Guppedantha Manasu 23 Dec Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 23 డిసెంబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 641 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వసుధార, రిషి ఇద్దరూ తన ఊరికి కారులో వెళ్తుంటారు. ఇంతలో వాటర్ అయిపోతాయి. దీంతో ఒక షాపు దగ్గర ఆగుతారు ఇద్దరూ. అక్కడ గోలీ సోడా కనిపించడంతో నాకు గోలీ సోడా కావాలి అంటుంది వసుధార. దీంతో నాకు వద్దు. నువ్వు తాగు అంటాడు రిషి. దీంతో ఏం కాదు.. ఇద్దరం కలిసి తాగుదాం అంటుంది వసుధార. దీంతో ఇద్దరూ కలిసి తాగుతుంటారు. కానీ.. రిషికి తాగరాదు. దీంతో దాన్ని ఎలా ఓపెన్ చేయాలో.. గోలి అడ్డురాకుండా ఎలా తాగాలో వసుధార తనకు చెబుతుంది. ఒకటి తాగగానే రిషికి నచ్చుతుంది. దీంతో ఇంకో రెండు గోలీసోడాలు ఇవ్వు అంటాడు రిషి. ఈసారి గోలీ నేను కొడతాను అని చెప్పి గోలీలు రిషి కొట్టి తాగుతాడు. సూపర్ ఉంది వసుధార అంటాడు. ఇంతలో అక్కడ వసుధారకు తేగలు కనిపిస్తాయి.
తాటితేగలు అమ్ముతున్నారు సార్. వీటిని కూడా తీసుకుందాం అని అంటుంది. వీటిని వెళ్లేటప్పుడు తిందాం సార్ అంటుంది వసుధార. తేగలు నేను తినను.. నువ్వు తిను అంటాడు రిషి. దీంతో ఇవి తింటే డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది సార్ అంటుంది వసుధార. దీంతో నేను అన్నీ తింటాను కానీ.. దాని హిస్టరీ ఆపు. నీకు ఒక విషయం చెప్పనా. పల్లీలు అయిపోయాయి.. కొబ్బరి బొండాలు అయిపోయాయి. పుచ్చకాయలు అయిపోయాయి. ఇప్పుడు గోలీ సోడా, ఆ తర్వాత తేగలు.. ఇంకా అన్ని పండ్లు.. ప్రపంచంలో ఉన్నవన్నీ నాతో తినిపిస్తావా.. తాగిపిస్తావా… అప్పటి దాకా నీకు మనశ్శాంతి ఉండదా అంటాడు రిషి. చూశావా.. వాటి పేర్లు చెబుతుంటేనే నాకు ఆయాసం వస్తోంది అంటాడు రిషి. దీంతో అయ్యో సార్.. ఇంకో గోలీసోడా తెమ్మంటారా అని అంటుంది వసుధార. దీంతో దండం నీకు.. పదా వెళ్దాం అంటాడు.
ఇంతలో తన ఊరు దగ్గరికి రావడంతో మెల్లగా పోనివ్వండి సార్.. నెమ్మదిగా వెళ్దాం అంటూ ఇంతలో తన ఊరు బోర్డు కనిపించడంతో ఒకసారి ఆపండి.. కారు దిగండి అంటుంది. ఎందుకు అంటే దిగండి సార్ అంటుంది.
సార్ మా ఊరు సార్ అంటుంది. బోర్డు చూపించి అనంతగిరి ఇదే మా ఊరు. ఈ బోర్డు దగ్గర ఒక ఫోటో దిగుదాం అంటుంది వసుధార. అక్కడ ఇద్దరూ కలిసి సెల్ఫీ దిగుతారు. అలాగే ముందుకు వెళ్తే చెరువు ఉంటుంది. ఇటు వైపు వెళ్తే.. రాముల వారి గుడి ఉంటుంది.. అంటుంది.
దీంతో సరే వెళ్దామా అంటే.. వెళ్దాం సార్ కానీ.. స్పీడ్ గా వెళ్లొద్దు.. నెమ్మదిగా వెళ్లాలి. మా ఊరిని చూసుకోవాలి అంటుంది వసుధార. కట్ చేస్తే దేవయాని.. నేను ఒకటి అనుకుంటే మరొకటి జరిగింది అని అనుకుంటుంది.
ఇంతలో ధరణి కాఫీ తీసుకొస్తుంది. ఇన్నాళ్లకు టైమ్ కు తీసుకొచ్చావు అంటుంది దేవయాని. యాక్.. ఏంటిది.. నేను టీ తాగుదామనుకున్నాను అంటుంది దేవయాని. దీంతో ఇది కాఫీ అంటుంది. మీరు టీ తాగుదామనుకున్నది నాకు ఎలా తెలుస్తుంది అంటుంది.
మనం అనుకున్నవన్నీ జరగవు కదా అంటుంది ధరణి. దీంతో ఈ కాఫీ కప్పు నేలకేసి కొట్టకముందే తీసుకెళ్లు పో అంటుంది. దీంతో ఎందుకు చిరాకుగా ఉన్నారు అని అడుగుతుంది ధరణి.
దీంతో ఎందుకు చిరాకుగా ఉన్నానో ఇప్పుడు చెప్పాలా లేదంటే ఊరుకోవా అంటూ ధరణిని అక్కడి నుంచి పంపించేస్తుంది దేవయాని. అసలు.. వసుధారకు నా ప్లాన్ తెలిసిందా అని టెన్షన్ పడుతుంది దేవయాని.
మరోవైపు సార్ ఈ అరటి పండు తింటారా అంటూ అడుగుతుంది వసుధార. దీంతో వద్దు నాకు. రెండు రోజుల వరకు నేను ఏం తినను అంటాడు రిషి. అరటి పండు వల్ల ఉన్న ఉపయోగాలు అన్నీ రిషికి చెబుతుంది వసుధార.
ఇంతలో తను చదువుకున్న చిన్ననాటి కాలేజీ కనిపిస్తుంది. దీంతో దిగండి సార్.. మా కాలేజీ చూసి వద్దాం అంటుంది వసుధార. లోపలికి వెళ్తారు. అక్కడే కాసేపు గడుపుతారు. ఆ తర్వాత జగతి ఇచ్చిన గిఫ్ట్ ను వసుధారకు ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగం కోసం వెయిట్ చేయాల్సిందే.
Shani : జ్యోతిషశాస్త్రం ప్రకారం 2025 వ సంవత్సరంలో శనీశ్వరుడు మీనరాశిలో సంచరించబోతున్నాడు. ఇలా మీనరాశిలో సంచరించడం వలన కొన్ని…
Nayanthara : లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమాలతో తన సత్తా చాటుతుంది. సౌత్ లోనే కాదు జవాన్ సినిమాతో…
Utpanna Ekadashi : ప్రతీ నెలలో రెండుసార్లు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ నేపథ్యంలో కార్తీకమాసంలోని కృష్ణపక్షంలోని ఏకాదశి తిధిని…
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
This website uses cookies.