Guppedantha Manasu 17 Dec Today Episode : అందరి ముందే వసుధారను పెళ్లి చేసుకుంటానని చెప్పిన రిషి.. దేవయాని షాక్.. ఇంతలో ట్విస్ట్ ఏంటంటే?

Authored By Varun G | The Telugu News | Published on: December 17, 2022, 9:00 am

Guppedantha Manasu 17 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 17 డిసెంబర్ 2022, శనివారం ఎపిసోడ్ 636 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడికెందుకు వచ్చావు అని వసుధారను అడుగుతాడు రిషి. దీంతో కష్టం వస్తే ఈ అమ్మతోనే కదా చెప్పుకునేది. నేను అక్కడ ఉండటానికి అర్హత ఏముంది సార్. అందుకే నేను మా ఊరు వెళ్లిపోతున్నా అంటుంది వసుధార. దీంతో తన చేయి పట్టుకొని రా వసుధార అని చెప్పి తనను ఎక్కడికో తీసుకెళ్తాడు. మరోవైపు జగతి టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్క ఆలోచనలు నీకు తెలుసు కదా అంటుంది మహీంద్రాతో. రిషి, వసు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియడం లేదు. వాళ్లు మంచి నిర్ణయమే తీసుకున్నా కూడా అక్క ఏం చేస్తుందో అని భయంగా ఉంది అంటుంది జగతి.

guppedantha manasu 17 december 2022 full episode

దీంతో నువ్వేం టెన్షన్ పడకు. వాళ్ల జీవితానికి సంబంధించి వాళ్లు మంచి నిర్ణయమే తీసుకుంటారు అంటాడు మహీంద్రా. నాకు రిషి, వసు మధ్య ఏం టెన్షన్ లేదు కానీ.. ఈ విషయంలో దేవయాని అక్కయ్య ఏం చేస్తుందో అని అంటుంది జగతి. దీంతో రిషినే దేవయాని వదినకు మంచి సమాధానం చెప్పాలని ఆశిద్దాం. చెబుతాడు కూడా అంటాడు మహీంద్రా. ఇంతలో వసుధారను తీసుకొని ఇంటికి వస్తాడు రిషి. రా అని చెప్పి తనను ఇంట్లోకి రమ్మంటాడు. తనను చేతులతో పట్టుకొని లోపలికి తీసుకు వస్తూ.. గుమ్మం వద్ద ఆగుతాడు. పెద్దమ్మ అని పిలుస్తాడు. పెదనాన్న అని పిలుస్తాడు. డాడ్ అని పిలుస్తాడు. మేడమ్ అని పిలుస్తాడు. దీంతో అందరూ గుమ్మం దగ్గరికి వస్తారు. వదిన అని ధరణిని కూడా పిలుస్తాడు.

సర్.. ఏం చేస్తున్నారు. ఎందుకు అందరిని పిలుస్తున్నారు అని అడుగుతుంది వసుధార. దీంతో ప్రశ్నలు నువ్వు అడిగావు. సమాధానాలు నేను చెబుతాను అంటాడు రిషి. ఇంతలో అందరూ దిగి గుమ్మం దగ్గరికి వస్తారు.

ఇద్దరినీ చూసి ఆశ్చర్యపోతారు. రిషి ఏమైంది నాన్న అని అడుగుతుంది దేవయాని. దీంతో వసుధార చేయి పట్టుకొని ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నా అంటాడు రిషి. దీంతో మహీంద్రా, జగతి సంతోషిస్తారు. మీకు ఎవరికైనా అభ్యంతరమా అని అడుగుతాడు రిషి.

మళ్లీ అడుగుతున్నాను. వసుధారను పెళ్లి చేసుకోవడం మీకు ఎవరికైనా అభ్యంతరమా అని అడుగుతాడు. దీంతో మీకు ఎవరికైనా ప్రాబ్లమా అని అంటాడు. పెద్దమ్మ మీరు చెప్పండి.. అని రిషి దేవయానిని అడుగుతాడు.

Guppedantha Manasu 17 Dec Today Episode : రిషి అలా అనడంతో ఏం చేయాలో అర్థం కాని దేవయాని

దీంతో రిషి ఏంటి ఇలా అడుగుతున్నాడు. అందరి ముందు ఇష్టమా.. కాదా అంటే ఏం చెబుతాను అని అనుకుంటుంది. రిషి అది ఇది అంటూ ఏదో చెప్పబోతుంటే.. పెద్దమ్మ మా పెళ్లి మీకు ఇష్టమా… కాదా అది చెప్పండి ముందు అంటాడు రిషి.

దీంతో ఇష్టమే అంటుంది దేవయాని. దీంతో పెదనాన్న మీకు అని అడుగుతాడు. దీంతో నాకు ఓకే రిషి అంటాడు. మహీంద్రా, జగతిని అడగడంతో మాకు ఇష్టమే అంటారు. ధరణి కూడా నాకు ఓకే అంటుంది.

దీంతో వసుధార నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి అని అనుకుంటున్నా. ఏ అర్హతతో ఈ ఇంటికి రావాలని నువ్వు అడిగావు. ఏ హక్కుతో ఈ గడప దాటి ఈ ఇంట్లోకి రావాలని అన్నావు కదా.

ఇప్పుడు చెబుతున్నాను విను. ఈ రిషీంద్ర భూషణ్ కు కాబోయే భార్యగా ఈ ఇంట్లో అడుగుపెట్టు అని అంటాడు రిషి. రిషీంద్ర భూషణ్ తో జీవితాంతం నడవబోయే భార్యగా ఉండే హక్కుతో అడుగు వేయి అంటాడు రిషి.

తనను చేతులతో పట్టుకొని ఇద్దరూ కుడికాలు లోపల పెట్టి ఇంట్లో అడుగుపెడతారు. దీంతో దేవయానికి ఏం చేయాలో అర్థం కాదు. పెద్దమ్మ.. మా ఇద్దరికీ పెళ్లి చేయండి అని చెబుతాడు రిషి. పెద్దమ్మ వింటున్నారా అని అడుగుతాడు రిషి.

రిషి, వసుధారతో తన పెళ్లి జరిపించమని అడుగుతున్నాడు.. దేవయాని వింటున్నావా అంటాడు ఫణీంద్రా. దీంతో తప్పకుండా అంటుంది దేవయాని. మీ పెళ్లి జరిపించే బాధ్యత నాదే కదా అంటుంది. వాళ్ల ఊరెళ్లి పెద్దవాళ్లతో మాట్లాడి మీ పెళ్లి నేను చేపిస్తా అంటుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం.. పెళ్లి పనులు మొదలుపెడదాం అంటాడు ఫణీంద్రా. దీంతో మహీంద్రా కూడా అదే అంటాడు. రిషి అంటే ఏదో అడిగేశాడు. నీకేంటి తొందర. పెళ్లి చేయడం అంటే మాటలా చెప్పు అంటుంది దేవయాని.

ఎన్ని సిద్దం చేసుకోవాలి. టైమ్ పడుతుంది కదా అంటుంది దేవయాని. ఏమంటావు వసుధార అంటుంది దేవయాని. మంచి రోజు చూడాలి. పెద్ద వాళ్లతో మాట్లాడాలి. ముహూర్తాలు పెట్టించాలి. అబ్బో చాలా ఉంటాయి కదా అంటుంది.

దీంతో పెద్దమ్మ అవన్నీ మీరు చూసుకోండి. వసుధార ఇప్పుడు ఓకేనా నీకు అంటాడు రిషి. వదిన.. వసుధారను లోపలికి తీసుకెళ్లండి అంటాడు. పెద్దమ్మ తను అప్పటి దాకా ఇక్కడే ఉంటుంది. సరేనా అంటాడు రిషి.

దీంతో రిషి.. నీ ఇష్టాన్ని, నీ మాటను నేను ఎప్పుడు కాదన్నాను చెప్పు అంటుంది దేవయాని. అలాగే ఉండనివ్వు అంటుంది. వసుధార వెల్ కమ్.. నువ్వు ఈ ఇంట్లోకి రావడం చాలా సంతోషంగా ఉంది అంటుంది ధరణి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp