Guppedantha Manasu 19 Jan Today Episode : వసుధారకు యాక్సిడెంట్.. క్షణాల్లో తప్పిన ముప్పు.. తనను కాపాడిన రిషి.. కానీ.. తనను ధ్వేషించిన రిషి.. ఎందుకంటే?
Guppedantha Manasu 19 Jan Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 19 జనవరి 2023, గురువారం ఎపిసోడ్ 664 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషిని చూడటానికి వసుధార రిషి ఇంటికి వస్తుంది. దీంతో మళ్లీ ఎందుకు వచ్చావు అని దేవయాని అంటుంది. దీంతో అక్కయ్య నేను మాట్లాడుతాను ఆగండి అంటుంది. ఏంటి వసుధార గారు.. రిషి సార్ తో తమరికి ఏం పని అని అడుగుతుంది. దీంతో మేడమ్ నేను రిషి సార్ తో మాట్లాడాలి అంటే.. వెళ్లిపో వసుధార వెళ్లిపో అంటుంది. దీంతో రిషి సార్ ఎక్కడికి వెళ్లారు అంటుంది. నీ వల్లనే ఎక్కడికో వెళ్లిపోయాడు అంటుంది దేవయాని. నీకు దండం పెడుతున్నాను ఇక్కడి నుంచి వెళ్లిపోండి. మా వారికి హెల్త్ బాగోలేదు. తనను ఇబ్బంది పెట్టొద్దు అంటుంది జగతి. మహీంద్రా కూడా సీరియస్ అవుతాడు. ఇంతలో ఫణీంద్రా వస్తాడు. ఏంటమ్మా జగతి నువ్వు. ఎందుకు అమ్మా ఇలా అందరినీ బాధపెడుతున్నావు. చేసిందేదో చేశావు. మళ్లీ ఇంటికి రాకమ్మా.. ప్లీజ్ అంటాడు.
దీంతో సార్.. రిషి సార్ ఎక్కడున్నాడో చెప్పండి అంటుంది. దీంతో రిషి ఎక్కడున్నాడో తెలియదు. తెలిసినా చెప్పం అంటుంది జగతి. ఏం చెప్పినా వినదు వసుధార. దీంతో తనను తీసుకొని బయటికి పంపిస్తుంది జగతి. మేడమ్ ప్లీజ్ మేడమ్ అంటుంది వసుధార. కానీ.. జగతి వినదు. తనను బయటికి పంపి డోర్ పెట్టేస్తుంది. దీంతో వసుధారకు ఏం చేయాలో అర్థం కాదు. రిషి సార్ అంటూ బాధపడుతుంది. అసలు.. వసుధారను దులిపేయాల్సింది జగతి. జీవితంలో ఇంట్లో అడుగు పెట్టకుండా చేయాల్సింది అంటుంది దేవయాని. దీంతో అయిపోయిందేదో అయిపోయింది కదా వదిలేయ్ అంటాడు ఫణీంద్రా. ఏం చేయాలో తెలియక.. అమ్మ వారి దగ్గరికి వెళ్తుంది వసుధార. నీ దగ్గరికి రప్పించుకోవడానికి కష్టాలు పెట్టిస్తున్నావా అమ్మా అని వేడుకుంటుంది వసుధార.
ఇది నీ సంకల్పమా అమ్మ. ఇది మా బంధమా.. అగాథమా? బంధం అయితే దగ్గరికి చేయాలి కదా అమ్మ అంటుంది. ఇది నా చేతులతో నేను మెడలో వేశాను. దీన్ని రిషి సారే నా మెడలో కట్టారని నా మనసు నమ్ముతోంది. ఎందుకంటే నేను వేరు.. రిషి సార్ వేరు కాదు. రిషి సార్ నన్ను క్షమిస్తారా? తనను ఎన్ని మాటలు అన్నాను. అవన్నీ పరిస్థితిని అధిగమించడానికే కదా. నిజమేంటో నీకు తెలుసు కదా అమ్మ అని అనుకుంటుంది.
రిషి సార్ ను నాకు చూపించమ్మా అని వేడుకుంటుంది వసుధార. ఏం చేశావు నువ్వు.. రిషి గుండెల మీద నడుస్తూ దూరంగా వెళ్లిపోయావా అని కారు డ్రైవ్ చేస్తూ అనుకుంటాడు రిషి. ఎన్నో మాటలు చెప్పావు. ఎన్నో అందమైన కలలు కన్నాం.. అవన్నీ అబద్ధమేనా అని అనుకుంటాడు.
రిషి సార్ నాకు ఎప్పటికీ కనిపించరా? నా మీద కోపం పోతుందా? నేను పరిస్థితి వినిపించాలి. రిషి సార్ ఇదే జరిగింది అని చెప్పాలి.. అని అనుకుంటుంది. ఇంతలో రిషి సార్ కారు అదే గుడికి వస్తుంది. అక్కడే ఉన్న వసుధారను చూసి షాక్ అవుతాడు రిషి.
Guppedantha Manasu 19 Jan Today Episode : అమ్మ వారి దగ్గరికి వసుధార ఎందుకు వచ్చిందని అనుకున్న రిషి
వసుధార ఇక్కడ ఉందేంటి అని అనుకుంటాడు. అయినా నేను ఏంటి ఇక్కడికి వచ్చాను అని అనుకుంటాడు. ఇంతలో రిషిని చూస్తుంది వసుధార. చాలా సంతోషిస్తుంది. అమ్మా.. రిషి సార్ ను నువ్వే రప్పించావా? అని అనుకుంటుంది. ఇంతలో వసుధార.
కానీ.. తన మెడలో ఉన్న తాళిని చూసి కోపం వచ్చి వెళ్లబోతాడు కానీ.. మళ్లీ కారు ఆపుతాడు. వెళ్లి దేవతను దర్శించుకుంటాడు. అమ్మ.. వసుధార రూపంలో వరాన్ని ఇచ్చావు. అంతలోనే ఎందుకమ్మా దూరం చేశావు అని మొక్కుకుంటాడు.
ఆ తర్వాత వెళ్లబోతుండగా సార్ మాట్లాడాలి సార్ అంటుంది. ఏం మాట్లాడుతావు అని అడుగుతాడు. రెండు నిమిషాలు సార్.. ప్లీజ్ అంటుంది. కానీ.. రిషి వినడు. చెప్పేది అర్థం చేసుకోండి సార్.. నా పెళ్లి అసలు ఎందుకు అంటూ చెప్పబోతుండగా ఆపుతావా అంటాడు.
నీ పెళ్లి గురించి నాకేం చెప్పొద్దు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలియదు. నేను ఎందుకు వచ్చానో తెలియదు. జరిగింది మాత్రం తెలుస్తోంది కదా. ఇక చెప్పడానికి వినడానికి ఏం లేదు అని చెప్పి కోపంతో అక్కడి నుంచి వెళ్లబోతుంటాడు రిషి. ఇంతలో పూలు అమ్మే ఆమె వస్తుంది.
బాగున్నారా సార్.. నా దగ్గర పూలు తీసుకోకుండా వెళ్తారా? తీసుకోండి బాబు అంటుంది. దీంతో డబ్బులు ఇచ్చి ఆ పూలను దేవత దగ్గర పెట్టండి అంటాడు. దీంతో మా సార్ మనసు బంగారం అని చెప్పి దేవత దగ్గరికి వెళ్లి పూలు అక్కడ పెడుతుంది. ఆ పూలను తీసుకుంటుంది వసుధార.
ఆ తర్వాత కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. బయటికి వచ్చాక కారు ఆపుతాడు. రిషి సార్ ఇచ్చిన కానుక ఇది అని అనుకుంటుంది. నడుచుకుంటూ బయటికి వస్తుంటుంది వసుధార. ఇంతలో ఓ బస్సు వేగంగా వస్తుంటుంది. ఆ బస్సు బ్రేకులు పడవు.
రోడ్డు మీద నిలబడి పూలను చూసుకుంటూ ఉంటుంది వసుధార. వేగంగా బస్సు రావడం చూస్తాడు. వెంటనే కారు దిగి.. వెళ్లి తనను పట్టుకొని లాగుతాడు. చూసుకోవాలి కదా అంటాడు. దీంతో మీరు చూశారు కదా సార్ అంటుంది వసుధార. దీంతో ఏం మాట్లాడాలో అర్థం కాదు రిషికి.
ఇంతలో ఒక క్యాబ్ వస్తుంది. నీకోసం క్యాబ్ బుక్ చేశాను. ఎక్కడికి వెళ్లాలో వెళ్లు అంటాడు. ఆ తర్వాత తన కారులో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. దీంతో అదే క్యాబ్ లో అక్కడి నుంచి వెళ్లిపోతుంది వసుధార. మరోవైపు చక్రపాణి.. సుమిత్రను చాలా బాగా చూసుకుంటాడు.
తన కోసం అన్ని పనులు చేస్తుంటాడు. దీంతో సుమిత్ర చాలా సంతోషిస్తుంది. ఇంటి పనులు, వంట పనులు అన్నీ చక్రపాణే చేయడంతో సుమిత్ర ఆశ్చర్యపోతుంది. మరోవైపు పుష్ప.. వసుధారను తన ఇంట్లోకి తీసుకొస్తుంది. నువ్వు ఈ రూమ్ లో ఉండు అని చెబుతుంది.
ఇంతలో సుమిత్ర.. వసుధారకు ఫోన్ చేస్తుంది. హలో అమ్మ ఎలా ఉన్నావు అని అడుగుతుంది. దీంతో బాగున్నానమ్మా.. మీ నాన్న గారు నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు అని చెబుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.