Gully Boys Riyaz : భార్యతో స్టేజ్ మీద రొమాన్స్.. పొట్టి రియాజ్ గట్టోడే | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Gully Boys Riyaz : భార్యతో స్టేజ్ మీద రొమాన్స్.. పొట్టి రియాజ్ గట్టోడే

 Authored By aruna | The Telugu News | Updated on :28 July 2022,8:40 pm

Gully Boys Riyaz : గల్లీ బాయ్స్ టీం బుల్లితెరపై ఎంతగా ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. రియాజ్, భాస్కర్, సద్దాం, యాదమ్మ రాజు ఇలా అందరూ బాగానే క్రేజ్ దక్కించుకున్నారు. ఇక ఇందులో సద్దాం టాప్ కమెడియన్‌గా మారాడు. జబర్దస్త్ షోకు ఆది ఎలానో.. అదిరింది షోకు సద్దాం అలా అన్నట్టుగా మారిపోయాడు. ఇక అందులో పొట్టి నరేష్ ఎలానో.. ఇక్కడ రియాజ్ అలా అన్నట్టుగా ఫేమస్ అయ్యాడు.

మొత్తానికి రియాజ్ కామెడీ టైమింగ్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక కమెడియన్‌గా మాత్రమే కాకుండా జనసేనలోనూ తిరగడం, ఎన్నికల్లో నిల్చోవడంతో మరింతగా ఫేమస్ అయ్యాడు.అయితే ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. అది వేరే విషయం. ఇక రియాజ్ పెళ్లి విషయం మాత్రం ఎప్పుడూ ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఆయన పెళ్లి ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతుంటాయి. పెళ్లి ఎప్పుడు అయిందనే విషయంలో క్లారిటీ లేదు గానీ..

Gully Boys Riyaz Wife on Zee Telugu Event

Gully Boys Riyaz Wife on Zee Telugu Event

పెళ్లి మాత్రం జరిగిందని చెప్పడానికి ఫోటోలు మాత్రం సాక్ష్యంగా నిలిచాయి. నెట్టింట్లో ఆయన పెళ్లి ఫోటోలు, బరాత్‌కు సంబంధించిన వీడియోలు తెగ చక్కర్లు కొట్టాయి. ఇక ఇప్పుడు ఏకంగా రియాజ్ తన భార్యను స్టేజ్ మీదకు తీసుకొచ్చాడు. అందరికీ పరిచయం చేసేశాడు. కొంగు చాటు మొగుడు అన్నట్టుగా రియాజ్ తన భార్య యాస్మిన్ వెనకాల దాక్కున్నాడు. తన భార్య పేరు చెబుతూ తెగ మురిసిపోయాడు. సద్దాం కామెడీ బాగా చేస్తాడా? రియాజ్ బాగా కామెడీ చేస్తాడా? అని ఆమెను అడిగితే.. తన భర్త పేరు చెప్పింది యాస్మిన్.

YouTube video

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది