Hansika : బొద్దుగుమ్మ హన్సిక.. ఈ పేరు తలుచుకోగానే బొద్దు అందాలతో కళ్లముందుకు ఆమె అలా వచ్చేస్తుంది. ఈ బొద్దందాలతోనే ఇండస్ట్రీని షేక్ చేస్తుంది హన్సిక. అప్పుడెప్పుడో దేశముదురు సినిమాతో తెలుగు వాళ్లకు పరిచయమైన బ్యూటీ హన్సిక . దానికి ముందే చిన్నపుడే బాలనటిగా క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. వెంటనే హీరోయిన్ అయిపోవడం.. స్టార్ అయిపోయింది హన్సిక.తెలుగులో ఈ అమ్మడికి సరైన ఆఫర్స్ రాకపోయిన తమిళంలో మంచి ఆఫర్స్ అందుకుంటుంది.‘పార్ట్‌నర్’, ‘రౌడీ బేబీ’, ‘మై నేమ్ ఈజ్ శ్రుతి’, ‘105 మినిట్స్’, ‘మహా’, ఒక ఓటీటీ ప్రాజెక్ట్.
ఇంకా పేరు ఖరారు కాని మూడు చిత్రాలు.. ఇవీ హన్సిక చేతిలో ఉన్నవి. ఇన్ని సినిమాల్లో కనిపించనున్నారు కాబట్టే 2022 తనకు చాలా ప్రత్యేకం అంటున్నారామె. తెలుగులో దేశ ముదురు, కందిరీగ లాంటి సినిమాలు విజయం సాధించినా కూడా హన్సిక కెరీర్ మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుంది. అందుకే తమిళనాడు వెళ్లి అక్కడ స్టార్ అయిపోయింది. ఓ టైమ్‌లో నెంబర్ వన్ కూడా అయింది.ఖుష్బూ మాదిరే ఈమెకు కూడా గుడి కట్టారు అభిమానులు. అంతలా అభిమానాన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు ఫొటో షూట్స్‌తో రచ్చ చేస్తుంటుంది.
తాజాగా ఈ ముద్దుగుమ్మ క్యూట్ స్మైల్‌తో హోయలు పోతూ కనిపించి అందరి మనసులు దోచుకుంది. హన్సిక క్యూట్‌నెస్ చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. ఆమె అందచందాలకు మంత్ర ముగ్ధులై క్యూట్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం హన్సిక పిక్స్ వైరల్‌గా మారాయి. కాగా, వరుస లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తున్న హన్సిక తెలుగులో ‘మై నేమ్ ఈజ్ శృతి’ అనే క్రైమ్ థ్రిల్లర్‌లో నటిస్తోంది. ‘ద హిడెన్ ట్రూత్’ అనేది క్యాప్షన్. డి.శ్రీనివాస్ ఓంకార్ దర్శకుడు. బురుగు రమ్య ప్రభాకర్ నిర్మాత. ఈ మూవీ టీజర్‌ను ని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ లాంచ్ చేశారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.