Intinti Gruhalakshmi 13 Dec Today Episode : తులసిని తన సొంతూరుకు తీసుకెళ్లి ముడుపులో కట్టిన తన కోరికను తీర్చిన సామ్రాట్.. ఈ విషయం తెలిసి తులసి ఏం చేస్తుంది?

Intinti Gruhalakshmi 13 Dec Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 13 డిసెంబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 814 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నేను మిమ్మల్ని గుడికి తీసుకెళ్లడం వల్లనే కదా.. మీకు ముడుపు కట్టుకునే అవకాశం వచ్చింది. అందుకే.. మీరు నాకు థాంక్స్ చెప్పుకోవాలి. అన్నట్టుగా రేపు మనం ప్రాజెక్ట్ పనిమీద ఊరికి వెళ్తున్నం. మీరు కూడా వస్తున్నారు ఉదయం 7 గంటలకే వెళ్లాలి అని అంటాడు సామ్రాట్. దీంతో ఏ ఊరికి అని అడుగుతుంది. దీంతో నాకు తెలియదు అంటాడు. అంటే ఫైల్ లో ఉంది చూడలేదు అని చెబుతాడు. మరోవైపు నందు లాప్ టాప్ లో పని చేస్తూ ఉంటాడు. ఇంతలో ఫుడ్ ఆర్డర్ వస్తుంది. దాన్ని వెళ్లి నందు తీసుకుంటాడు. ఎవరు ఫుడ్ ఆర్డర్ పెట్టారు అని అడుగుతాడు నందు. దీంతో ప్రేమ్ అని చెబుతాడు. దీంతో అసలు ఎన్నడూ లేనిది ప్రేమ్ ఎందుకు ఆర్డర్ పెట్టాడు అని అనుకుంటాడు.

intinti gruhalakshmi 13 december 2022 full episode

ఇంతలో లాస్య వచ్చి ప్రేమ్ ఆర్డర్ చేశాడా అని అడుగుతుంది. దీంతో అవును. నీకెలా తెలుసు అని అంటాడు నందు. దీంతో ఇంటి ఖర్చులు తగ్గించుకోవాలని నేను అన్నందుకు శృతి నాతో గొడవ పెట్టుకుంది. అందుకే.. ప్రేమ్ బయటి నుంచి ఫుడ్ ఆర్డర్ చేసినట్టున్నాడు అంటుంది లాస్య. దీంతో శృతిని పిలిచి కొంచెం ఉద్యోగాలు లేనప్పుడు అందరం అడ్జెస్ట్ చేసుకోవాలి. తులసి చెబితేనే కాదు.. మంచి గురించి ఎవరు చెప్పినా వినాలి. ఇంకోసారి నాకు ఇలాంటి ఫిర్యాదు అందకూడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో బాధపడకమ్మా.. అని అనసూయ అంటుంది. చూశారా.. ఎలా చేసిందో.. ఎలా అంకుల్ ను రెచ్చగొట్టిందో అంటుంది శృతి.

ఇప్పుడు గొడవ చేస్తే మనం చెడ్డవాళ్లం అవుతాం అనసూయ. జరగనివ్వు. ఏం జరుగుతుందో చూద్దాం. ఈ విషయం ప్రేమ్ కు తెలియకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీదే అంటాడు పరందామయ్య. ఆ తర్వాత సాయంత్రం అవుతుంది. హనీ ఇంటికి వస్తుంది. తనను చూసి టెన్షన్ పడుతుంటాడు సామ్రాట్.

ఎప్పుడూ లేనిది హనీ ఇలా సీరియస్ గా ఉంది అని అనుకుంటాడు. ఏం జరిగి ఉంటుంది. ముఖం చూసి పలకరించలేదు.. అని అనుకుంటాడు. హనీ మాత్రం అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. రిజల్ట్ వచ్చిందేమో.. ఫస్ట్ ర్యాంక్ మిస్ అయిందేమో. ఇప్పుడు ఏం చేయాలి. హనీని ఎలా ప్రూవ్ చేయాలి అని అనుకుంటాడు సామ్రాట్.

ఏం జరిగిందంటే అని అనబోతుండగా.. మోసం చేశావు. దేవుడితో మాట్లాడావా అని అడుగుతుంది హనీ. దీంతో మాట్లాడటమే కాదు.. అమ్మవారికి ముడుపు కూడా కట్టాను అంటాడు. మళ్లీ సెకండ్ ర్యాంక్ వచ్చిందా. అమ్మవారు బిజీగా ఉన్నట్టున్నారు అంటాడు సామ్రాట్.

Intinti Gruhalakshmi 13 Dec Today Episode : ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న హనీ.. సంతోషించిన సామ్రాట్

దీంతో నాకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటుంది హనీ. దీంతో సామ్రాట్ చాలా సంతోషిస్తాడు. నువ్వు ముడుపు కట్టిన అమ్మవారు చాలా పవర్ ఫుల్ అనుకుంటా నాన్న. అడగగానే ఫస్ట్ ర్యాంక్ ఇచ్చింది. ఎందుకైనా మంచిది అమ్మవారితో నువ్వు టచ్ లో ఉండు. ఫ్యూచర్ లో అవసరం వస్తుంది అంటుంది.

నువ్వు వచ్చేలోపు నీకు ఇష్టమైన వంటలు చేయించాను. నువ్వు రెడీ అయి వస్తే ఇద్దరం కలిసి భోం చేద్దాం. ఈలోపు నేను నా ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటాను అంటుంది హనీ. సరే అంటాడు సామ్రాట్. ఇంతలో తులసి ఫోన్ చేస్తుంది సామ్రాట్ కు. సరిగ్గా మీ గురించే ఆలోచిస్తున్నాను. ఇంతలో మీరే కాల్ చేశారు అంటాడు సామ్రాట్.

ఈ సమయంలో నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు అంటుంది తులసి. మీకు గుడ్ న్యూస్ చెబుదామని అనుకున్నా. హనీకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటాడు. దీంతో అవునా అని షాక్ అవుతుంది. అమ్మ వారి పవర్ రుజువు అయిందన్నమాట అంటుంది.

అంటే నేను కూడా నా ముడుపు మీద ఆశ పెట్టుకోవాలన్నమాట అని అంటుంది. అది సరే కానీ.. రేపు మనం వెళ్లబోయే ఊరు పేరేంటి అని అడుగుతుంది. దీంతో ఇప్పుడే చెబితే ఎలా.. సస్పెన్స్ ఉండాలి కదా అని అనుకుంటాడు సామ్రాట్. రేపు చెబుతా అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు.

మరోవైపు సాయంత్రం కాగానే పరందామయ్యకు ఆకలి వేస్తుంది. దీంతో నాకు బాగా ఆకలి వేస్తోంది. ఈ సమయానికి ఏదో ఒకటి తినాలి అని అనసూయకు తెలుసు కదా. తులసి ఉంటే అన్నీ చూసుకునేది. కానీ.. ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుంటున్న సమయంలో అప్పుడే అనసూయ తీసుకొని వస్తుంది.

అవి తినబోతుండగా అప్పుడే వచ్చిన లాస్య.. దాన్ని తిననీయకుండా ఆపుతుంది. నోట్లో వేసుకొని తింటూ.. హమ్.. బాగున్నాయి అంటుంది. వాటిని తనే మొత్తం తింటుంది. ఇలాంటి మసాలా ఐటెమ్స్ మీరు తినకూడదు అని అంటుంది. ఇలాంటివి నాకు కూడా చేసి పెట్టొచ్చు కదా. కాస్త ఒళ్లు తగ్గుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది లాస్య.

తను కావాలనే చేస్తోంది అని అంటుంది అనసూయ. దీంతో మొగుడు పెళ్లాల మధ్య బంధం తుమ్మితే ఊడిపడేలా ఉంది. ఇప్పుడు మనం రెచ్చిపోతే వాళ్ల కాపురం రోడ్డున పడుతుంది. చూడు అనసూయ.. ఓపిక ఉన్నంత వరకు భరిద్దాం. ఈ విషయం తులసికి అస్సలు తెలియకూడదు.

ఈ పూటకు మంచినీళ్లు తాగుతాను. కనీసం నా పొట్ట అయినా తగ్గుతుంది. నీ కోరిక కూడా తీరుతుంది అని మంచినీళ్లు తాగుతాడు పరందామయ్య. మరోవైపు ఉదయం కాగానే ఇద్దరూ కారులో వెళ్తుంటారు. ఉదయం హడావుడి పెట్టానా అంటాడు సామ్రాట్.

దీంతో మా వాళ్లు ఉంటే హడావుడే ఉండేది కానీ.. ఇప్పుడు నేను ఒంటరిదాన్నే కదా అంటుంది తులసి. ఇంతలో దివ్య స్టోరీ చెబుతుంది తులసి. దివ్య కడుపులో ఉన్నప్పుడు కాన్పు కష్టం అబార్షన్ చేయించుకో అన్నారు. లేకపోతే ప్రాణానికే ప్రమాదం అన్నారు. కానీ.. నందగోపాల్ గారికి ఆడపిల్ల అంటే ప్రాణం అంటుంది తులసి.

ఆయన కోసం ప్రాణాలకు తెగించి దివ్యను కన్నాను అని చెబుతుంది తులసి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Wife Killed : ప్రియుడి కోసం భర్తను చంపిన భార్య..అది కూడా పెళ్లైన 30ఏళ్లకు..ఏంటి ఈ దారుణం !!

wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…

20 minutes ago

Sahasra Case : క్రిమినల్ కావాలనేదే అతడి కోరిక !!

కూకట్ పల్లి (Kukatpally) బాలిక సహస్ర హత్య కేసు (Sahasra Case) దర్యాప్తులో షాకింగ్ నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో…

1 hour ago

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

2 hours ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

3 hours ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

4 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

5 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

6 hours ago

Rains | రానున్న మూడు రోజుల‌లో భారీ వ‌ర్షాలు.. ఆ జిల్లాల‌కి బిగ్ అలర్ట్‌

Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌…

7 hours ago