Guppedantha Manasu 10 Dec Today Episode : జగతి గురించి తప్పుగా మాట్లాడిన లెక్చరర్లు.. వసుధారకు కోపం వచ్చి ఏం చేస్తుంది? ఈ విషయం రిషికి తెలుస్తుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Guppedantha Manasu 10 Dec Today Episode : జగతి గురించి తప్పుగా మాట్లాడిన లెక్చరర్లు.. వసుధారకు కోపం వచ్చి ఏం చేస్తుంది? ఈ విషయం రిషికి తెలుస్తుందా?

 Authored By gatla | The Telugu News | Updated on :10 December 2022,9:00 am

Guppedantha Manasu 10 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 10 డిసెంబర్ 2022, శనివారం ఎపిసోడ్ 630 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వసుధార, రిషి బంధం ముడిపడాలంటే మనం కూడా ఒక అడుగు ముందుకు వేయాలి. ఒక ఆలోచన చేయాలి మహీంద్రా అంటుంది జగతి. దీంతో ఆలోచన చేద్దాం జగతి అంటాడు మహీంద్రా. మరోవైపు కాలేజీలో రిషి.. అందరు లెక్చరర్లతో మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. మిషన్ ఎడ్యుకేషన్ గురించి చెబుతాడు రిషి. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ఇందుకు మనకు దోహదపడుతుంది. అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. మా పెదనాన్న గారు ఈ మధ్యే కొన్ని రాష్ట్రాలను సందర్శించి వచ్చారు అని చెబుతాడు రిషి. దీంతో ఫణీంద్రా మాట్లాడుతాడు. మిషన్ ఎడ్యుకేషన్ చాలామందిని ఆకర్షించింది అంటాడు. ఈ మిషన్ అందరికీ గర్వకారణం అంటాడు.

guppedantha manasu 10 december 2022 full episode

guppedantha manasu 10 december 2022 full episode

మిషన్ ఎడ్యుకేషన్ కు సంబంధించిన వివరాలు.. ఇతర రాష్ట్రాల మంత్రులకు మెయిల్ చేయాలని వసుధారతో చెబుతాడు ఫణీంద్రా. జగతి కాలేజీకి ఎప్పుడు వస్తే అప్పటి నుంచి మిషన్ ఎడ్యుకేషన్ గురించి ప్రారంభిద్దాం అంటాడు మహీంద్రా. మరోవైపు జగతి మేడమ్ ఎందుకు కాలేజీకి రావడం లేదు ఎందుకు అని మళ్లీ అదే ఇద్దరు లెక్చరర్లు మాట్లాడుకుంటారు. తను ఎందుకు వస్తుంది. రిషి సార్ తల్లి, మహీంద్రా సార్ వైఫ్.. ఫణీంద్రా సార్ మరదలు.. తను కాలేజీకి వస్తే ఏంటి.. రాకుంటే ఏంటి.. ఆమెను అడిగే వారు ఎవరు ఉన్నారు. ఆమె వచ్చినా కూడా చేసే పని ఏముంది. ఏదో రెండు ముక్కలు చెప్పి మిషన్ ఎడ్యుకేషన్ అనడం అంతే.. అంటూ మాట్లాడుకుంటుండగా వసుధార వింటుంది.

మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. ఒకరు మన మధ్య లేనప్పుడు వాళ్ల గురించి తప్పుగా మాట్లాడటం కరెక్ట్ కాదు అంటుంది వసుధార. మీరు ఏం మాట్లాడుతున్నారో నేను పూర్తిగా వినలేదు కానీ.. మీరు మాట్లాడింది నాకు అర్థం అయింది.. అంటుంది వసుధార.

జగతి మేడమ్ గురించి మీరు ఆలోచించే విధానం తప్పు అంటున్నా. జగతి మేడమ్ చేసే పనులు మేము చేయలేమా.. ఆవిడే గొప్పా అని మనం అనుకోకూడదు. ఆవిడ లాగా మనం కూడా ఉన్నతంగా ఆలోచించాలి అంటుంది వసుధార.

ఆవిడ ఒక శిఖరం. మీరు కొత్తగా వచ్చారు కాబట్టి ఆమె గురించి మీకు ఏం అర్థం కాలేదని నా అభిప్రాయం అంటుంది వసుధార. దీంతో అంటే మేము కొత్తగా వచ్చాం కాబట్టి మాకేం తెలియదు అంటున్నావా అంటుంది లెక్చరర్.

Guppedantha Manasu 10 Dec Today Episode : తన క్లాస్ రూమ్ లో కూర్చొని బాధపడ్డ వసుధార

దీంతో మీకు ఏం తెలియదు అని అనడం లేదు. జగతి మేడమ్ గురించి మీకు అర్థం కావడం లేదు అంటుంది. దీంతో వసుధార.. నువ్వు మా స్టూడెంట్ లా మాట్లాడటం లేదు. లెక్చరర్ తో ఎలా మాట్లాడాలో తెలియదు నీకు అంటారు లెక్చరర్లు.

యూనివర్సిటీ టాపర్ అయితే కావచ్చు.. యూత్ ఐకాన్ అయితే కావచ్చు.. గర్వం ఉంటుంది కానీ.. మాకే సలహాలు ఇస్తున్నావా? ఎంతైనా జగతి మేడమ్ శిష్యురాలివి కదా. నువ్వు గొప్పదానివి అయితే కావచ్చు కానీ.. లెక్చరర్లకు సలహాలు ఇచ్చేంత గొప్పదానివి మాత్రం కాదు అని అంటారు లెక్చరర్లు.

కట్ చేస్తే మహీంద్రా ట్యాబ్లెట్స్ వేసుకోమంటూ అంటాడు రిషి. ఇంతలో క్యారేజ్ తెస్తాడు ఆఫీస్ బాయ్. హాల్ లో పెట్టి వసుధార మేడమ్ ను కూడా భోజనానికి రమ్మని చెప్పు అంటాడు రిషి. డీబీఎస్టీ కాలేజీ ద్వారా మనం పిల్లలకు ఏదైనా కొత్త కోర్సులు చెప్పగలమో ఆలోచించు అంటాడు ఫణీంద్రా.

దీంతో అవును పెదనాన్న.. అంటాడు రిషి. డాడ్ మీరు ఈ విషయం గురించి మేడమ్ తో కలిసి చర్చించండి అంటాడు రిషి. మరోవైపు మినిస్టర్ కాల్ చేస్తాడు రిషికి. నిన్ను వెంటనే కలవాలి. ఒకసారి వస్తావా అంటాడు. దీంతో సరే అని అంటాడు. మినిస్టర్ గారు కలవాలని అంటున్నారు అని ఫణీంద్రాతో చెబుతాడు.

ఇంతలో వసుధార మేడమ్ లేరు అనడంతో తను ఎక్కడుందో నాకు తెలుసులే అని చెప్పి బయటికి వస్తాడు రిషి. ఇంతలో వసుధార.. తన క్లాస్ రూమ్ కు వెళ్తుంది. అక్కడ తన అనుభవాలను గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది.

ఇంతలో రిషి అక్కడికి వస్తాడు. సార్.. నేనిక్కడున్నానని మీకెలా తెలిసింది అని అడుగుతుంది వసుధార. దీంతో నువ్వు ఏ టైమ్ లో ఎలా ఉంటావో.. ఏ మూడ్ లో ఉంటావో నాకు కాకుండా ఎవరికి తెలుస్తుంది వసుధార అంటాడు రిషి.

నువ్వు ఒంటరితనాన్ని కోరుకుంటున్నావంటేనే నీ మనసు బాగోలేదన్నట్టు. అసలు ఏం జరిగింది చెప్పు అంటాడు రిషి. లెక్చరర్స్ మాట్లాడిన మాటలు చెప్పి రిషి సార్ ను బాధపెట్టడం అవసరమా అని అనుకుంటుంది వసుధార.

ఈ క్లాస్ రూమ్ కు రాగానే ఎన్నో మెమోరీస్ గుర్తొచ్చాయి సార్. మీరు అక్కడ క్లాస్ చెబుతుంటే నేను శ్రద్ధగా వినడం.. అప్పుడప్పుడు మీరు కొప్పడటం, నేనేమో బుంగమూతి పెట్టి అలగడం.. ఇప్పుడు అవన్నీ లేవు కదా సార్ అంటుంది వసుధార.

నువ్వు ఇక్కడ వేరే ఏదో ఆలోచిస్తూ నేను ఇక్కడికి వచ్చేసరికి ఆ విషయం దాటేసి ఇది చెబుతున్నావా అని అంటాడు రిషి. నేనేమైనా అప్పుడప్పుడు ఎక్కువ చేస్తున్నట్టు ఎక్కువ మాట్లాడుతున్నట్టు మీకు అనిపిస్తుందా సార్ అంటాడు.

దీంతో అదేంటి కొత్తగా అలా అడుగుతున్నావు అంటాడు రిషి. నా పరిమితులు దాడి నేను ఆలోచిస్తున్నానేమో అనిపిస్తోంది అంటుంది వసుధార. తర్వాత తనను సముదాయించి తీసుకెళ్తాడు రిషి.

ఇంతలో జగతి మేడమ్ కు ఆరోగ్యం బాగోలేకపోతే చూడటానికి లెక్చరర్లు వెళ్తారు. దేవయానితో మాట్లాడుతారు. మాకు యాక్సిడెంట్ అయిందని లేట్ గా తెలిసింది మేడమ్ అంటారు. దీంతో వసుధార చెప్పలేదా అంటే.. ఆమె గురించి ఎందుకు లేండి.. ఆవిడ ఒకప్పుడు మా స్టూడెంట్.. ఇప్పుడు ఆవిడే మాకు పాఠాలు చెబుతుంది అంటారు.

దీంతో వీళ్లు నచ్చి వాళ్ల ఫోన్ నెంబర్లను అడుగుతుంది దేవయాని. ఆ తర్వాత జగతి గదికి వీళ్లను తీసుకెళ్లు అని ధరణికి చెబుతుంది. మీరు వెళ్లండి అని చెబుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది