Talk Shows : టాక్ షో లకు హాజరు అయ్యే అతిథులు డబ్బులు తీసుకుంటారా?
Talk Shows : ఈ మధ్య కాలంలో దాదాపు అన్ని చానల్స్ లో మరియు ఓటీటీలో చివరకు యూట్యూబ్ ఛానల్స్ లో కూడా టాక్ షోలు మరియు ఇంటర్వ్యూలు చాలా చూస్తూ ఉన్నాం. సోషల్ మీడియా ద్వారా కాస్త పాపులారిటీని సొంతం చేసుకుంటే చాలు యూట్యూబ్ ఛానల్స్ వారు ఆ సెలబ్రిటీలను తీసుకు వచ్చి ఇంటర్వ్యూలు చేస్తున్నారు. ఒకప్పుడు ఇంటర్వ్యూలు అంటే చాలా క్రేజ్ ఉండేది. కానీ ఇప్పుడు ఇంటర్వ్యూలకు విలువ లేకుండా పోయింది. అందుకే స్టార్స్ తో టాక్ షో అని ఇప్పుడు ఇంటర్వ్యూలను పిలుస్తున్నారు. స్టార్స్ టాక్ షో కి హాజరైతే సదరు
చానల్ లేదా ఓటీటీ కి భారీ ఎత్తున లాభాలు వస్తాయి. మరి టాక్ షో కి వచ్చినందుకు ఆ స్టార్స్ కి ఏమైనా ఫలితం దక్కుతుందా అంటే చాలా మంది లేదని అంటారు. నిజమే స్టార్స్ ఎక్కువ శాతం మంది రెమ్యూనరేషన్ తీసుకోకుండానే టాక్ షోలో పాల్గొంటారు. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ వంటి స్టార్స్ అన్ స్టాపబుల్ కార్యక్రమంలో పాల్గొన్నందుకు రెమ్యూనరేషన్ తీసుకోరు. ఆయనకు రాజకీయంగా పబ్లిసిటీ దక్కుతుంది.. అలాగే ఆయన చేయబోతున్న సినిమాలకు పబ్లిసిటీ లభిస్తుంది. అలాగే చంద్రబాబు నాయుడు కూడా అన్ స్టాపబుల్ లో పాల్గొన్నాడు.
ఆ కార్యక్రమం చంద్రబాబు నాయుడుకి రాజకీయంగా మైలేజ్ ని కల్పిస్తుంది. కనుక ఆహా వారు వారికి రెమ్యూనరేషన్ ఇవ్వనక్కర్లేదు. కానీ చిన్న నటీనటులు, సెలబ్రిటీలు ఇంటర్వ్యూలో పాల్గొంటే మాత్రం కచ్చితంగా రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తారు. ఇటీవల సుమ అడ్డా కార్యక్రమంలో ఇద్దరు కమెడియన్స్ పాల్గొన్నారు. వారిద్దరికీ రెమ్యూనరేషన్ గా అంతో ఎంతో ఇవ్వాల్సి ఉంటుంది. ఇక యూట్యూబ్ లో ఇంటర్వ్యూలు ఇచ్చే సెలబ్రిటీలు కూడా పారితోషికం తీసుకుని మరీ ఇంటర్వ్యూలు ఇస్తారట.