Guppedantha Manasu 22 Dec Today Episode : కారులోనే రిషి, వసుధార రొమాన్స్.. వసుధార ఇంటికి రిషి వెళ్తాడా? దేవయాని చేసిన ప్లాన్ వర్కవుట్ అవుతుందా? పెళ్లిని ఆపేస్తుందా?

Authored By Varun G | The Telugu News | Published on: December 22, 2022, 9:00 am

Guppedantha Manasu 22 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 22 డిసెంబర్ 2022, గురువారం ఎపిసోడ్ 640 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వసుధారతో కలిసి రిషి వెళ్తున్నాడని తెలిసి ఫోన్ చేస్తుంది దేవయాని. కానీ.. పెద్దమ్మ నేను వసుధారను వదిలి ఉండలేను. తనతో ఉండాలి. తనకు తోడుగా ఉండాలి అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. దీంతో వసుధార.. నీకు జగతి ట్రెయినింగ్ ఇచ్చింది. చెప్తా మీ పని అని అనుకుంటుంది దేవయాని. వెంటనే మహీంద్రా, జగతిని పిలిచి ఏంటి మహీంద్రా నువ్వు చేసిన పని. రిషిని అలా ఎలా పంపిస్తారు. వెళ్ళేముందు నాకు ఒక సారి చెప్పాలి కదా అంటుంది. దీంతో అక్కయ్య.. రిషి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. వెళ్లాడు. మమ్మల్ని పర్మిషన్ అడగలేదు అని అంటుంది జగతి. దీంతో నేను నీతో మాట్లాడటం లేదు. మహీంద్రాతో మాట్లాడుతున్నా. అసలు నీకు రిషి మీద ఎలాంటి అధికారం లేదు అంటుంది దేవయాని.

guppedantha manasu 22 december 2022 full episode

guppedantha manasu 22 december 2022 full episode

వసుధార వాళ్ల నాన్న కోపిష్టి అన్నారు కదా. రిషి ఒక్కడే వెళ్తే అక్కడ రిషి మీద ఏదైనా అంటే ఏంటి పరిస్థితి. మీరు ఎలా పంపించారు అంటుంది. దీంతో వదిన గారు.. రిషి చిన్న పిల్లాడు కాదు. రిషి తనకు వెళ్లాలనిపించింది వెళ్లాడు అంటాడు మహీంద్రా. రిషిని ఆపడం మీ వల్ల కానప్పుడు నాకు చెబితే నేను ఆపేదాన్ని కదా అంటుంది దేవయాని. ఏవండి.. మీరు ఏం మాట్లాడరు ఏంటి అంటుంది దేవయాని. దీంతో వదిన చెప్పింది కూడా నిజమే కదా. అందరం కలిసి వెళ్తే బాగుండేది కదా అంటాడు ఫణీంద్రా. అందుకే మనం రిషి వెళ్లకముందే మనం కూడా వెళ్దాం పదండి అంటుంది దేవయాని. వాళ్లకు విషయం అర్థం అయ్యేలా చెబుదాం. మీకు మాట్లాడటం చేతకాకపోతే మీరు సైలెంట్ గా ఉండండి. నేను మాట్లాడుతాను. పదండి వెళ్దాం అంటుంది దేవయాని.

అక్కయ్య.. రిషి మనకు ఫోన్ చేసి అన్ని విషయాలు చెబుతా అన్నాడు. ఇప్పుడు మనం వెళ్లడం కరెక్ట్ కాదు అంటుంది జగతి. దీంతో ఏయ్ జగతి నువ్వు నాకు నీతులు చెప్పకు. ఇక్కడ నిర్ణయాలు తీసుకునేది నేను. పదండి వెళ్దాం అంటే.. వద్దు ఆగుదాం. రిషి వద్దన్నాక వెళ్లడం కరెక్ట్ కాదేమో అంటాడు ఫణీంద్రా.

ఆలోచిస్తే వెళ్లకపోవడమే మంచిది అనిపిస్తోంది అంటాడు ఫణీంద్రా. దీంతో రిషికి అక్కడ జరగరానిది ఏదైనా జరిగితే అంటుంది దేవయాని. దీంతో వసుధార తెలివైన అమ్మాయి. రిషికి అలాంటి పరిస్థితులు రాకుండా తను చూసుకుంటుంది. ఇక ఈ విషయంలో ఎలాంటి చర్చ అవసరం లేదు. రిషి ఫోన్ చేశాకే వెళ్దాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఫణీంద్రా.

Guppedantha Manasu 22 Dec Today Episode : మీ ఇంటికి తీసుకెళ్లి నన్ను ఏమని పరిచయం చేస్తావని అడిగిన రిషి

కోపంతో ఏంటో ఈ కొంపలో నాకేదీ నడవడం లేదు అనుకుంటూ వెళ్లిపోతుంది దేవయాని. మరోవైపు రిషి ఒకచోట కారు ఆపుతాడు. ఏంటి వసుధార నువ్వు ఏం మాట్లాడటం లేదు అంటాడు రిషి. దీంతో సంతోషంలో మాటలు రావడం లేదు సార్ అంటుంది. ఇలా మీతో మా ఊరికి, మా ఇంటికి వెళ్లడం చాలా సంతోషంగా ఉంది అంటుంది.

దీంతో కనిపిస్తోంది కానీ.. నన్ను మీ ఇంటికి తీసుకెళ్లి నన్ను ఏమని పరిచయం చేస్తావు అని అడుగుతాడు. దీంతో అమ్మ.. మా కాలేజీ ఎండీ గారు అని పరిచయం చేస్తా అంటుంది. దీంతో అంతేనా అంటాడు. దీంతో అంతేనా అంటే ఇంకా బాగానే చెబుతాను అంటుంది వసుధార.

నువ్వు ఏం చెబుతావో నాకు ఇప్పుడు చెప్పు అంటాడు రిషి. దీంతో నేను చెప్పను అంటుంది. దీంతో నువ్వు చెప్పేదాకా కారు ఇక్కడే ఉంటుంది. కారు కదలదు అంటుంది. దీంతో వసుధారకు ఏం చేయాలో అర్థం కాదు. మీతో ఎంత సేపు అయినా కూడా నేను ఇలాగే కారులో కూర్చొంటాను అంటుంది వసుధార.

అలా కాదు వసుధార. నేను మా ఇంట్లో ఈ అమ్మాయే నాకు కాబోయే భార్య అని చెప్పాను కదా అంటాడు రిషి. దీంతో నేను మా అమ్మకు మీ గురించి నేను ఏం చెబుతానో చెప్పాలంటే ఈ ఉంగరం మీరు నాకు పెట్టాలి అని అంటుంది వసుధార. ఇప్పుడా అంటాడు.

దీంతో ఇప్పుడే సార్ అంటుంది వసుధార. అవన్నీ కార్యక్రమాలు తర్వాత ఉంటాయి కదా అంటే.. వాటి దారి వాటిదే.. ఇప్పుడు ఈ ఉంగరం మీరు నాకు తొడిగితేనే చెబుతాను. లేకపోతే లేదు అంటుంది వసుధార. అంతేనా అంటే అంతే అంటుంది వసుధార.

మొండి దానివి కదా అంటే కాదు సార్ జగమొండిని అంటుంది. దీంతో తనకు రింగ్ తొడుగుతాడు రిషి. రింగ్ తొడిగిన తర్వాత తన చేతికి ముద్దు ఇస్తాడు. దీంతో వసుధార మురిసిపోతుంది. దీంతో మీ చేయి ఇవ్వండి ఒకసారి నేను చేయి మీద రాస్తా అంటుంది.

దీంతో సరే అని చేయి ఇస్తాడు. కళ్లు మూసుకుంటేనే రాస్తా అంటుంది. దీంతో కళ్లు మూసుకుంటాడు రిషి. దీంతో చేతి మీద ఏదో రాస్తుంది వసుధార. రిషి సార్ ఎండీ అని రాసి మై డార్లింగ్ ప్రేమతో మీ పొగరు అని రాస్తుంది వసుధార. అది చదివి రిషి చాలా సంతోషిస్తాడు.

ఆ తర్వాత ఇద్దరూ కారులోనే కాసేపు రొమాంటిక్ గా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Varun G

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp