Guppedantha Manasu 23 Nov Today Episode : మహీంద్రా, జగతికి యాక్సిడెంట్.. ఆసుపత్రిలో చనిపోతారా? ఈ విషయం రిషికి తెలిసి ఏం చేస్తాడు?

Guppedantha Manasu 23 Nov Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 23 నవంబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 615 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రిషి నేను ఇంటికి వస్తా అని మీరు ఒక్క మాట కూడా చెప్పడం లేదు అంటాడు రిషి. మీరు లేని రిషి ఆ ఇంట్లో ఎలా ఉన్నాడో ఒక్కసారి ఊహించుకోండి అంటాడు రిషి. రోజూ తెల్లవారగానే మిమ్మల్ని చూస్తే నాకు ధైర్యం, కానీ మీరు లేని ఆ ఇల్లు మీరు వదిలేసిన ఆ గది, మీరు వదిలి వెళ్లిన ఈ రిషి.. ఎలా ఉన్నారో ఎప్పుడైనా ఆలోచించారా డాడ్ అంటాడు రిషి. డాడ్.. మిమ్మల్ని ఇక్కడ చూసిన క్షణం.. ఎంత పులకించిపోయానో తెలుసా? అంటాడు రిషి. చిన్నపిల్లాడిలా ఆనందంతో గంతులు వేయాలనిపించింది అంటాడు. మా డాడ్ వచ్చారు… నా కోసం మా డాడ్ వచ్చారని గట్టిగా అరిచి అందరికీ చెప్పాలనుకున్నాను. కానీ.. అప్పుడున్న పరిస్థితి వేరు.. ఆ టెన్షన్ వేరు అంటాడు రిషి.

guppedantha manasu 23 november 2022 full episode

ఏంటి డాడ్ ఇంకా ఆలోచిస్తున్నారా అంటాడు రిషి. డాడ్.. నా కళ్లలోకి చూసి చెప్పండి. మీరు ఇంటికి వస్తున్నారా? లేదా? అంటాడు రిషి. చెప్పండి డాడ్ అంటాడు. దీంతో నేను అది అంటూ ఏం మాట్లాడలేకపోతాడు మహీంద్రా. దీంతో సరే డాడ్. బాగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి అంటాడు రిషి. ఈ రిషిని మీరు ఏం చేయాలని అనుకుంటున్నారో ఈ రోజు రాత్రంతా ఆలోచించుకోండి. టైమ్ ఇస్తున్నాను. మీ మనసు ఏది చెబితే అది చేయండి. మీ మనసులో ఈ రిషి ఉన్నాడు. అది గుర్తు పెట్టుకోండి అంటాడు రిషి. నాన్నా రిషి అంటూ మహీంద్రా ఏదో చెప్పబోతుండగా నాన్నా ప్లీజ్ అంటాడు. ఇంకేం చెప్పొద్దు అంటాడు. నాకు మీ ప్రేమ కావాలి.. మీరు కావాలి అంటాడు రిషి.

ఆలోచించుకోండి డాడ్.. టైమ్ తీసుకోండి అంటాడు. ఈరోజు రాత్రంతా ఆలోచించుకోండి. రావాలనిపిస్తే రేపు పొద్దున్నే సూర్యోదయం కన్నా ముందే ఇంటికి రండి అంటాడు రిషి. ఆ సూర్యుడి కన్నా ముందు మీరే ముందు దర్శనం ఇవ్వాలి అంటాడు.

ఇద్దరం మన ఇంట్లో కలిసి టిఫిన్ చేద్దాం. ఇన్నాళ్లు ఆ ఇంట్లో మీరు లేకుండా ఉండగలిగాను. మీరొచ్చు గుడ్ మార్నింగ్ రిషి అని చెప్పాలి. అప్పుడే నాకు నిజమైన గుడ్ మార్నింగ్ అవుతుంది అంటాడు రిషి.

ఇద్దరం కలిసి కాఫీ తాగుదాం. కబుర్లు చెప్పుకుందాం అంటాడు రిషి. మీరు వస్తారని అనుకుంటున్నాను అంటాడు. తర్వాత భావోద్వేగానికి గురయి మహీంద్రాను హత్తుకుంటాడు రిషి. దీంతో మహీంద్రా కూడా ఎమోషనల్ అవుతాడు.

Guppedantha Manasu 23 Nov Today Episode : మహీంద్రా గురించే రాత్రంతా ఆలోచించిన రిషి

కానీ.. అతడిని కౌగిలించుకోవాలా వద్దా అని ఆలోచిస్తాడు. కౌగిలించుకునే లోపే రిషి అక్కడి నుంచి వెళ్లిపోయి కారు తీస్తాడు. వసుధార.. రిషి కారు ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంటికి వెళ్లాక వసుధారకు నిద్ర పట్టడం లేదని రిషికి మెసేజ్ చేస్తుంది.

ఇద్దరూ చాట్ చేసుకుంటారు. డాడ్ వస్తారు కదా.. అంటాడు. కానీ.. ఏదైనా కారణం చెప్పి రాకుండా ఉంటారేమో అని భయంగా ఉంది అని మెసేజ్ చేస్తాడు. దీంతో బాల్కనీలో కలుద్దాం రండి అంటుంది వసుధార.

దీంతో ఇద్దరూ బాల్కనీలో కలుస్తారు. ఇన్నాళ్లు డాడ్ ను చూడకుండా ఉన్నాను కానీ.. రేపు ఉదయం వరకు వెయిట్ చేయడం కష్టంగా ఉంది. రేపు ఉదయం డాడ్ వస్తారని అనిపిస్తోంది కానీ.. రాకపోతే ఎలా అనే భయం కూడా ఉంది అంటాడు.

మహీంద్రా సార్ వస్తారు. భయపడకండి. జగతి మేడమ్ దగ్గరుండి తీసుకొస్తారు అంటుంది. మీరు ఇప్పుడు ఎంత ఎదురు చూస్తున్నారో.. అక్కడ వాళ్లు కూడా ఎప్పుడు వెళ్లాలని అనుకుంటూ ఉంటారు అంటుంది వసుధార.

మరోవైపు మహీంద్రా, జగతి.. ఇద్దరూ కలిసి రేపు ఉదయం వెళ్లాలని నిశ్చయించుకుంటారు. రేపు ఉదయం.. రిషికి షాక్ ఇవ్వాలని అని అంటాడు మహీంద్రా. మరోవైపు వసుధార, రిషి ఇద్దరూ చేతుల్లో చేయి వేసుకొని నడుస్తూ రావడం చూస్తుంది దేవయాని.

ఏంటి రిషి. ఇంత రాత్రి అయింది ఇంకా పడుకోలేదా అంటుంది. ఇప్పటి దాకా ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చొన్నారా అని వసుధారను తిడుతుంది వసుధార. దీంతో నేనే డాడ్ వాళ్ల గురించి ఆలోచిస్తూ ఉన్నాను అంటాడు రిషి.

పదా పడుకుందాం.. మహీంద్రా ఇష్టం ఉంటే వస్తాడు లేకపోలే లేదు అంటుంది. దీంతో నాకు నిద్ర రావట్లేదు పెద్దమ్మ అంటాడు రిషి. కట్ చేస్తే తెల్లవారుతుంది. మహీంద్రాకు ఎందుకో మళ్లీ రావాలనిపించదు.

మనం ఇన్ని రోజులు ఏం అనుకున్నాం.. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటాడు. కానీ.. చివరకు కారులో బయలుదేరుతారు కానీ.. వాళ్ల కారు యాక్సిడెంట్ అవుతుంది. దీంతో ఇద్దరిని ఆసుపత్రికి తీసుకెళ్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Mars Ketu Conjunction : 55 ఏళ్ల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోనికి సంయోగం… ప్రపంచవ్యాప్తంగా యుద్ధం, ఉద్రిక్తతలు పెరిగే అవకాశం…?

Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…

51 minutes ago

Wife : అక్రమ సంబంధానికి అడ్డు తగులుతున్నాడని భర్తనే చంపిన భార్య..!

Wife  : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…

10 hours ago

AP Farmers : ఏపీ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన‌ మంత్రి అచ్చెన్నాయుడు..!

AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…

11 hours ago

Pawan Kalyan : బాలినేని కి పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్లేనా..?

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా పరిణామాలు కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ TDP ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వంగా…

12 hours ago

Roja : బాలకృష్ణ కు అది ఎక్కువ అంటూ రోజా ఘాటు వ్యాఖ్యలు.. వీడియో !

Roja : టాలీవుడ్‌లో హీరోయిన్‌గా చెరగని ముద్ర వేసిన రోజా రాజకీయ రంగంలోనూ తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. భైరవ ద్వీపం,…

13 hours ago

KTR : 72 గంటల్లో రా.. తేల్చుకుందాం అంటూ రేవంత్ కు సవాల్ విసిరిన కేటీఆర్..!

KTR  : తెలంగాణలో రైతుల సంక్షేమంపై చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. సీఎం రేవంత్…

14 hours ago

Mallikarjun Kharge : ఎమ్మెల్యేలకు మల్లికార్జున ఖర్గే వార్నింగ్..!

Mallikarjun Kharge : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పై గాంధీ భవన్ లో…

15 hours ago

Insta Reel : ఇన్‌స్టాగ్రామ్ రీల్ తెచ్చిన తంటా.. వరంగల్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ.. వీడియో

Insta Reel : వరంగల్‌లోని కొత్తవాడలో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టైన ఓ వీడియో భారీ కల్లోలానికి దారితీసింది. ఒక మైనర్ బాలుడు,…

16 hours ago