guppedantha manasu 9 august 2022 full episode
Guppedantha Manasu 9 Aug Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 ఆగస్టు 2022, మంగళవారం ఎపిసోడ్ 524 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మనకు ఇష్టమైన పని చేయడంలో ఒక ఆనందం ఉంటుంది సార్ అంటుంది వసుధర. తనను కేప్ లో రిషి కలుస్తాడు. కొందరు మనతో పాటు పెరుగుతుంటారు. ప్రయాణిస్తుంటారు. వాళ్లే ఒకసారి మనకు అర్థం కారు. ఎక్కడో ఉన్నవాళ్లు అర్థం చేసుకోవాలని మనం ఎందుకు అనుకోవాలి చెప్పు అంటాడు రిషి. మీరు ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని నేను ఎప్పుడూ అనుకోలేదు అని అంటుంది వసుధర. దీంతో మనం చాలా అనుకుంటాం కానీ.. అన్నీ అనుకున్నట్టు జరగవు కదా. నేను మాట్లాడేది కాఫీ గురించి. కాఫీ తాగుదామని వచ్చాను కానీ.. ఎందుకో నాకు కాఫీ తాగాలనిపించడం లేదు అని చెప్పి రిషి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
guppedantha manasu 9 august 2022 full episode
దీంతో రిషికి ఎలా తన ప్రేమ విషయం చెప్పాలో అర్థం కాదు. రిషి సార్ మీరు సాక్షిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అనుకుంటుంది వసుధర. కానీ.. తనకు ఎలా ఆ విషయం చెప్పాలో వసుధరకు అర్థం కాదు. మరోవైపు సాక్షి రిషిని కలుస్తుంది. థాంక్స్ రిషి.. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నువ్వు మన పెళ్లికి ఒప్పుకున్నావు. చాలా హ్యాపీ అంటుంది సాక్షి. రిషి పెళ్లి అంటే చాలా పనులు ఉంటాయి కదా. నీకోసం స్పెషల్ గా నీ పేరులోని మొదటి అక్షరం ఆర్ అనే ఉంగరం చేయిస్తున్నా. నువ్వు కూడా నా పేరులోని మొదటి అక్షరం ఎస్ తో ఉంగరం చేయించు అంటుంది సాక్షి. నువ్వు చేయించినప్పుడు నేను చేయించకుండా ఎలా ఉంటాను.. సరే అంటాడు రిషి.
సరే పదా మనం షాపింగ్ కు వెళ్దాం అంటుంది సాక్షి. దీంతో ఈ షాపింగ్ నాకు నచ్చదు. అదంతా నువ్వే చూసుకో. ప్లీజ్ నన్ను విసిగించకు అంటాడు రిషి. ఇంతలో అక్కడికి జగతి వస్తుంది. తనను చూసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు రిషి. ఏంటి ఆంటి అలా చూస్తున్నారు అని అడుగుతుంది సాక్షి.
సాక్షిని నువ్వు పెళ్లి చేసుకోవడం ఏంటి అని తన తండ్రిని రిషి నిలదీస్తాడు. ఎందుకు డాడ్.. అంటాడు రిషి. ఒకప్పుడు సాక్షి అంటేనే చిరాకు పడేవాడివి. ఇప్పుడు ఏంటి నువ్వు ఇలా సాక్షితో పెళ్లికి ఒప్పుకోవడం ఏంటి. చెప్పు రిషి మీరు ఊహించింది జరగనంత మాత్రాన అది తప్పుడు నిర్ణయం కాదు డాడ్ అంటాడు రిషి.
నేను ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇందులో ఎవరి బలవంతం లేదు అంటాడు రిషి. దీంతో చాలా చెప్పాలని ఎన్నో అడగాలని వచ్చాను. ఏం అడగలేక వెళ్తున్నాను అని చెప్పి తన డాడీ వెళ్లిపోతాడు. మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారేమో అని మనసులో అనుకుంటాడు రిషి.
మరోవైపు దేవత దగ్గరికి వెళ్లి నాకేంటి ఈ పరీక్ష అని అనుకుంటుంది వసుధర. రిషి సార్ నన్ను దూరం పెడుతున్నారని నేను అనుకోను. కానీ.. పరిస్థితులే నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నాయి అని అనుకుంటుంది వసుధర. మరోవైపు సాక్షి కలలు నిజం అవుతున్నాయని చెబుతుంది పెద్దమ్మ. దీంతో రిషి అసలు నన్ను కేర్ చేయడు ఆంటి అంటుంది సాక్షి. ఎందుకు అలా అంటావు. రిషి గురించి తెలిసిందే కదా అంటుంది ఆంటి. ఇంతలో రిషి అక్కడికి వస్తాడు.
సాక్షితో గొడవపెట్టుకుంటాడు రిషి. దీంతో సాక్షి నువ్వు పదా ఇక్కడినుంచి అని అంటుంది. ఆ తర్వాత జగతి, వసుధర ఇద్దరిని చూసి సాక్షి షాక్ అవుతుంది. అంతా నీవల్లే జరుగుతోంది. నువ్వెందుకు వచ్చావు అని అంటుంది సాక్షి. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.
Periods | మన దేశంలో ఇప్పటికీ పీరియడ్స్కు సంబంధించిన అనేక అపోహలు ఉన్నాయి. పీరియడ్స్ సమయంలో తల స్నానం చేయరాదు,…
Weight | బరువు తగ్గాలనుకునే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అయితే చాలామంది సరైన మార్గాన్ని ఎంచుకోకపోవడం వల్ల బరువు…
Liver Cancer | మన శరీరంలో అత్యంత కీలకమైన అవయవాల్లో కాలేయం (Liver) ఒకటి. ఇది శరీరాన్ని డిటాక్స్ చేస్తూ,…
Navaratri | నవరాత్రులు అనగానే దేశవ్యాప్తంగా భక్తి, శ్రద్ధతో దుర్గాదేవిని పూజించే మహోత్సవ కాలం. తొమ్మిది రోజులపాటు దుర్గాదేవి తొమ్మిది…
Xiaomi 17 Pro Max vs iPhone 17 Pr o max| టెక్ వరల్డ్లో మరో ఆసక్తికర పోటీ…
Bonus | తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల కార్మికులకు మరోసారి తీపి వార్త అందింది. ఇటీవలే దసరా పండుగ సందర్భంగా…
Vijaywada | విజయవాడలోని పవిత్ర ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారు ప్రతి రోజూ…
AP Free Bus Scheme | ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం విజయవంతంగా కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా…
This website uses cookies.