Guppedantha Manasu 9 Sep Today Episode : మహీంద్రా, జగతి పెళ్లి రోజును ఇంట్లో చేసేందుకు రిషి ఒప్పుకుంటాడా? వసుధార ఏం చేస్తుంది?
Guppedantha Manasu 9 Sep Today Episode : గుప్పెడంత మనసు సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 9 సెప్టెంబర్ 2022, శుక్రవారం ఎపిసోడ్ 551 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వసుధర.. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. నీకు ఏదైనా కావాలంటే అడుగు అంటాడు రిషి. దీంతో దేవయాని చెప్పిన విషయం గురించి ఆలోచిస్తుంది కానీ..అప్పుడైతే అడగదు. ఆ తర్వాత అక్కడి నుంచి ఇద్దరూ వెళ్లిపోతారు. రిషి ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోతాడు. తనలో తానే మాట్లాడుకుంటాడు. నువ్వు వసుధరతో మాట్లాడితే ఏదో తెలియని శక్తి వచ్చినట్టుగా అవుతుంది. వసుధార.. నాలుగు అక్షరాల అద్భుతం.. ఏంటో అని అనుకుంటాడు రిషి. జీవితంలో పోగొట్టుకున్నవి ఏవీ తిరిగి దొరకవు అంటారు. కానీ.. పోయింది అనుకున్న ప్రేమ.. చేయి జారింది అనుకున్న ప్రేమ మళ్లీ చేరింది అని అనుకుంటాడు రిషి. వసుధార లేని జీవితం నేను ఊహించుకుంటే అప్పుడు నేను.. నథింగ్. వసుధార నా జీవితంలోకి వచ్చాక ను సమ్ థింగ్.. ఎవ్రీథింగ్ అని అనుకుంటాడు రిషి.
తనతో కలిసి చేసిన మెమోరీస్ అనీ గుర్తుకు తెచ్చుకుంటాడు రిషి. వసుధార నా జీవితంలోకి వచ్చాకే ఈ రిషికి అందమైన మెమోరీస్ పెరిగాయి. జీవితంలో ఇన్ని మిస్ అయ్యానా.. చిన్నిచిన్న వాటిలో ఇంత ఆనందం ఉంటుందా అనిపించింది. కొబ్బరిబోండాలు, మొక్కజొన్న కంకులు, పానీపూరీ, చిన్నపిల్లల ఆటలు ఇవన్నీ వసుధార కలిశాక కొత్తగా అనిపిస్తున్నాయి. వసుధార.. అని అనుకుంటాడు. వసుధార ఫోన్ చేస్తా అని చెప్పింది. ఇంకా చేయలేదు ఏంటి. మరిచిపోయిందా.. ఏదో అడుగుతానని అంది. ఏం అడుగుతుంది అని అనుకుంటాడు రిషి. తను ఏం అడిగినా కాదని నేను ఎలా అనగలను. ఒకరకంగా చెప్పాలంటే నన్ను తీర్చి దిద్దిన శిల్పి తను. ఫోన్ చేయాలా లేక వెయిట్ చేయాలా అని అనుకుంటాడు రిషి. ఒకరి ఫోన్ కాల్ కోసం ఎదురు చూడటంలో కూడా ఇంత ఆనందం ఉంటుందా అని అనుకుంటుండగా వసుధార నుంచి ఒక వాయిస్ మెసేజ్ వస్తుంది.
రిషి సార్ ఏం కావాలో అడగమన్నారు కదా.. అడిగాక కాదనరని నమ్మకం ఉంది. నాదొక విన్నపం సార్.. జగతి మేడమ్, మహీంద్రా సర్ మ్యారేజ్ డే మీకు తెలియదు కదా. వాళ్ల మ్యారేజ్ ఫంక్షన్ ను ఇంట్లో చేయాలి. ఇదే నేను కోరుకునేది. నా చిన్న విన్నపాన్ని మీరు కాదనరని నేను ఆశిస్తున్నాను సార్ అని వాయిస్ మెసేజ్ పెడుతుంది వసు. దీంతో రిషికి చాలా కోపం వస్తుంది.
Guppedantha Manasu 9 Sep Today Episode : నాతో ఇష్టం లేని పనులు చేయిస్తున్నావా అని అడిగిన రిషి
వెంటనే ఉదయమే వసును కలుస్తాడు రిషి. తనకు నేను అడిగింది నచ్చలేదు కావచ్చు. తనకు కోపం వచ్చినా నేను మాత్రం వెనక్కి తగ్గను అని అనుకుంటుంది వసు. ఎందుకు కొందరు ఎదుటివాళ్లను అర్థం చేసుకోరు. జగతి మేడమ్ విషయంలో మా డాడ్ కోసం చాలా మెట్లు దిగాను. అయినా కూడా ఇంకా ఎందుకు నువ్వు వాళ్లనే పట్టుకొని వేలాడుతున్నావు.
ఈ ఫంక్షన్ కూడా నేనే చేయాలా.. అసలేంటి నీ ఉద్దేశం. కావాలనే నాతో ఇష్టం లేని పనులు చేయిస్తున్నావా. ఇంకా ఇంకా ఏం కావాలి వసుధార అంటాడు రిషి. దీంతో ప్రేమ సార్ అంటుంది వసు. ప్రేమేంటి.. నేను ఫంక్షన్ గురించి మాట్లాడుతుంటే నువ్వు ప్రేమ అంటావేంటి అంటాడు రిషి.
మీరు ఫంక్షన్ అంటన్నారు.. నేను ప్రేమ అంటున్నాను. కరెక్టే సార్.. మీరు ఫంక్షన్ తో ప్రేమ చూపించమని అడుగుతున్నాను సార్. ప్రేమతోనే ఫంక్షన్ చేయమంటున్నాను. మహీంద్రా సార్ కోసం చాలా మెట్లు దిగా అంటున్నారు. జగతి మేడమ్ కోసం చాలా ముందుకు వచ్చాను అంటున్నారు. జగతి మేడమ్ కోసం ఈ ఒక్కసారి ఇంకో మెట్టు దిగండి సార్ అంటుంది వసుధార.
ఒక మెట్టు దిగినంత మాత్రాన అది తప్పేం కాదు. జగతి మేడమ్ కు మహీంద్రా సార్ అంటే ప్రాణం. మహీంద్రా సార్ కు జగతి మేడమ్ అంటే ప్రాణం. మీకు మహీంద్రా సార్ అంటే ప్రాణం. ఈ లెక్కల్లో తేడా ఎక్కడుంది సార్ అంటుంది వసుధర. మహీంద్రా సార్ సంతోషమే మీ సంతోషం. మహీంద్రా సార్ సంతోషమే జగతి మేడమ్ సంతోషం అంటుంది వసుధర.
పుట్టిన రోజులు, పెళ్లి రోజులు సంవత్సరానికి ఒకసారే వస్తాయి సార్. మీరు చేసినా చేయకపోయినా తేడా ఏం ఉండదు. మీరు కూడా అదే అభిప్రాయంలో ఉన్నారేమో. సెలబ్రేట్ చేయకపోతే పెద్ద నష్టమేమీ ఉండదు సార్. పెళ్లి రోజు మీ చేతుల మీదుగా మనస్ఫూర్తిగా జరిపించండి.. ఆయన ఎంత సంతోషిస్తారో అంటుంది వసుధర. ఆ తర్వాత ఇద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు.
మరోవైపు జగతి.. రిషి గురించే ఆలోచిస్తూ ఉంటుంది. నా జీవిత ప్రయాణంలో ఎన్నో మలుపులు, అవమానాలు. ఇవన్నీ దాటుకొని ఇక్కడికి వచ్చాను. ఇక ముందు ఏం జరగనుందో అని అనుకుంటుంది జగతి. ఇంతలో అక్కడికి వస్తాడు మహీంద్రా. నీకోసం ఓ గిఫ్ట్ అని అంటాడు.
ఏంటి మహీంద్రా అంటుంది జగతి. మన మ్యారేజ్ డే కు గిఫ్ట్ కూడా ఇవ్వొద్దా అంటాడు మహీంద్రా. మన పెళ్లి రోజు జరుపుకుంటాం భార్యభర్తలం కానీ.. మనం తల్లిదండ్రులం కూడా. మనం పెళ్లి రోజు జరుపుకుంటే మన సంతోషం రిషిని ఇబ్బంది పెట్టకూడదు అని జగతి చెప్పడం రిషి వింటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.