Guppedantha Manasu 20 Dec Today Episode : వసుధార పెళ్లి చెడగొట్టి తనను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన వసు బావ రాజీవ్.. ఈ విషయం రిషికి తెలుస్తుందా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Guppedantha Manasu 20 Dec Today Episode : వసుధార పెళ్లి చెడగొట్టి తనను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైన వసు బావ రాజీవ్.. ఈ విషయం రిషికి తెలుస్తుందా?

Guppedantha Manasu 20 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 20 డిసెంబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 638 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దేవయాని.. రాజీవ్ కు ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఆ పెద్దమనిషి ఎలాంటోడు అంటే నా మామ భక్తుడు అని అంటాడు. దీంతో నేను చేసేది నేను చేస్తాను.. నువ్వు చేసేది నువ్వు చేయి అని రాజీవ్ తో అంటుంది. దీంతో నా […]

 Authored By gatla | The Telugu News | Updated on :20 December 2022,9:00 am

Guppedantha Manasu 20 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 20 డిసెంబర్ 2022, మంగళవారం ఎపిసోడ్ 638 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. దేవయాని.. రాజీవ్ కు ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఆ పెద్దమనిషి ఎలాంటోడు అంటే నా మామ భక్తుడు అని అంటాడు. దీంతో నేను చేసేది నేను చేస్తాను.. నువ్వు చేసేది నువ్వు చేయి అని రాజీవ్ తో అంటుంది. దీంతో నా వసును దక్కించుకోవడానికి నేను ఏ పని చేయడానికి అయినా వెనకాడను అని మనసులో అనుకుంటాడు రాజీవ్. ఇంతలో మహీంద్రా వచ్చి వదిన గారు అంటాడు. దీంతో అతడిని చూసి షాక్ అవుతుంది. సరే సరే ఉంటాను. మళ్లీ మాట్లాడుతానులే. డబ్బుకు ఇబ్బంది పడకు. సాయం చేస్తానులే అని ఫోన్ పెట్టేస్తుంది. ఆ తర్వాత ఏంటి మహీంద్రా. చాటుగా వచ్చి మాటలు వినే అలవాటు కూడా ఉందా అంటుంది దేవయాని. దీంతో అయ్యో.. నేను అలా వెళ్తూ నిన్ను చూసి ఇటు వచ్చా. ఇంతకీ ఈ టైమ్ లో ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నారు అని అడుగుతాడు. దీంతో డబ్బు సాయం అడుగుతుంటారు కదా అంటుంది.

guppedantha manasu 20 december 2022 full episode

guppedantha manasu 20 december 2022 full episode

కట్ చేస్తే ఏంటి మహీంద్రా. మీరు ఇలాగే ఉన్నారు. మనం వసుధార ఇంటికి వెళ్లాలి కదా అని అంటుంది దేవయాని. దీంతో ఉన్నపళంగా వెళ్లాలంటే కష్టం కదా దేవయాని అంటాడు ఫణీంద్రా. దీంతో ఉన్నపళంగా ఏంటండి.. మంచి రోజు అని పంతులు గారికి కూడా చెప్పాను. అక్కడ ఏర్పాట్లు కూడా చేయించాను. వీళ్లిద్దరికీ ఎలాగూ పట్టదు. రిషి మీద ఉన్న ప్రేమతో నేనైనా పనులు చేయించాలి కదా. రిషి ఏం చేస్తున్నాడు. రెడీ అవుతున్నాడా అని అంటుంది దేవయాని. ఇంతలో తన రూమ్ లో ఏ డ్రెస్ వేసుకోవాలి అని టెన్షన్ పడుతుంటాడు రిషి. దీంతో వాటి ఫోటోలను తీస్తాడు. మరోవైపు కిచెన్ లో ధరణికి వసుధార సాయం చేస్తూ ఉంటుంది. దీంతో అవన్నీ నేను చూసుకుంటానులే. నువ్వు వెళ్లి రిషి సార్ తో కబుర్లు చెప్పుకో పో అంటుంది. దీంతో మేడమ్.. మీరు ఒక్కరే ఇంట్లో వాళ్ల అందరికీ వండుతుంటారు. నేను సాయం చేస్తే ఏం కాదు.. అంటుంది.

ఇంతలో రిషి ఫోన్ నుంచి తనకు వాట్సప్ మెసేజ్ వస్తుంది. అందులో ఒక డ్రెస్ ఫోటో పెట్టి ఇది బాగుందా అని అడుగుతాడు. దీంతో మీకు ఏదైనా బాగుంటుంది సార్.. ఎందుకంటే మీరు ప్రిన్స్ కదా అని మెసేజ్ పెడుతుంది.

కట్ చేస్తే మీరు ఇంకా ఇలాగే ఉంటే ఎలా. రిషి తల్లిదండ్రులుగా మీరు ఎప్పుడూ పట్టించుకోరు.. అంటుంది దేవయాని. ఇంతలో వసుధార కాఫీ తీసుకొని వచ్చి అందరికీ ఇస్తుంది. మూడు కాఫీలే ఉండటంతో మేడమ్ మీకు ఏమైనా తేవాలా? అని అడుగుతుంది వసుధార. దీంతో వద్దు అంటుంది.

Guppedantha Manasu 20 Dec Today Episode : దేవయానికి షాకిచ్చిన వసుధార

మీ ఇంటికి వెళ్దామని దేవయాని అంటుంది. ఏర్పాట్లు చేస్తోంది. మీ ఇంటికి వస్తున్నామని మీ వాళ్లకు ఫోన్ చేసి చెప్పావా అని అడుగుతాడు ఫణీంద్రా. దీంతో ఫోన్ చేసే ఉంటుందిలే అంటుంది దేవయాని. ఎంతైనా తెలివైన అమ్మాయి కదా అంటుంది దేవయాని.

దీంతో ఫోన్ చేయడానికి తెలివితో ఏం పని మేడమ్.. ఫోన్ ఉంటే చాలు కదా అంటుంది. దీంతో మహీంద్రా నవ్వుతాడు. ఇంతలో రిషి వస్తాడు. రా రిషి.. చూడు… వీళ్లకు నీ గురించి పట్టింపే లేదు అంటుంది దేవయాని.

నేను ఏది చేసినా రిషి మీద ఉన్న ప్రేమ కోసమే అంటుంది దేవయాని. ఏ నాన్న ఏం అంటావు అంటుంది దేవయాని. మరి ఎప్పుడు వెళ్దాం అంటుంది దేవయాని. దీంతో క్షమించాలి.. మీరెవరూ నాతో రావద్దు అంటుంది దేవయాని.

దీంతో అందరూ షాక్ అవుతారు. దీంతో ఏంటి వసుధార రావద్దు అంటావేంటి అని అంటుంది దేవయాని. దీంతో ఈరోజు రావద్దు అంటున్నాను అంటుంది వసుధార. తను పూర్తిగా చెప్పేది వినదు దేవయాని.

మా ఇంట్లో పరిస్థితి ఎలా ఉందో ఏంటో నాకే తెలియదు. సడెన్ గా అందరూ వెళ్లి ఇదిగో అని పెళ్లి ప్రస్తావన తెస్తే అంత బాగుండదు అంటుంది దేవయాని. ఇందులో బాగుండకపోవడానికి ఏముంది. వెళ్తాం సంబంధం మాట్లాడుకుంటాం అంతే కదా అంటుంది దేవయాని.

దీంతో అది మీరు అనుకున్నంత ఈజీ కాదు మేడమ్ అంటుంది. అసలు నీ మనసులో ఏముంది అది చెప్పు అని అడుగుతారు. దీంతో మాది మధ్యతరగతి కుటుంబం. అమ్మా, నాన్న, నేను, తమ్ముడు. చదువు కోసం నాన్న బలవంతంగా పెళ్లి చేయబోతుంటే వచ్చేశాను అంటుంది.

ఆ పెళ్లి పీటల నుంచి ధైర్యంగా ఇంట్లో నుంచి బయటికి అడుగు పెట్టాను. కష్టమో నష్టమూ అన్నీ ఎదుర్కొని యూనివర్సిటీ టాపర్ గా నిలబడ్డాను. ఆ రోజు నుంచి మళ్లీ నేను ఇంటికి వెళ్లలేదు. సడెన్ గా ఇప్పుడు అందరం వెళ్లి పెళ్లి అంటే.. వాళ్లకు ఏం అర్థం కాదు అంటుంది వసుధార.

అందుకని.. ప్రస్తుతానికి నేను ఒక్కదాన్నే వెళ్తాను. ఇన్నాళ్లు కనిపించని నేను ఇప్పుడు వెళ్తే నాన్న కోపం, అమ్మ ప్రేమ అన్నీ ఎదుర్కోవాలి. వాళ్ల మనసు కుదుటపడాలి. వాళ్లందరికీ ఇక్కడి విషయాలు ప్రశాంతంగా నేను వివరిస్తాను అంటుంది వసుధార.

వాళ్లంతట వాళ్లే మిమ్మల్ని ఆహ్వానించేలా చేస్తాను అంటుంది వసుధార. లేదా పరిస్థితులన్నీ ప్రశాంతంగా మారాక నేనే మీకు కబురు చేస్తాను. అప్పుడు మీరు వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. నాన్నకు కొంచెం కోపం ఎక్కువ. ఇన్నాళ్లు నేను ఇంటికి వెళ్లని నేను ఇప్పుడు వెళ్తే కోపం ఉన్నా లేకపోయినా తన స్థానంలో ఉంటే ఎవరైనా అరుస్తారు అంటుంది.

ఆ కోపంలో మిమ్మల్ని కూడా ఒక మాట అంటే అది మర్యాద కాదు. నాకూ కరెక్ట్ కాదు అంటుంది దేవయాని. అందుకే.. మిమ్మల్ని అందరినీ ఇప్పుడు వద్దు అంటున్నాను అంటుంది వసుధార. కోపం ఉందని ఇప్పుడు వెళ్లకుండా ఎన్నాళ్లు ఆగుతాం చెప్పు అంటుంది దేవయాని.

వసు వాళ్ల నాన్న గురించి మీకు తెలియదు కానీ నాకు బాగా తెలుసు అంటుంది జగతి. వసు చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తోంది. ఒకసారి ఆలోచించండి అంటుంది జగతి. బావ గారు అందరం పెళ్లి సంబంధం కోసం వెళ్లి అక్కడ ఊహించని పరిస్థితులు ఎదుర్కోవడం అవసరం లేదు కదా అంటుంది జగతి.

దీంతో తను చెప్పింది కూడా కరెక్టే కదా దేవయాని అంటాడు ఫణీంద్రా. వసుధార చెప్పిందే కరెక్ట్ అనిపిస్తోంది అంటాడు మహీంద్రా. దీంతో ఇవన్నీ లేనిపోని ఆలోచనలు.. మనం వెళ్తే వాళ్ల నాన్న సంతోషిస్తాడు అంటుంది దేవయాని.

అక్కడికి వెళ్తే నా విశ్వరూపం చూస్తారు అని అనుకుంటుంది దేవయాని. రిషి నువ్వు ఏం అంటావు అని అడుగుతుంది దేవయాని. దీంతో వసుధార చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదా అంటాడు.

తన ఇంట్లోని పరిస్థితులు మనకేం తెలుస్తాయి చెప్పండి అంటాడు. తన అభిప్రాయాన్ని గౌరవిద్దాం. తనను ఫస్ట్ వెళ్లనిద్దాం అంటాడు రిషి. అందరూ ఒక్కటయ్యారు. నేనేం మాట్లాడుతాను అని అనుకుంటుంది.

నువ్వు త్వరగా వెళ్లి మాకు ఫోన్ చేస్తే అందరం కలిసి వస్తాం. మీ వాళ్ల సమ్మతితో వస్తేనే మాకూ గౌరవం ఉంటుంది అని అంటాడు ఫణీంద్రా. ఇక.. థాంక్యూ సార్ మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు అంటుంది వసుధార.

తర్వాత వసుధార రెడీ అయి రిషి కారులో తన ఊరుకు బయలుదేరుతుంది. నువ్వు ఈ కారులో వెళ్తున్నావంటే అది నీ హక్కుగా భావించాలి అని అంటాడు రిషి. తర్వాత కారులో బయలుదేరుతుంది వసుధార.

మీ ఊరికి మేము ఎవ్వరం రావట్లేదు. ముందు నువ్వు వెళ్లు అని ముందే మహీంద్రా, జగతి.. వసుధారకు చెబుతారు. అదే విషయాన్ని చెప్పి తను ఒక్కతే ఊరికి బయలుదేరుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది