Guppedantha Manasu 19 Aug Today Episode : రిషి, వసుధర మళ్లీ దగ్గరయ్యారా? సాక్షి దూరం అవడంతో వసుకు దగ్గరయి తనను రిషి పెళ్లి చేసుకుంటాడా?
Guppedantha Manasu 19 Aug Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 19 ఆగస్టు 2022, శుక్రవారం ఎపిసోడ్ 533 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వెంటనే రిషికి జగతి కాఫీ చేసి ఇస్తుంది. చాలా సంతోషిస్తుంది. తీసుకో రిషి అంటుంది. ఇంతకుముందు నేను థాంక్స్ ఎందుకు చెప్పానంటే మీరు నాకు ఒక విధంగా చాలా హెల్ప్ చేశారు.. అంటాడు రిషి. ఆ తర్వాత కాఫీ తీసుకొని అక్కడి నుంచి వెళ్తాడు. దీంతో జగతి చాలా సంతోషిస్తుంది. మహీంద్రా వచ్చి.. జగతి అంటాడు. రిషి నన్ను అంటూ ఏదో చెప్పబోతుండగా నేను అంతా విన్నాను జగతి అంటాడు మహీంద్రా. కట్ చేస్తే రిషి రింగ్ ను చూస్తూ అలాగే ఉండిపోతుంది వసుధర. జరగాల్సిందేదో జరిగిపోయింది. నా ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. అది నా మంచికోసమే అనుకుంటుంది. ఇది నాకోసమే రిషి సార్ రింగ్ చేయించారా? అనుకోకుండా నా పేరు పెట్టారా? లేక కావాలనే పెట్టారా? ఏదేమైనా మంచికే జరిగింది అనుకోవాలి అని అనుకుంటుంది వసుధర. ఇది నేనెలా పెట్టుకుంటాను. రిషి సార్ పెడితే అది బంధం అవుతుంది అని అనుకుంటుంది వసుధర.
వీ ఒంటరిగా ఉండకూడదు. వీ ఫర్ వసుధర. వసుధర ఒంటరిగా ఎలా ఉంటుంది. పక్కన ఆర్ చేరితేనే బాగుంటుంది. బంధం ఉంటుంది. వీ ఫర్ వసుధర. ఆర్ ఫర్ రిషి సర్ అని అనుకొని నోట్ బుక్ తీసి బుక్ లో వీ ఫర్ వసుధర, ఆర్ ఫర్ రిషి సర్ అంటూ రామకోటి రాసినట్టు రాస్తూ ఉంటుంది. రింగ్ కు ఆర్ అనే అక్షరం చేరిస్తే బాగుంటుంది కదా. అమ్మో.. బంగారంతో చేయించాలంటే చాలా ఖర్చు అవుతుంది కదా. ఏం చేయాలి. కనీసం రెండు మూడు గ్రాములైనా పడుతుందేమో. ఏమో.. ఈ బంగారం గురించి నాకు తెలియదు. ఎలా గోలా ప్లాన్ చేయాలి అని అనుకుంటుంది వసుధర. తర్వాత వీఆర్ అని రాసి లవ్ సింబల్ రాస్తుంది.
నిన్ను రిషి సర్ అని పిలువొద్దు అన్నాడంటే దాని అర్థం ఏంటి జగతి అని మహీంద్రా అంటాడు. రిషి మనసులో ఏముండి ఉంటుంది అంటాడు మహీంద్రా. తనను ప్రతిసారి సార్ అని పిలుస్తుంటే తనకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పాడు. అంతకుమించి ఇంకేం లేదు అంటుంది జగతి.
Guppedantha Manasu 19 Aug Today Episode : రిషి కారులో కాలేజీకి వెళ్లిన జగతి, మహీంద్రా
మరోవైపు కారు టైర్ పంచర్ అవుతుంది. దీంతో ఏం చేయాలో అర్థం కాదు మహీంద్రా, జగతికి. టైర్ పంచర్ అయితే నేనేం చేస్తాను అంటాడు మహీంద్రా. ఇంతలో రిషీ కాలేజీకి బయలుదేరుతాడు. గుడ్ మార్నింగ్ డాడ్ అంటాడు. దీంతో మహీంద్రా వెళ్లి రిషిని కౌగిలించుకుంటాడు.
మహీంద్రా వెళ్దామా అని అంటుంది. దీంతో రిషి మా కారు టైర్ పంచర్ అయింది. క్యాబ్ లో వెళ్తాం. నువ్వు వెళ్లు అంటాడు. దీంతో కారు టైర్ పంచర్ అయితే క్యాబ్ లోనే వెళ్లాలా? లిఫ్ట్ తీసుకోవచ్చు కదా అంటాడు రిషి. దీంతో ఇదొకటి ఉంది కదా అంటాడు మహీంద్రా.
నేను కాలేజీకే వెళ్తున్నాను. రండి నేను డ్రాప్ చేస్తాను. నేను వెనక కూర్చొంటాను. మీరు డ్రైవ్ చేయండి అంటాడు రిషి. దీంతో జగతి డ్రైవ్ చేస్తుంది. ముందు సీటులో మహీంద్రా కూర్చొంటాడు. మరోవైపు కాలేజీకి వెళ్లేందుకు ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటుంది వసుధర.
ఒక్క ఆటో కూడా రావడం లేదేంటి.. లేట్ అవుతోంది. అలాగే డబ్బులు కూడా లేవు అని చెప్పి నడుచుకుంటూ కాలేజీకి వెళ్తుంటుంది వసుధర. ఇంతలో కారును మధ్యలో ఆపుతుంది జగతి. వసు వస్తుంది చూడు అని అంటుంది జగతి. కారు ఆగడాన్ని చూసి పరిగెత్తుకుంటూ కారు దగ్గరికి వస్తుంది వసుధర.
దీంతో కారు నేను నడుపుతాను అంటాడు మహీంద్రా. మేడమ్ మీరా.. సార్ కారు మీరు.. సార్ ఏరి అని అడుగుతుంది వసు. దీంతో వెనుక ఉన్నాడు అంటుంది. వసుధర రా కూర్చో అంటాడు మహీంద్రా. దీంతో రిషి పక్కన కూర్చొంటుంది వసుధర. ఆ తర్వాత కారును ఇష్టం ఉన్నట్టు డ్రైవ్ చేస్తాడు మహీంద్రా.
మలుపుల వద్ద స్పీడ్ గా స్టీరింగ్ తిప్పుతాడు. దీంతో ఇద్దరూ ఒకరి మీద మరొకరు పడతారు. ఆ తర్వాత అందరూ కాలేజీకి వెళ్తారు. కాలేజీలో కూడా వసుధర ఆ రింగ్ గురించే ఆలోచిస్తూ ఉంటుంది. డబ్బులు చాలా అయ్యేలా ఉన్నాయి. నేను ఏం చేయాలి అని అనుకుంటుంది.
ఇంతలో పుష్ప.. ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతుంది. బంగారం రేటు ఎంత ఉంది అని అనుకుంటుంది వసుధర. ఇంతలో రిషి క్లాస్ చెప్పడానికి వస్తాడు. రిషి క్లాస్ చెబుతున్నా.. వసుధర మాత్రం ఇంకా ఆ బంగారం గురించే ఆలోచిస్తూ ఉంటుంది. తను ఏం చేస్తోంది అని అనుకుంటాడు రిషి.
ఏం చేస్తున్నావు అని అడుగుతాడు రిషి. ఏం లేదు సార్ అంటుంది. ఫైనల్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్స్ హార్డ్ గా ఉండాలి.. అని చెబుతాడు రిషి. వసుధర ఈ ప్రాబ్లమ్ ను సాల్వ్ చేయి అంటాడు రిషి. వచ్చా అంటే వచ్చు అంటుంది వసుధర. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.