Intinti Gruhalakshmi 23 Nov Today Episode : పరందామయ్య అనసూయపై సీరియస్.. దీంతో ఆత్మహత్య చేసుకోబోయిన అనసూయ.. ఇంతలో ట్విస్ట్

Intinti Gruhalakshmi 23 Nov Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 23 నవంబర్ 2022, బుధవారం ఎపిసోడ్ 797 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. పరందామయ్యను వాకింగ్ కోసం గార్డెన్ తీసుకెళ్లినా కూడా ఏం మారడు. అలాగే మూడీగా కూర్చొని ఉంటాడు. దీంతో తులసి, సామ్రాట్ బాధపడతారు. సామ్రాట్ బాబాయి.. పరందామయ్యను నవ్వించడానికి తెగ ప్రయత్నిస్తాడు కానీ.. పరందామయ్య మాత్రం అస్సలు నవ్వడు. పరందామయ్య మీకు మాత్రమే బాధ్యత కాదు. నాకు కూడా. ఆయన నాకు కూడా తండ్రి లాంటి వారు అని చెబుతాడు సామ్రాట్. ఇంతలో సామ్రాట్ బాబాయి.. బాగా నవ్వుతాడు అయినా కూడా పరందామయ్య నవ్వడు. అలాగే మూడీగా ఉంటాడు. ఎంత చెప్పినా కూడా పరందామయ్య అలాగే ఉంటాడు.

intinti gruhalakshmi 23 november 2022 full episode

ఇప్పడు అందరం నవ్వుదాం. ఒన్, టూ, త్రీ.. అని అంటాడు సామ్రాట్. కానీ.. పరందామయ్య మాత్రం నవ్వడు. కేవలం సామ్రాట్, తులసి, బాబాయి ఈ ముగ్గురే నవ్వుతారు. ఎంత బతిమిలాడినా కూడా పరందామయ్య మాత్రం మారడు. అలాగే ఉండిపోతాడు. నా వల్ల కావడం లేదు. మనసును మోసం చేసుకోలేకపోతున్నాను. మళ్లీ ఎప్పుడైనా ట్రై చేస్తాను సరేనా అంటాడు పరందామయ్య. దీంతో అలాగే మామయ్య.. పదండి వెళ్దాం అంటుంది. దారిలో వేడి వేడి కాఫీ తాగుదాం. ఫ్రెష్ గా అనిపిస్తుంది అంటుంది తులసి. బంధం అంటే బలంగా అయి ఉండాలి. లేదా పూర్తిగా తెగిపోయి అయినా ఉండాలి. ఉండీ లేనట్టుగా ఉండే బంధాలు ఇలాగే బాధపెడతాయి అంటాడు బాబాయి.

తాతయ్యను అనుమానించడం వల్ల ఆయన పరువును దిగదార్చుకోగా.. అందరిలో నువ్వు నీ మర్యాదను దిగదార్చుకున్నావు అంటాడు ప్రేమ్. 50 ఏళ్ల పాటు తాతయ్యతో కలిసి ఉండి నువ్వు ఇంకా ఇలాగే ప్రవర్తిస్తున్నావు.

అమ్మ విషయంలో అలాగే ఉన్నావు.. తాతయ్య విషయంలోనూ అలాగే తయారయ్యావు. ఇక నుంచి నేను ఈ ఇంట్లో ఉండటానికి నా మనసు ఒప్పుకోవడం లేదు నానమ్మ అంటాడు. అమ్మ దూరం అయ్యాక ఈ ఇంట్లో వెలుగు దూరం అయింది. తాతయ్య దూరం అయ్యాక ఈ ఇంట్లో మానవత్వం దూరం అయింది అంటాడు ప్రేమ్. తర్వాత ఇద్దరూ కలిసి ఇంట్లో నుంచి వెళ్లిపోతారు.

Intinti Gruhalakshmi 23 Nov Today Episode : ప్రేమ్, శృతిని వెళ్లకుండా ఆపేందుకు ట్రై చేసిన లాస్య

ప్రేమ్, శృతిని ఎలాగైనా ఆపాలని అనుకుంటుంది లాస్య. ప్రేమ్.. జరిగిన తప్పును నానమ్మ సరిచేసుకుంటుంది. మీరు ఇల్లు వదిలి వెళ్లొద్దు అంటుంది లాస్య. కానీ.. వాళ్లు వినరు. ఇల్లు వదిలి వెళ్లిపోతారు.

దీంతో అనసూయ అక్కడ కుప్పకూలిపోతుంది. ఏడుస్తుంది. ఇంతలో నందు.. లాస్యకు ఫోన్ చేస్తాడు. ఇంట్లో పరిస్థితి చెబితే అస్సలు ఆగడు. ఏం చేయాలి అని అనుకుంటుంది లాస్య. ముందు అత్తయ్య మైండ్ సెట్ చేసి ఆ తర్వాత నందుతో మాట్లాడుతా అని అనుకుంటుంది లాస్య.

మామయ్య ఇష్యూ.. నందుకు తులసి చెప్పేసినట్టుంది. ఆ తులసి మామూల్ది కాదు అత్తయ్య. నందు ఫోన్ చేస్తున్నాడు అంటూ మళ్లీ తులసి మీద రెచ్చగొడుతుంది లాస్య. ఇప్పటికైనా మీరు మనసు మార్చుకొని మామయ్యను తీసుకురావడానికి ఒప్పుకోకపోతే చాలా కష్టం అంటుంది లాస్య.

కట్ చేస్తే పరందామయ్య కోసం తులసి జీడిపప్పు ఉప్మా చేస్తుంది. అర్జెంట్ గా ముందు మీ మామయ్య గారికి నైవేద్యం పెట్టి ఆ తర్వాత ప్రసాదం మాకు పెట్టు అంటాడు బాబాయి. త్వరగా కానివ్వు మా కడుపులు కాలుతున్నాయి అంటాడు.

కానీ.. పరందామయ్య ఉప్మా కూడా వద్దు అంటాడు. పాయసం చేయనా అంటుంది తులసి. నాకు కూడా ఇష్టం అంటాడు సామ్రాట్. బాబాయి కూడా అదే అంటాడు. దీంతో నాకూ అదే ఇష్టం అంటాడు ప్రేమ్.

ప్రేమ్, శృతిని చూసి షాక్ అవుతాడు పరందామయ్య. వెంటనే లేచి వాళ్ల దగ్గరికి వెళ్తాడు పరందామయ్య. మీతో పాటు ఉండిపోవడానికి వచ్చాం అంటాడు ప్రేమ్. సారీ అమ్మ. మీకు ముందుగా చెప్పకుండా ఆ ఇల్లు వదిలేసి వచ్చాం అంటాడు ప్రేమ్.

నానమ్మను చూస్తుంటే తను తాతయ్యను అన్న మాటలే గుర్తొస్తున్నాయి. అందుకే వచ్చేశాం అంటుంది శృతి. దీంతో ఈ అమ్మే కాదు.. అమ్మకు సంబంధించినవి అన్నీ మీవే. పర్మిషన్ అడిగితే నన్ను అవమానించినట్టే అవుతుంది అంటుంది తులసి.

ప్రేమ్ వచ్చాక పరందామయ్య ముఖంలో నవ్వు కనిపిస్తుంది. ఇంతలో ప్రేమ్ కు నందు ఫోన్ చేస్తాడు. వద్దు కాల్ ఆన్సర్ చేయకు. నేను చెప్పిన మాట విను అంటాడు పరందామయ్య. వాడికి ఇది చెప్పకు వద్దు అంటాడు పరందామయ్య.

వాడికి తెలియకూడదు అంటుంటే.. అస్సలు తెలియదు అంటూ అక్కడికి వచ్చిన లాస్య అంటుంది. మీరు మనసు మార్చుకొని ఇంటికి వచ్చేస్తే నందుకు తెలిసే అవకాశం ఉండదు మామయ్య అంటుంది లాస్య.

ఇది మీరు మీ పుట్టిన రోజు సందర్భంగా మీరు మాకు ఇచ్చే గిఫ్ట్ అనుకోండి. మిమ్మల్ని తీసుకెళ్లడానికి వచ్చాను మామయ్య అంటుంది. ఇంతలో అనసూయ కూడా వస్తుంది. తనను చూసి పరందామయ్య భయపడతాడు.

గుమ్మం దగ్గరే నిలబడ్డారేం.. లోపలికి రండి అంటుంది తులసి. దీంతో అనసూయ లోపలికి వెళ్తుంది. పదండి మనింటికి వెళ్దాం అంటుంది అనసూయ. తులసి.. మా ఆయన చేయి వదులు అంటుంది అనసూయ. వినిపించడం లేదా అంటుంది.

జరిగిన గొడవ, మీకు మాకు మధ్య. ఇందులో వేరే వాళ్లు కల్పించుకోవాల్సిన అవసరం లేదు. మనింటికి వెళ్లి తీరిగ్గా మాట్లాడుకుందాం పదా అంటుంది అనసూయ. పరందామయ్యను గుంజుకొని తీసుకెళ్లబోతుంది.

దీంతో అత్తయ్య జాగ్రత్త అంటుంది తులసి. 50 ఏళ్లు కాపురం చేశాం. మా మధ్య నువ్వు రాకు అంటుంది. దీంతో వస్తాను.. ఆయన్ను జాగ్రత్తగా చూసుకోకపోతే నేను ఊరుకోను అంటుంది అనసూయ.

పరందామయ్యను లాక్కొని వెళ్లబోతుంది అనసూయ. దీంతో నేను రాను.. అని తనను విదిల్చుకొని లోపలికి వచ్చి డోర్ పెడతాడు పరందామయ్య. నేను వెళ్లను. ఆ ఇంటికి వెళ్లను. వెళ్లాలని లేదు నాకు అంటాడు పరందామయ్య.

మిమ్మల్ని అవమానించాలని కాదు. అన్నంత మాత్రాన ఇలా నన్ను తోసేస్తారా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు. ఇలా డోర్ దగ్గరే నన్ను గొంతు పిసుక్కొని చనిపోమంటారా అంటుంది అనసూయ. దీంతో నన్ను ఇక్కడ ప్రశాంతంగా బతకనియ్యు.. ప్రశాంతంగా చావనివ్వు అంటాడు పరందామయ్య.

దీంతో బయటికి వెళ్లి ఆత్మహత్య చేసుకోబోతుంది అనసూయ. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

Recent Posts

Blue Berries | బ్లూబెర్రీస్ .. ఆరోగ్యానికి సంజీవని ..చిన్న పండులో అపారమైన మేలు

Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్‌ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…

2 weeks ago

Remedies | మీన రాశి వారికి ఏలినాటి శని రెండో దశ ప్రారంభం..జాగ్రత్తగా ఉండాలని పండితుల హెచ్చరిక

Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…

2 weeks ago

Rukmini Vasanth | రుక్మిణి వసంత్ పేరిట మోసాలు .. సోషల్ మీడియాలో బహిరంగ హెచ్చరిక!

Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్  తన పేరుతో జరుగుతున్న మోసాలపై…

2 weeks ago

Moringa Powder | మహిళల ఆరోగ్యానికి అద్భుత ఔషధం మునగ ఆకు పొడి.. లాభాలు ఎన్నో

Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…

2 weeks ago

Sesame Seeds | మహిళలకు ఆరోగ్య వరం …చిట్టి గింజలతో లాభాలు ఎన్నో

Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…

2 weeks ago

Heart Attacks | భారతదేశంలో పెరుగుతున్న గుండెపోటులు.. నిపుణుల హెచ్చరిక!

Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్‌, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…

2 weeks ago

Triphala Powder | త్రిఫల చూర్ణం పాలతో తాగితే కలిగే అద్భుత ప్రయోజనాలు.. శీతాకాలంలో ఎందుకు ప్రత్యేకం తెలుసా?

Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…

2 weeks ago

Mole | జ్యోతిషశాస్త్రం ప్రకారం కుడి బుగ్గపై పుట్టుమచ్చ ఉన్నవారి వ్యక్తిత్వ రహస్యాలు!

Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…

2 weeks ago