Intinti Gruhalakshmi 19 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 19 నవంబర్ 2022, సోమవారం ఎపిసోడ్ 819 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మా ఫ్రెండ్స్ ముందు నేను ఏం మాట్లాడలేకపోయా. సారీ అని సామ్రాట్ తో అంటుంది తులసి. దీంతో పర్లేదండి. మీరు ఏం టెన్షన్ తీసుకోకండి అంటాడు సామ్రాట్. ఆ తర్వాత డికాషన్ తీసుకొచ్చి పరందామయ్య, అనసూయకు ఇస్తుంది. దీంతో డికాషన్ లో పాలు పోయడం మరిచిపోయావా అని అడుగుతుంది అనసూయ శృతితో. దీంతో కావాలనే డికాషన్ తీసుకొచ్చా. అలా తాగితేనే ఆరోగ్యానికి మంచిదట అంటుంది శృతి. దీంతో వామ్మో.. ఆ డికాషన్ తాగలేం మేము అంటాడు పరందామయ్య. దీంతో అనసూయ వెళ్లి పాలు పోసి తీసుకొస్తా అని చెబుతుంది అనసూయ.
దీంతో వద్దు అమ్మమ్మ వెళ్లకండి.. పాలు ఫ్రిడ్జ్ లో ఉన్నాయి అని చెబుతుంది. అయితే అంటే.. ఫ్రిడ్జ్ కు తాళం వేసి ఉంది. ఆ తాళం లాస్య దగ్గర ఉంది. నేను వెళ్లి అడిగితే ఇవ్వలేదు అని అంటుంది శృతి. దీంతో అనసూయకు కోపం వస్తుంది. ఈ విషయం వెంటనే నందుకు చెబుతా అంటుంది అనసూయ. దీంతో వద్దు అనసూయ. పరిస్థితులన్నీ చక్కదిద్దడానికి నాకు కాస్త సమయం కావాలని వాడు అన్నాడు కదా. అందుకే మనం కొన్ని రోజులు వెయిట్ చేద్దాం అంటాడు. దీంతో తులసి దగ్గరికి వెళ్లిపోదాం అంటుంది అనసూయ. దీంతో వద్దు అనసూయ అంటాడు పరందామయ్య. చివరకు అదే డికాషన్ ను తాగేస్తారు. కట్ చేస్తే తులసి ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. కారు దిగాలని లేదు సామ్రాట్ గారు అంటుంది తులసి. దిగితే నా మనసులో నింపుకొచ్చిన అందమైన మెమోరీస్ చెల్లాచెదురు అవుతాయేమో అని భయంగా ఉంది. వాటిని దూరం చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను అంటుంది తులసి.
దీంతో ఆ ఇల్లే మీకు సొంతం చేయాలని అనుకుంటున్నా తులసి గారు అని మనసులో అనుకుంటాడు సామ్రాట్. మీకు చేసిన ఈ మేలును నేను మరిచిపోలేను సామ్రాట్ గారు అని అంటుంది. దీంతో అది నా మేలు కాదు.. మీరు ముడుపు కట్టారు కదా.. అందుకే అమ్మవారు తీర్చారు అని అంటాడు.
దీంతో అవును.. అమ్మవారికి ముడుపు కట్టానో లేదో నా కోరిక నెరవేరింది. ఇక నుంచి నాకు ఏ కోరిక ఉన్నా వెంటనే అమ్మవారికి ముడుపు కడతా అంటుంది. దీంతో సరే మీ ఇష్టం అంటాడు. ఇక నేను వెళ్లొస్తాను అంటుంది తులసి. దీంతో గుడ్ నైట్ అంటాడు సామ్రాట్.
మీరు ఇంటికి వెళ్లాక 5 నిమిషాల్లో మీకు ఒక సర్ ప్రైజ్ ఉంది అంటాడు సామ్రాట్. దీంతో ఏంటది అని అడుగుతుంది తులసి. ఆశ దోష అప్పడం.. అది ఇప్పుడు ఎలా చెబుతాను. అది సర్ ప్రైజ్ అంటాడు సామ్రాట్. దీంతో సరే అని చెప్పి ఇంట్లోకి వెళ్తుంది తులసి.
ఇంటికి వెళ్లి తన ఊరిలో తిరిగిన అన్ని విషయాలను గుర్తుకు తెచ్చుకుంటుంది. ఇంతలో పరందామయ్యకు ఫోన్ చేస్తుంది తులసి. హలో అత్తయ్య నేను తులసిని. ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. దీంతో నేను, మీ మామయ్య కలిసి సంతాప సభ పెట్టుకున్నాం అంటుంది.
దీంతో తులసికి అంతా చెప్పేస్తుందేమో అని వెంటనే ఫోన్ లాక్కొని పరందామయ్య ఏం లేదమ్మా.. ఇద్దరం ఊరికే ఇక్కడ కూర్చొన్నాం అంటాడు. ఈరోజు నేను మా పుట్టిన ఊరికి వెళ్లాను. సామ్రాట్ గారు తీసుకెళ్లారు అంటుంది. దీంతో ఇంకేంటి అమ్మా.. ఎంజాయ్ చేసి ఉంటావు అంటే అవును అంటుంది తులసి.
ఇలా ఫోన్ లో కాదు.. నా అనుభవాలు అక్కడికి వచ్చి డైరెక్ట్ గా చెబుతాను అంటుంది తులసి. మీరు కులాషాగా ఉన్నారు కదా. ప్రతి మూడు నాలుగు గంటలకు ఒకసారి మీకు ఏదైనా తినడానికి ఇవ్వమని అంకితకో, శృతికో చెబుతాను. లేదంటే అత్తయ్య గారికి చెబుతాను అంటే.. ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదమ్మా.. మా గురించి నువ్వు మరిచిపో. ఇక్కడ అన్నీ మంచిగానే ఉన్నాయి అంటాడు.
సరే.. మామయ్య తీరికగా వచ్చి కలుస్తాను. అత్తయ్య గారికి కూడా చెప్పండి అంటుంది తులసి. ఆ తర్వాత ఎంతకాలం అండి ఇలా బతకడం అంటుంది అనసూయ. మన విలువ మనమే కాపాడుకోవాలి అంటాడు పరందామయ్య. మనం ఎవ్వరికీ ఉపయోగపడకపోవచ్చు కానీ.. సమస్యగా మాత్రం మారకూడదు అని అంటాడు పరందామయ్య.
కట్ చేస్తే అలసిపోయి అలాగే కుర్చీలోనే నిద్రపోతుంది తులసి. ఇంతలో వాళ్ల అమ్మ అక్కడికి వస్తుంది. నా బంగారు తల్లి అలిసిపోయింది. నీ సేద తీర్చడానికే వచ్చానమ్మా అనుకొని తన తల మీద చేయి పెడుతుంది. దీంతో వెంటనే మేల్కుంటుంది తులసి.
అమ్మా ఈ టైమ్ లో నువ్వు ఇక్కడ అని అంటుంది. దీంతో నువ్వే కదా.. అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశావు. అందుకే వచ్చాను అంటుంది. దీంతో నేను రమ్మని కాల్ చేశానా అంటుంది. ఈ టైమ్ లో నువ్వు నా పక్కన ఉంటే బాగుంటుంది అని ఆశ పడటం నిజం కానీ.. ఈ టైమ్ లో నేను ఫోన్ చేయలేదు అని అంటుంది.
దీంతో సరే అయితే పడుకో.. నేను వెళ్తా అంటుంది సరస్వతి. దీంతో అమ్మా ఆగు. నేను ఫోన్ చేసే ఉంటాను. నిద్రమత్తులో మరిచిపోయి ఉంటాను. ఎందుకు వచ్చావు అని నేను నిన్ను నిలదీయడం లేదు. బాధపెట్టినందుకు సారీ అంటుంది తులసి. నీ ఫ్రెండ్ సామ్రాట్ కు థాంక్స్ చెప్పు. నన్ను ఇక్కడికి వెళ్లమని ఫోన్ చేసి చెప్పింది తనే అంటుంది సరస్వతి.
దీంతో తనా అంటుంది తులసి. సామ్రాట్ సర్ ప్రైజ్ అని చెప్పాడు కదా.. దాన్ని గుర్తు చేసుకుంటుంది తులసి. వెంటనే తులసి.. సామ్రాట్ కు ఫోన్ చేస్తుంది. థాంక్స్ చెబుతుంది. కట్ చేస్తే తెల్లారి అనసూయ ఇంటికి వస్తుంది తులసి. అక్కడ వాళ్లు టాబ్లెట్లు అయిపోయాయని.. మాట్లాడుకోవడం చూస్తుంది తులసి. మరి నందుకు చెప్పు తెప్పిస్తాడు అంటాడు పరందామయ్య. దీంతో వాడికి ఉద్యోగమే లేదు. ఎలా తెచ్చి ఇస్తాడు అంటుంది. అది విని నందు కూడా బాధపడతాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Winter Season : చలికాలం వచ్చేసింది. అయితే ఈ కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో నిద్రమత్తు కూడా ఒకటి. ఈ…
Hair Care : ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్న సమస్యలలో తెల్ల జుట్టు కూడా ఒకటి. అయితే జుట్టు తెల్లబడడం అనేది…
Good News for Farmers : దేశానికి వెన్నెముక గా నిలుస్తున్న వ్యవసాయ రంగానికి అండగా ఉంటుంది. రైతులు వారి…
Skin Care : ప్రస్తుత కాలంలో మార్కెట్లో చర్మ సంరక్షణ కోసం ఎన్నో రకాల ఉత్పత్తులు అందుబాటులో ఉంటున్నాయి. అదే టైంలో…
Aadhar Update : ఆధార్ కార్ ను అప్డేట్ చేయడానికి కొన్ని నియమ నిబంధనలు ఇంకా షరతులు ఉంటాయి. ఐతే…
Cooling Water : ప్రస్తుతం కూలింగ్ వాటర్ తాగే అలవాటు చాలామందికి ఉంది. వీళ్లు వర్షాకాలం మరియు చలికాలం లో…
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
This website uses cookies.