను కాపాడింది జానకి.. అని పోలీస్ అంటాడు. ఇంత ధైర్య సాహసాలు ఉన్న ఈ అమ్మాయి ఈ ఊరిలో ఉండటం ఈ ఊరివాళ్లు చేసుకున్న అదృష్టం అంటాడు. తన కోడలును పోలీసులు పొడుగుతుంటే జ్ఞానాంబ తెగ సంతోషిస్తుంది. గోవిందరాజు కూడా సంతోషిస్తాడు.
janaki kalaganaledu 31 january 2022 episode highlights
వజ్రం విలువ భూమిలో ఉన్నప్పుడు తెలియదు. దాన్ని బయటికి తీశాకనే దాని విలువ తెలుస్తుందంటాడు. అందుకే.. ఎంతో ధైర్యసాహసాలు ఉన్న జానకి.. ఈ ఊళ్లోనే ఆగిపోకూడదు అని అంటాడు. తను పోలీస్ డిపార్ట్ మెంట్ లో చేరితే చాలా బాగుంటుంది. ప్రజలకు సేవ చేసే అవకాశం కలుగుతుంది. జానకి గారిని పోలీస్ డిపార్ట్ మెంట్ తరుపున ఐపీఎస్ చదివిస్తాం అంటాడు పోలీస్. జానకి, రామా సంతోషిస్తారు కానీ.. జ్ఞానాంబకు అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. కానీ.. జానకి ఏం మాట్లాడదు. జానకి ఒప్పుకోవాలి.. ఒప్పుకోవాలి అన అక్కడున్న వాళ్లంతా అడుగుతారు. కానీ.. అత్తయ్య గారికి తెలియకుండా సివిల్స్ కోచింగ్ వెళ్తున్నా అని ఇప్పటికే పశ్చాతాపడుతున్నాను. ఈసమయంలో నేను ఏం మాట్లాడినా అత్తయ్య గారు బాధపడతారు అనుకుంటుంది జానకి.
అందుకే.. ఇప్పటికి అయితే నేను నా నిర్ణయం ఏం చెప్పలేను అంటుంది జానకి. ఇంతలో లీలావతి వచ్చి జానకి చదువుకుంటానని ఎలా చెబుతుంది అంటుంది. ఎంత చదువుకుంటా అని నువ్వు చెబితే మాత్రం మీ అత్తగారు ఒప్పుకుంటారా ఏంటి అంటుంది లీలావతి.
ప్లీజ్ సార్.. దయచేసి ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టకండి అని అంటుంది జానకి. దీంతో మీ అభిప్రాయం తర్వాత చెప్పండి అంటాడు పోలీస్. ఇక అక్కడి నుంచి జ్ఞానాంబ ఫ్యామిలీ వెళ్లబోతుండగా.. ప్రెస్ వాళ్లు జ్ఞానాంబను చుట్టుముడతారు. తనను ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతారు.
మీ కోడలు చదువుకోకుండా మీరు వారిస్తున్నారా? తన మీద పెత్తనం చెలాయిస్తున్నారా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతారు. మంచి చాన్స్ దొరికిందని అనుకున్న లీలావతి.. జానకికి ఎలా పెళ్లి అయిందో.. ఆ తర్వాత జ్ఞానాంబ ఏం చేసిందో.. మొత్తం పబ్లిక్ గా చెబుతుంది.
ఆ తర్వాత అందరూ ఇంటికి వెళ్లిపోతారు. జానకినే ప్రెస్ వాళ్లతో ఇవన్నీ విషయాలు అత్తయ్య గారిని అడిగించి ఉంటుంది అని మల్లిక చెప్పడంతో జానకి, రామా.. మల్లికపై సీరియస్ అవుతారు. ఈ సమయంలో పిచ్చి పిచ్చిగా మాట్లాడకు అని రామా మల్లికను అంటాడు.
మరి మనింట్లో మాత్రమే జరిగిన విషయాలు వాళ్లకు ఎలా తెలిశాయి అని మల్లిక ప్రశ్నిస్తుంది. జ్ఞానాంబ మాత్రం ఈ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోదు. చివరకు జానకిని ఐపీఎస్ చదివించేందుకు ఎలాగైనా జ్ఞానాంబను ఒప్పించాలని అనుకుంటాడు.
సాక్షాతూ వాళ్లే మన ఇంటికి వచ్చి బతిమిలాడారు కదా. అమ్మ నీ మనసులో ఉన్న భయాలన్నింటినీ తీసేసి.. జానకి గారిని ఐపీఎస్ చదివిస్తే బాగుంటుందని నా అభిప్రాయం అని చెబుతాడు రామా. దీంతో జ్ఞానాంబ షాక్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్‌జి గ్యాస్…
Ration : ఒకప్పుడు రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాపుకెళ్లి, కార్డు చూపించి మ్యానువల్‌గా సంతకాలు పెట్టించి సరుకులు తీసుకోవాల్సి వచ్చేది.…
Nayanthara : సౌత్ సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నయనతార గత కొద్ది రోజులుగా తన వ్యక్తిగత…
Ys Jagan : వైసీపీకి చెందిన అనుబంధ విభాగాల ఇన్‌చార్జిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గత కొంత కాలంగా బాధ్యతలు…
Hari Hara Veera Mallu : పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘హరిహర…
Jagadish Reddy : భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కీలక నేత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…
Tomatoes : టమాటా మొక్క సోలనేసి కుటుంబానికి చెందినది.ఏ వంట చేసినా కూడా ప్రతి ఒక్క వంటలో టమాట లేనిదే…
This website uses cookies.