Guppedantha Manasu 13 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 13 డిసెంబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 632 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. చీకట్లో ఆకాశాన్ని చూడటం బాగుంటుంది కదా సార్ అంటుంది వసుధార. దీంతో బాగుండదు అంటాడు రిషి. అద్భుతంగా ఉంటుంది అంటాడు. వసుధార జీవితం అంటే ఏంటి అని అడుగుతాడు. దీంతో కాల ప్రవాహంలో మనం అలా అలా వెళ్లడమే జీవితం అంటారు సార్ అంటుంది వసుధార. సరే.. ఈ ఆనందమైన జీవితం అంటే ఏంటి అని అడుగుతాడు. దీంతో బోలెడు మెమోరీస్ ను సంపాదించుకోవడం అంటుంది వసుధార. దీంతో నాకైతే వసుధారను సంపాదించుకోవడమే ఈ జీవితం అంటాడు. దీంతో మీరేంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నారు అంటుంది వసుధార. దీంతో నువ్వు నా జీవితంలో అడుగుపెట్టినప్పటి నుంచి నాకు ప్రతిరోజు కొత్తగానే ఉంటుంది అంటాడు.
నువ్వు రోజూ నాతోనే ఉంటావు. నాతో పాటే కాలేజీకే వస్తావు. నాతో పాటే ఇంటికి వస్తావు. దారిలో బోలెడు కబుర్లు చెబుతావు అందుకే అంటాడు. ఇంకా అంటే.. ఈవెనింగ్ ఇంట్లో కలిసి భోం చేస్తాం అందుకు అందుకు అంటాడు. ఇంకా అంటే ఇదిగో ఇలా ఆకాశం కింద మాట్లాడుకుంటూ ఉంటాం. ఇలా ఇంకా చెప్పుకుంటే పోతే తెల్లారిపోతుంది అంటాడు. దీంతో నిజమే సార్ అంటుంది వసుధార. నేను ఇంతలా మాట్లాడుతుంటే నువ్వేంటి ఒకటి రెండు మాటలతో ఆపేస్తున్నావు అంటాడు రిషి. దీంతో ఇలా ఒకటి రెండు మాటలు మాట్లాడితేనే బాగుంటుంది సార్ అని రిషి చేయి పట్టుకొని అతడి భుజం మీద తల ఆనిస్తుంది వసుధార.
మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి అందరు లెక్చరర్లతో మీటింగ్ పెడతాడు రిషి. ఇన్నాళ్లు ఆ ప్రాజెక్టును జగతి మేడమ్ చూసుకున్నారు. దీని గురించి ఇంకా చెప్పాలంటే ముందు మీరు జగతి మేడమ్ వీడియో చూడాలి అని ఆ వీడియోను చూపిస్తాడు రిషి.
అందులో నేను మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నానని జగతి చెబుతుంది. ఇలా చెప్పడానికి మనసులో బాధగా ఉన్నా.. నా మూలంగా ప్రాజెక్ట్ ఆగిపోకూడదని నేను ఈ నిర్ణయం తీసుకున్నా అంటుంది. నా స్థానంలో వసుధారను నియమిస్తున్నట్టు మినిస్టర్ గారు తెలిపారు. ఇన్నాళ్లు ఈ ప్రాజెక్ట్ లో నాకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన డీబీఎస్టీ కాలేజీ ఎండీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. వసుధారకు అభినందనలు అని ఆ వీడియోలో చెబుతుంది జగతి.
విన్నారు కదా. ఇది జగతి మేడమ్ అభ్యర్థన. మినిస్టర్ గారి ఆమోదం. సో.. మనం ఈ విషయంలో ఏకాభిప్రాయానికి వస్తే బాగుంటుందని నా అభిప్రాయం ఏమంటారు అంటాడు రిషి. దీంతో లెక్చరర్లు అందరూ వాళ్లలో వాళ్లే మాట్లాడుకుంటూ ఉంటారు.
ఇంతలో మినిస్టర్ నుంచి కాల్ వస్తుంది రిషికి. వసుధారను నియమించాలని నిర్ణయం అయితే తీసుకున్నాం కానీ.. మనకు మనమే సొంత నిర్ణయాలు తీసుకోవడం ఎందుకో నాకు కరెక్ట్ కాదని అనిపిస్తోంది. రేపు ఎవరైనా వసుధార నియామకాన్ని ప్రశ్నిస్తే మన దగ్గర సరైన సమాధానం ఉండదు. మీకు నచ్చిన వారిని నియమిస్తారా? అని ప్రశ్నించే అవకాశం ఉంది కదా అంటాడు.
వసుధార ఇందుకు అర్హురాలే కానీ.. ప్రజాస్వామ్యబద్ధంగా వసుధారను ఎంపిక చేస్తే బెటర్ అని నా అభిప్రాయం. ఎవ్వరూ ప్రశ్నించని విధంగా వసుధార నియామకాన్ని నువ్వే చూసుకోవాలి. ఇలా చేస్తే పారదర్శకత ఉంటుంది. ఒక మంచి సంప్రదాయాన్ని పాటించినవాళ్లం అవుతాం అని అంటాడు మినిస్టర్.
రిషి.. ఏమైంది అని అడుగుతారు మహీంద్రా, ఫణీంద్రా. డాడ్.. డైరెక్ట్ గా మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్ గా వసుధారను నియమించడం కరెక్ట్ కాదేమో అని మినిస్టర్ గారి అభిప్రాయం అంటాడు. మరి.. ఇప్పుడు ఏం చేద్దాం అంటాడు మహీంద్రా. వసుధార నియామకం మినిస్టర్ గారికి, మీకు, నాకు సమ్మతమే కానీ.. బోర్డ్ మెంబర్స్ కు ఇష్టమో కాదో తెలియదు కదా డాడ్ అంటాడు రిషి.
ఓటింగ్ పెడదాం పెదనాన్న అంటాడు రిషి. అవును పెదనాన్న అంటాడు. ప్రత్యక్ష ఓటు అంటాడు. డాడ్.. బోర్డ్ మెంబర్స్ అందరినీ పిలిపించండి. వసుధార మిషన్ ఎడ్యుకేషన్ కు ప్రాజెక్ట్ హెడ్ గా ఉండాలని, ఉండకూడదని ఓటింగ్ పెట్టిద్దాం. మెజారిటీ ప్రకారం మనం ముందుకెళ్దాం అంటాడు రిషి.
బయటికి రాగానే ఒక లెక్చరర్.. దేవయానికి ఫోన్ చేస్తుంది. మీరు చెప్పినట్టే మినిస్టర్ గారికి మెయిల్ పెట్టాం. వసుధార నియామకంపై మాకు అభ్యంతరాలు ఉన్నాయని చెప్పడంతో మినిస్టర్ గారు ఓటింగ్ పెట్టమన్నారు అంటూ దేవయానికి చెబుతుంది. అవన్నీ వసుధార వింటుంది.
మరోవైపు మహీంద్రా జగతికి ఫోన్ చేసి మాట్లాడుతాడు. ఇంతలో అక్కడికొచ్చిన వసుధార.. ఇదంతా దేవయాని చేశారు అని మహీంద్రాకు చెబుతుంది. దీంతో మహీంద్రాకు కోపం వస్తుంది. ఒకరకంగా దేవయాని మేడమ్ మనకు అగ్నిపరీక్ష పెట్టింది అనుకుందాం. అందుకే ఈ పరీక్షలో గెలుద్దాం అంటుంది వసుధార.
రిషి దగ్గరకు వెళ్లిన వసుధార.. రిషి టెన్షన్ పడటం చూస్తుంది. సార్.. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కు హెడ్ గా నేను ఉండటం అవసరమా అనిపిస్తోంది అంటుంది. దీంతో ఏం మాట్లాడుతున్నావు. అవసరమా అంటావేంటి అంటాడు. కాసేపటిక్రితం దాకా నాకు ఎలాంటి ఆలోచన లేదు. మహీంద్రా సార్ తో కూడా ఈ పరీక్షను ఎదుర్కుందాం అన్నా కానీ.. అంటూ ఆగిపోతుంది.
ఈ కాసేపట్లో నీ మనసు ఎందుకు మారింది అంటాడు. దీంతో ఏంటో సార్ నాకు అర్థం కావడం లేదు అంటుంది. జగతి మేడమ్ సీట్ లో కూర్చోవాలని నాకు అనిపించడం లేదు. వేరే ఎవరినైనా ఆ స్థానంలో నియమించండి అంటుంది వసుధార. అసలు ఎందుకు వద్దంటున్నావో సరిగ్గా చెప్పు అంటాడు.
ఇందులో దేవయాని మేడమ్ ఏదో కుట్ర చేస్తుంది అని మనసులో అనుకుంటుంది. మీకు ఎలా చెప్పాలి అని అనుకుంటుంది. తర్వాత బోర్డ్ మెంబర్స్ అందరూ వస్తారు. ప్రత్యక్ష ఎన్నికను ప్రారంభిస్తారు. వసుధారకు ఓటు వేసే అవకాశం లేదు అంటాడు రిషి.
డీబీఎస్టీ కాలేజీలో ఏదీ ఏకపక్షం కాదని చెప్పడానికి ఇది మంచి ఉదాహరణ అవుతుంది అంటాడు రిషి. వీడియో కూడా తీపిస్తాడు రిషి. చివరగా ఎస్ ఆర్ నో.. దేనికి ఓట్లు ఎక్కువగా వస్తాయో దాన్ని బట్టే రిజల్ట్ ఉంటుంది అంటాడు రిషి. ముందు ఫణీంద్రా ఓటు వేస్తాడు. తర్వాత ఓ లెక్చరర్ వెళ్లి నో మీద ఓటేస్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్‌కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్‌గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.