Jyothi Rai : దేనికైన సిద్ధం, ఏదైన చేస్తానంటూ గుప్పెడంత మ‌న‌సు ఆంటీ స్ట‌న్నింగ్ కామెంట్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jyothi Rai : దేనికైన సిద్ధం, ఏదైన చేస్తానంటూ గుప్పెడంత మ‌న‌సు ఆంటీ స్ట‌న్నింగ్ కామెంట్స్..!

 Authored By ramu | The Telugu News | Updated on :13 June 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Jyothi Rai : దేనికైన సిద్ధం, ఏదైన చేస్తానంటూ గుప్పెడంత మ‌న‌సు ఆంటీ స్ట‌న్నింగ్ కామెంట్స్..!

Jyothi Rai  : బుల్లితెర ప్రేక్ష‌కుల‌కి ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు జ్యోతిరాయ్. గుప్పెడంత మనసు సీరియల్‌తో బాగా పాపుల‌ర్ అయిన జ్యోతిరాయ్ జగతి పాత్రలో క‌నిపించి తెగ సంద‌డి చేసింది. సీరియ‌ల్‌లో చీర కట్టుకొని ఎంతో ఒద్దికగా, పద్దతైన పాత్రలో నటించిన జ్యోతిరాయ్ సోషల్ మీడియాలో మాత్రం యంగ్ హీరోయిన్ గా తన అందచందాలను ప్రదర్శిస్తోంది. జ్యోతిరాయ్ మిడిల్ ఏజ్ హోమ్లీ రోల్ లో మెస్మరైజ్ చేసింది. ఆమె లుక్ నిజమైన ఒక తల్లిని గుర్తు చేసేది. అనూహ్యంగా జగతి పాత్రను సీరియల్ నుండి తొలగించారు. ఆ పాత్రను చంపేశారు. సినిమాలు, వెబ్ సిరీస్లలో బిజీ అయిన కారణంగా జ్యోతిరాయ్ గుప్పెడంత మనసు సీరియల్ నుండి తప్పుకున్న‌ట్టు స‌మాచారం.

Jyothi Rai ఇది అస‌లు క్లారిటీ..

అయితే సీరియ‌ల్‌లో సంద‌డి త‌గ్గించిన సోష‌ల్ మీడియాలో మాత్రం నానా ర‌చ్చ చేస్తుంది. ఏకంగా బికినీలు ధరించి ఆమె బుల్లితెర ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది. ఈ క్రమంలో సోషల్ మీడియా ట్రోల్ ఎదురయ్యాయి. సదరు ట్రోల్స్ పై తాజాగా జ్యోతిరాయ్ స్పందించారు. ‘ఏ మాస్టర్ పీస్’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో పాల్గొన్న ఆమె ట్రోల్స్ ని ఉద్దేశించి మాట్లాడుతూ.. మనం ఒక ప్రొఫెషన్ లో ఉన్నాము. మోడరన్ రోల్స్ వస్తే వాటికి తగ్గట్లుగా, ట్రెడిషనల్ రోల్ వస్తే అందుకు తగ్గట్లుగా తయారు అవుతాము. ఇక నన్ను ట్రోల్ చేసే వాళ్ళ గురించి చెప్పాలంటే అది వాళ్ళ మెంటాలిటీ, వ్యక్తిత్వం. వాళ్ళు ట్రోల్ చేస్తారని నేను ఫోటోలు పెట్టడం లేదు. ఈ రోజుల్లో ప్రతిదీ సోషల్ మీడియా ద్వారానే నడుస్తుంది. మనం ట్రెండ్ ని ఫాలో కావాల్సిందే. నేను ఇలానే ఉంటాను అంటే కుదరదు.

Jyothi Rai దేనికైన సిద్ధం ఏదైన చేస్తానంటూ గుప్పెడంత మ‌న‌సు ఆంటీ స్ట‌న్నింగ్ కామెంట్స్

Jyothi Rai : దేనికైన సిద్ధం, ఏదైన చేస్తానంటూ గుప్పెడంత మ‌న‌సు ఆంటీ స్ట‌న్నింగ్ కామెంట్స్..!

మీరు నన్ను గుప్పెడంత మనసు జగతి క్యారెక్టర్ లోనే చూస్తున్నారు. కానీ నేను అంతకు ముందు ఓ షో 60 ఎపిసోడ్స్ మోడరన్ డ్రెస్సుల్లో చేశాను. అది మీకు తెలియదు… అని అన్నారు. ప్రొఫెషన్ కోసం గ్లామరస్ ఫోటో షూట్స్ తప్పదని, పాత్రకు తగ్గట్లు మారతామని జ్యోతిరాయ్ చెప్పకనే చెప్పింది. జగతి ప్రస్తుతం రెండు ప్రాజెక్టుల్లో చేస్తోంది. వీటితోపాటు ఏ మాస్టర్ పీస్ అనే ఓ సినిమాలో, ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. ఈ రెండు ప్రాజెక్టులు త్వరలోనే విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఏ మాస్టర్ పీస్ చేస్తున్న సమయంలోనే ఈ సిరీస్ దర్శకుడితో ఆమె ప్రేమలో పడింది. అంతేకాకుండా తన ఇన్ స్టా హ్యాండిల్ పేరు కూడా మార్చేసుకుంది. దర్శకుడు సురేష్ కుమార్ ఇంటిపేరును తన ఇంటిపేరుగా మార్చుకుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది