Guntur Karam Movie : గుంటూరు కారం విషయం లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ !
Guntur Karam Movie : ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘ గుంటూరు కారం ‘ సినిమాలో నటిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దీంతో ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవల విడుదలైంది. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమా మొదలై చాలా రోజులు అవుతున్నా కొన్ని కారణాలతో వాయిదా పడుతూ వస్తుంది. అయిన ఈ సినిమాను వచ్చే ఏడాది ఎలాగైనా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
ఓ రెండు మూడు రోజుల్లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. అయితే మధ్యలో ఒక్కసారి మాత్రం మహేష్ బాబు గ్యాప్ తీసుకుంటారని టాక్ వినిపిస్తుంది. మనకు తెలిసిందే మహేష్ బాబు షూటింగ్లో కాస్త ఖాళీ సమయం దొరికిన ఫ్యామిలీతో వెకేషన్ కు వెళుతూ ఉంటారు. అందుకే గుంటూరు కారం సినిమాకు గ్యాప్ వచ్చిన ఒక వారం పాటు లొకేషన్ కి వెళ్లే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అయితే మహేష్ బాబు గ్యాప్ తీసుకుంటే సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమా నుంచి హీరోయిన్గా పూజ హెగ్డే తొలగించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీలను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్గా తమన్ తొలగిపోయినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కానీ త్రివిక్రమ్ నిర్మాతలు తమన్ ను పట్టుబట్టి ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఫిక్స్ చేశారని తెలుస్తుంది. ఈ సినిమా ప్రకటించి చాలా రోజులు అవుతున్న ఇప్పటికే హీరోయిన్ మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అని అభిమానులు కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు రాజమౌళితో సినిమా చేయడన్నాడు. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో సరికి ఎక్కుతుంది.