Guppedantha Manasu 19 Nov Today Episode : వసుధారను దేవయాని చంపిస్తుందా? రాజీవ్ కు ఫోన్ చేసి ఏం చెబుతుంది.. రిషితో పెళ్లి ఆపేందుకు వసుధారను చింపేయాలా?

Guppedantha Manasu 19 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది.  ఈరోజు 19 నవంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 637 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఏంటి జగతి.. నువ్వు ఆనందంతో తాండవం చేస్తావని, ఉత్సాహంతో ఉప్పొంగిపోతావని, కిచెన్ లోకి వెళ్లి 100 రకాల స్వీట్లు చేస్తావని చాలా ఊహించా. కానీ.. నువ్వు గదిలో ఉన్నావేంటి. అర్థం కాలేదా జగతి. కొడుకు పెళ్లి అనగానే గుండెల్లో కోటి వీణలు మోగాయా? మొగుడు పెళ్లాలు ఇద్దరూ మురిసిపోయారా? బట్టలు సర్దుకుంటున్నావా? ఎలా వెళ్లాలి. ఏం చేయాలి. పెళ్లి షాపింగ్ ఏంటి.. అరిటాకులు, కొబ్బరాకులు.. ఇలా చాలా ఊహించుకొని ఉంటారే అంటుంది దేవయాని. కొడుకు పెళ్లి అనగానే సంబురపడిపోయి ఉంటారు. మీ ఆనందానికి ఆకాశమే హద్దు అయి ఉంటుంది కదా. కానీ జగతి.. నువ్వు మహీంద్రా ఒక విషయం తెలుసుకోవాలి అంటుంది దేవయాని.

guppedantha manasu 19 december 2022 full episode

రిషి నీ కొడుకే కానీ.. రిషికి నా మాటంటే వేదం అంటుంది దేవయాని. రిషికి నేనంటే గౌరవం. నా మాట జవదాటలేడు. జవదాటడు. జవదాటనివ్వను అంటుంది. ఆ గౌరవమే నాకు గొప్ప ఆయుధం జగతి అంటుంది. మీకు ఈ విషయం తెలియట్లేదు అంటుంది. దీంతో అక్కయ్య అన్ని సార్లు ఆయుధాలతో గెలవలేరు. ఆయుధాలు ఎంత బలంగా ఉన్నా మానసికంగా దృఢంగా ఉండటం ముఖ్యం. వంద ఆయుధాలు ఉన్నా గెలుస్తామన్న గ్యారెంటీ ఉండదు కదా.. అంటుంది జగతి. దీంతో పర్లేదు జగతి. నువ్వు ఇంకా ఆత్మవిశ్వాసంతోనే ఉన్నావన్నమాట. కానీ.. ఇక్కడ ఉన్నది దేవయాని.నన్ను దాటి నా అనుమతి లేకుండా నా ఇష్టానికి వ్యతిరేకంగా రిషి, వసుధారల పెళ్లి అవుతుందని నువ్వు ఎలా అనుకున్నావు జగతి అంటుంది దేవయాని.

ఏంటి జగతి.. నేను ఇలా ఆలోచిస్తానని నువ్వు అనుకోలేదు కదా. నేను ఇలాగే ఆలోచిస్తాను జగతి. రిషి, వసుధారల పెళ్లి జరగదు అంటుంది దేవయాని. జరగదు కాక జరగదు అంటుంది. ఈ దేవయాని జరగనివ్వదు అంటుంది దేవయాని. రిషి.. పేరుకు మాత్రమే నీ కొడుకు. మిగితా పెత్తనాలన్నీ నావి అంటుంది. ఎందుకంటే రిషికి నా మీద నమ్మకం, గౌరవం ఎక్కువ అంటుంది.

నిన్ను అమ్మా అని పిలవడు. గౌరవించడు. వెరీ సారీ జగతి. ఈ పెళ్లి జరగట్లేదు.. అంటుంది. దీంతో అక్కయ్య ఒక్క మాట. మీరు ఇప్పటి దాకా చాలా మాట్లాడారు. నాకు మీ మీద ఇంకా కొంచెం గౌరవం మిగిలి ఉంది. ఎందుకంటే.. మీరు నాకన్నా పెద్దవారు అంటుంది.

మీకు ఈ పెళ్లి ఇష్టం ఉంటుందని నేను ఎలా అనుకుంటాను అక్కయ్య. మీకు ఈ పెళ్లి ఇష్టం అంటేనే ఆశ్చర్యపడాలి. ఇష్టం లేదంటే ఆశ్చర్యం పడాల్సిన అవసరం ఏముంది. ఈపెళ్లి జరగడం నీకు ఇష్టం లేదని నాకు ఎందుకు చెప్పడం, రిషికి చెప్పొచ్చు కదా అంటుంది.

Guppedantha Manasu 19 Nov Today Episode : దేవయాని మళ్లీ ఏదో కుట్ర చేస్తోందని మహీంద్రాకు చెప్పిన జగతి

దీంతో రివర్స్ లో గేమ్స్ ఆడుతున్నావా అంటుంది దేవయాని. ఈ పెళ్లి మీకు ఇష్టం లేకపోవడం మీ వ్యక్తిగతమైన విషయం. ఇదే విషయాన్ని రిషికి వెళ్లి చెప్పండి అంటుంది జగతి. దీంతో నీకు ఏ మూలనో ఈ పెళ్లి జరుగుతుందని ఇంకా ఆశ ఉన్నట్టుంది. ఆ ఆశలన్నీ వదులుకో. ఇక్కడ ఉంది దేవయాని అని చెప్పి వెళ్లబోతుండగా ఇంతలో మహీంద్రా వస్తాడు.

ఏంటి వదిన గారు అంటే..ఏం లేదు మహీంద్రా. నా మనసులో ఉన్న విషయాలు జగతికి చెప్పాలనిపించింది చెప్పాను. అంతే.. నువ్వు వెళ్లు. నీకు జగతి చెబుతుందిలే అంటుంది దేవయాని. ఏమైంది జగతి అని అడుగుతాడు మహీంద్రా. దీంతో రిషి, వసుధారల పెళ్లి జరగదని చెప్పింది అంటుంది జగతి.

ఏదో కొత్త కుట్రతో అక్కయ్య గారు రెడీగా ఉన్నారు. తన కుట్రలను ఎలాగైనా ఛేదించాలి అని అంటుంది. మరోవైపు రిషి.. వసుధారకు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. మిమ్మల్ని చూడగానే నా బాల్యం అన్నీ గుర్తొస్తాయి అని అంటుంది వసుధార.

నువ్వు పరిచయం అయ్యాక నాకు చాలా కొత్త విషయాలు తెలిశాయి అంటాడు రిషి. దీంతో ఓకే సార్. గుడ్ నైట్ అంటుంది. దీంతో అప్పుడేనా అంటాడు రిషి. మెసేజ్ చేస్తావా అని అడుగుతాడు. దీంతో ఏం మాట్లాడదు వసుధార. దీంతో అలా ఏం లేదు సార్ అంటుంది వసుధార.

మరోవైపు రాత్రి అయ్యాక.. ఫోన్ లో ఎవరికో మెసేజ్ పెడుతూ ఉంటుంది దేవయాని. ఫణీంద్రా చూస్తాడు. దేవయాని అని పిలుస్తాడు. ఇంకా పడుకోలేదా అని అడుగుతాడు. దీంతో లేదండి అంటుంది దేవయాని. ఈ చీకట్లో ఫోన్ ఏంటి అని అడుగుతాడు.

అయినా.. ఫోన్ ఇప్పుడు అంత అర్జెంట్ ఏంటి దేవయాని. ఈ టైమ్ లో ఫోన్ చేసి ఎవరిని డిస్టర్బ్ చేస్తున్నావు అని అడుగుతాడు. దీంతో నేను ఎవరినీ డిస్టర్బ్ చేయను. అందరూ నన్నే డిస్టర్బ్ చేస్తారు. మన అబ్బాయి మెసేజ్ పెట్టాడు. వాడికి రిప్లయి ఇచ్చాను అంటుంది దేవయాని.

కట్ చేస్తే దేవయాని.. రాజీవ్ కు ఫోన్ చేస్తుంది. నువ్వేనా అంటుంది. నమస్తే మేడమ్ జీ. ఇన్నేళ్లకు ఫోన్ చేశారు అని అడుగుతాడు. నా నెంబర్ మీ ఫోన్ లో భద్రంగా పెట్టుకున్నందుకు థాంక్స్ మేడమ్ జీ. చెప్పండి మేడమ్ జీ. ఎప్పటిలా ఆ పాత పనేనా అని అడుగుతాడు.

దీంతో ఎప్పటిలా ఆ పాత పనే కానీ.. కొత్తగా చేయాలి అని చెబుతుంది. దీంతో పాత్రలు, పాత్రాదారులు వాళ్లేనా అని అడుగుతాడు. పాపం పెరిగినట్టుగా ధరలు కూడా పెరుగుతున్నాయి కదా అంటాడు. దీంతో డబ్బు గురించి ఆలోచించకు అంటుంది దేవయాని.

రాజీవ్ తో ఫోన్ లో దేవయాని మాట్లాడటం చూస్తాడు మహీంద్రా. వదిన గారు ఈ టైమ్ లో ఎవరితో మాట్లాడుతున్నారు. మళ్లీ ఏం ఆలోచిస్తున్నారు అని అనుకొని తన దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Banakacherla Project : బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం..!

Banakacherla Project  : బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వివాదంపై పరిష్కారానికై కేంద్ర ప్రభుత్వం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని…

47 minutes ago

YCP : ఏపీలో వైసీపీ ని తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ భారీ వ్యూహాలు..!

YCP : ఆంధ్రప్రదేశ్‌లో తమ బలాన్ని తిరిగి సాధించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల పాతిక మందితో…

2 hours ago

Samantha – Naga Chaitanya : సమంత–నాగ చైతన్య విడాకులపై సంచలన వ్యాఖ్యలు … సోషల్ మీడియాలో దుమారం..!

Samantha - Naga Chaitanya : టాలీవుడ్‌ స్టార్‌ జంటగా పేరు తెచ్చుకున్న నాగ చైతన్య – సమంత ప్రేమించి…

4 hours ago

Little Hearts Movie : లిటిల్ హార్ట్స్ మూవీ చూస్తూ కుర్చీల్లోంచి కిందపడేంతలా నవ్వుకుంటారు : బన్నీ వాస్

Little Hearts Movie : "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో…

4 hours ago

Rajagopal Reddy : రాజగోపాల్ కు నోటీసులు ఇచ్చేందుకు రేవంత్ సిద్ధం అయ్యాడా..?

Rajagopal Reddy : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బహిరంగంగా…

5 hours ago

Allu Arha : నువ్వు తెలుగేనా.. మంచు ల‌క్ష్మీతో అల్లు అర్జున్ కూతురు ఫ‌న్.. వైర‌ల్ వీడియో..!

Allu Arha : ఐకాన్ స్టార్ Allu Arjun అల్లు అర్జున్ ముద్దుల కూతురు అల్లు అర్హ తెగ సంద‌డి…

6 hours ago

Modi : ట్రంప్ సుంకాలకు భారత్ భయపడేది లేదు – మోడీ

Modi  : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ donald trump విధించిన టారిఫ్‌లపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా…

7 hours ago

Trump : మిత్రుడు అంటూనే ఇండియా పై ట్రంప్ సుంకాలపై బాగా..!

Trump  : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఈ…

8 hours ago