Nagarjuna : వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న నాగార్జునకి బంగార్రాజు మూవీ రూపంలో మంచి హిట్ దక్కింది. సంక్రాంతికి విడుదలైన ఏకైక పెద్ద సినిమా, అలాగే గ్రామీణ నేపథ్యానికి సంబంధించిన స్టోరీ కావడం ‘బంగర్రాజు’కు బాగా కలిసొచ్చింది. ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించగా నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. నాగార్జున సరసన రమ్యకృష్ణ, నాగచైతన్య సరసన కృతిశెట్టి నటించారు. ఇప్పుడు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తుంది. మొత్తంగా రెండు రోజుల్లో రూ. 36 కోట్లు వసూళ్లు చేసినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. దీనికి సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ని కూడా విడుదల చేసింది.
2016 సంక్రాంతి కానుక రిలీజైన సోగ్గాడే చిన్నినాయన సినిమాకి సీక్వెల్‌గా తెరకెకెక్కిన బంగార్రాజు సినిమా మూడో రోజు కూడా అదే కంటిన్యూ చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది. దీంతో మీడియాతో మాట్లాడిన నాగార్జున..సినిమా సక్సెస్ అవ్వడం పట్ల ఆనందం వ్యక్తం చేసాడు. బంగార్రాజు సినిమాకి కూడా సీక్వెల్ వస్తుందా అని అడగ్గా.. ఆయన రాదు అని చెప్పలేం కానీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అంటూ హింట్ ఇచ్చాడు.సోగ్గాడే చిన్నినాయన సినిమా ఎక్కడ ఆగిపోయిందో.. బంగార్రాజు అక్కడే మొదలయ్యింది.
బంగార్రాజులో ఒక నాగార్జున క్యారెక్టర్‌కు కొడుకుగా, మరో నాగార్జున క్యారెక్టర్‌కు మనవడిగా ఆకట్టుకున్నాడు నాగచైతన్య. ఇంతకు ముందు ఈ తండ్రీకొడుకులు కలిసి ‘మనం’ చిత్రంలో నటించారు. మరోసారి వీరిద్దరి స్క్రీన్ ప్రెసెన్స్.. బంగార్రాజుకు పెద్ద ప్లస్‌గా మారింది. ఈ సినిమాలో ముగింపులో చూపినట్లుగా మరో సినిమాకూడా తీయవచ్చు. దర్శకుడు ఓ క్లూ కూడా ఇచ్చాడు. ప్రతి 24 ఏళ్ళకు శివాలయంలో హోమం చేయాలని.. కానీ ఇప్పుడప్పుడే సినిమా చేయలేం. ఆలోచించి అన్నీ అనుకూలిస్తే అప్పుడు చూద్దాం అని తెలిపారు నాగార్జున.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.